Telangana

News May 4, 2024

అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

సూర్యాపేట కొత్త బస్టాండ్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని వివరాలు తెలియ రాలేదని సిఐ రాజశేఖర్ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News May 4, 2024

10ఏళ్ల నిజానికి.. 100 రోజుల అబద్ధానికి మధ్య పోరు: ఎమ్మెల్సీ చల్లా

image

రాష్ట్రంలో పదేళ్ల నిజానికి, 100 రోజుల అబద్ధానికి మధ్య పోరు జరుగుతోందని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. అలంపూర్ పట్టణంలోని బీఆర్ఎస్ ఫంక్షన్ హాల్లో శనివారం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన కేసీఆర్‌తో కలిసి ప్రయాణించాలని కోరారు. కారు గుర్తుకు ఓటు వేసి ఆర్ఎస్ ప్రవీణ్‌ను గెలిపించాలన్నారు.

News May 4, 2024

HYD: పార్లమెంట్ ఎన్నికలు.. పోలీసుల కవాతు..!

image

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడటం, ప్రజలకు మరింత భద్రత కల్పించడంలో ఇదొక భాగమని అన్నారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్‌ల వద్ద పకడ్బందీ భద్రత చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

KMR: నలుగురు విలేకరులపై కేసు.. రిమాండ్‌కు తరలింపు

image

సేల్స్ టాక్స్ డిపార్ట్మెంట్ అధికారులమని బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడిన నలుగురు విలేకరులపై కేసు నమోదు చేసి శనివారం రిమాండ్‌కు తరలించినట్లు ఎల్లారెడ్డి DSP శ్రీనివాసులు తెలిపారు. పెర్కిట్ గ్రామానికి చెందిన నిఖిల్ HYD నుంచి వాహనంలో గూడ్స్ తీసుకుని వెళ్తున్నాడు. ఈ క్రమంలో మల్లుపేట్ వద్ద నలుగురు రిపోర్టర్లు కారులో వచ్చి సేల్స్ టాక్స్ అధికారులమని బెదిరించి రూ.3000 లాక్కున్నటక్లు DSP వెల్లడించారు.

News May 4, 2024

HYD: ప్రధాని మోదీపై దానం నాగేందర్ వివాదాస్పద వ్యాఖ్యలు

image

ప్రధాని మోదీపై కాంగ్రెస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బంజారాహిల్స్‌లోని లేక్ వ్యూ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బూత్ కార్యకర్తల సమావేశంలో దానం నాగేందర్ మాట్లాడుతూ.. మహిళలకు మంగళసూత్రం ఎంత విలువైనదో, భార్య వదిలిపెట్టిపోయిన మోదీకి ఏం తెలుసు అంటూ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీపై మోదీ దుష్ప్రచారం మానుకోవాలని అన్నారు.

HYD: కరెంట్ బిల్లు చూసి షాక్ అయ్యాడు..!

image

HYD మల్కాజిగిరి వసంతపురి కాలనీకి చెందిన నవీన్ కుమార్ అనే వ్యక్తికి ఏకంగా రూ.1,75,173 కరెంటు బిల్లు వచ్చిందని వాపోయాడు. జీరో బిల్లు రావాల్సిన అతడికి రూ.లక్షల్లో బిల్లు రావడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఈ విషయమై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసేందుకు వెళితే వారు స్పందించడం లేదని బాధితుడు తెలిపాడు. అంతకుముందు రెండు నెలల్లో ఒకసారి రూ.600, మరోసారి రూ.1,438 బిల్లు వచ్చినట్లు తెలిపారు.

లింగం బావిలో ఈతకు వెళ్లి యువకుడు మృతి

image

గద్వాలలోని లింగం బావిలో ఈతకు వెళ్లి యువకుడు మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. అంబేడ్కర్ నగర్ కాలనీకి చెందిన రంగస్వామి లింగం బావిలో ఈత కొట్టేందుకు పైనుంచి దూకాడు. ప్రమాదవశాత్తు తలకు గాయమైంది. దీంతో అతడు బావిలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మున్సిపల్, ఫైర్ సిబ్బంది మృతదేహాన్ని బయటకు తీశారు. దీంతో కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి.