Telangana

News May 4, 2024

HYD: కరెంట్ బిల్లు చూసి షాక్ అయ్యాడు..!

image

HYD మల్కాజిగిరి వసంతపురి కాలనీకి చెందిన నవీన్ కుమార్ అనే వ్యక్తికి ఏకంగా రూ.1,75,173 కరెంటు బిల్లు వచ్చిందని వాపోయాడు. జీరో బిల్లు రావాల్సిన అతడికి రూ.లక్షల్లో బిల్లు రావడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఈ విషయమై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసేందుకు వెళితే వారు స్పందించడం లేదని బాధితుడు తెలిపాడు. అంతకుముందు రెండు నెలల్లో ఒకసారి రూ.600, మరోసారి రూ.1,438 బిల్లు వచ్చినట్లు తెలిపారు.

లింగం బావిలో ఈతకు వెళ్లి యువకుడు మృతి

image

గద్వాలలోని లింగం బావిలో ఈతకు వెళ్లి యువకుడు మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. అంబేడ్కర్ నగర్ కాలనీకి చెందిన రంగస్వామి లింగం బావిలో ఈత కొట్టేందుకు పైనుంచి దూకాడు. ప్రమాదవశాత్తు తలకు గాయమైంది. దీంతో అతడు బావిలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మున్సిపల్, ఫైర్ సిబ్బంది మృతదేహాన్ని బయటకు తీశారు. దీంతో కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి.

News May 4, 2024

జనగామ: గుర్తుతెలియని మృతదేహం లభ్యం

image

లింగాలఘనపూర్ మండలం నెల్లుట్ల గ్రామశివారులో గుర్తుతెలియని మృతదేహం దొరికింది. దీకొండ రాజు పొలం వద్ద 50 సంవత్సరాల మధ్య ఉండే గుర్తుతెలియని పురుషుని మృతదేహం లభ్యమయింది. మృతుడిపై బ్లాక్ కలర్ ప్యాంటు, నలుపు గీతల చొక్కా వుంది. డెడ్‌బాడీ పూర్తి ఎండిపోయి బిగిసుకుపోయినట్టు ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 4, 2024

పాలమూరు గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే: సీఎం రేవంత్

image

మహబూబ్‌నగర్ పార్లమెంట్ గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు కొత్తకోటలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ‘మహబూబ్‌నగర్‌లో లక్ష మెజారిటీతో వంశీచంద్ రెడ్డి గెలవడం ఖాయం. వారసత్వంగా నేను రాజకీయాలు చేయడం లేదు. గతంలో వనపర్తిలో కాంగ్రెస్ గెలుపు కోసం గల్లీగల్లీ తిరిగా. పాలమూరులో 14 సీట్లకు 12 ఇచ్చి ఆశీర్వదించి నందుకు మీ అందరికీ ధన్యవాదాలు’ అని అన్నారు.

News May 4, 2024

HYD: కుళ్లిన మహిళ మృతదేహం కలకలం

image

ఓ మహిళ మృతదేహం కలకలం సృష్టించిన ఘటన HYD బాలాపూర్ PS పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బాలాపూర్ ఉస్మాన్ నగర్ చెరువులో 30-40 ఏళ్ల వయసు గల ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం కుళ్లిన స్థితిలో ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి పరిశీలించి, ఆమె ముస్లిం మహిళగా అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 4, 2024

జగిత్యాల: బీఆర్ఎస్‌కు ఆరుగురు కౌన్సిలర్లు రాజీనామా

image

జగిత్యాల మున్సిపాలిటీలోని బీఆర్ఎస్‌కు చెందిన ఆరుగురు కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని వదులుకున్నారు. రేణుక (7వ వార్డు కౌన్సిలర్), పద్మ (17వ వార్డు), భారతి (10వ వార్డు), రజిని (33వ వార్డు), లావణ్య (38వ వార్డు), గంగాసాగర్ (21వ వార్డు) రిజైన్ చేశారు. అయితే జగిత్యాలలో కేసీఆర్ రోడ్‌షో నిర్వహించనున్న నేపథ్యంలో వారు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

News May 4, 2024

HYD: కుళ్లిన మహిళ మృతదేహం కలకలం

image

ఓ మహిళ మృతదేహం కలకలం సృష్టించిన ఘటన HYD బాలాపూర్ PS పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బాలాపూర్ ఉస్మాన్ నగర్ చెరువులో 30-40 ఏళ్ల వయసు గల ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం కుళ్లిన స్థితిలో ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి పరిశీలించి, ఆమె ముస్లిం మహిళగా అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

News May 4, 2024

భువనగిరి: గుర్తుతెలియని మృతదేహం లభ్యం

image

భువనగిరిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికులు పోలీసుల వివరాలిలా.. పట్టణ పరిధిలోని సంజీవ్ నగర్ సమీపాన 60 సంవత్సరాల వయసుగల ఓ వృద్ధుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్థానికుల సహాయంతో భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు భిక్షాటన చేసే వ్యక్తిగా భావిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 4, 2024

ఖమ్మంలో సీఎం కాన్వాయ్‌ తనిఖీ

image

కొత్తగూడెంలో కాంగ్రెస్ బహిరంగ సభకు వచ్చిన సీఎం రేవంత్ కాన్వాయ్‌ను పోలీసులు తనిఖీ చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్ వద్ద వాహనాలను ఆపారు. సీఎం సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలకు సహకరించారు. కొత్తగూడెంలో బహిరంగ సభకు సీఎం హెలికాప్టర్‌‌లో వెళ్లిన విషయం తెలిసిందే. హెలిప్యాడ్ నుంచి సభ వద్దకు చేర్చడానికి, సభ నుంచి హెలిప్యాడ్ వద్దకు సీఎంను చేర్చేందుకు కాన్వాయ్ అవసరం ఉంటుంది.