Telangana

News May 4, 2024

MBNR: ఎంపీ అభ్యర్థుల గెలుపును శాసించేది వీరే

image

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపోటములకు మహిళా ఓట్లే కీలకంగా మారాయి. ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్ సభ స్థానాల్లోనూ మహిళా ఓటర్లే అధికంగా ఉన్న నేపథ్యంలో ఎంపీ అభ్యర్థుల గెలుపును శాసించేది వీరే. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ పురుషుల కంటే మహిళలే అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల సంఘం ప్రకటించిన తాజా ఓటర్లజాబితా ప్రకారం MBNRలో 50.53, NGKLలో 50.24 శాతం మహిళా ఓటర్లు ఉన్నారు

News May 4, 2024

సికింద్రాబాద్ ‘సికందర్’ ఎవరు?

image

సికింద్రాబాద్ లోక్‌సభ స్థానంలో గెలిచిన పార్టీనే కేంద్రంలో అధికారం చేపడుతుందనే సెంటిమెంట్ ఉంది. 1998 నుంచి ఇలాగే జరుగుతోంది. ఈసారి ఇక్కడ సిట్టింగ్ MP కిషన్ రెడ్డి (BJP), దానం నాగేందర్ (INC), పద్మారావు గౌడ్ (BRS) పోటీ పడుతున్నారు. ముగ్గురూ బలమైన నేతలే కావడంతో పోరు రసవత్తరంగా ఉండనుంది. ఇక్కడ 12 సార్లు కాంగ్రెస్, 5 సార్లు BJP, ఓసారి తెలంగాణ ప్రజా సమితి పార్టీ గెలిచింది. ఈసారి సికందర్ ఎవరో మీ కామెంట్?

News May 4, 2024

సికింద్రాబాద్ ‘సికందర్’ ఎవరు?

image

సికింద్రాబాద్ లోక్‌సభ స్థానంలో గెలిచిన పార్టీనే కేంద్రంలో అధికారం చేపడుతుందనే సెంటిమెంట్ ఉంది. 1998 నుంచి ఇలాగే జరుగుతోంది. ఈసారి ఇక్కడ సిట్టింగ్ MP కిషన్ రెడ్డి (BJP), దానం నాగేందర్ (INC), పద్మారావు గౌడ్ (BRS) పోటీ పడుతున్నారు. ముగ్గురూ బలమైన నేతలే కావడంతో పోరు రసవత్తరంగా ఉండనుంది. ఇక్కడ 12 సార్లు కాంగ్రెస్, 5 సార్లు BJP, ఓసారి తెలంగాణ ప్రజా సమితి పార్టీ గెలిచింది. ఈసారి సికందర్ ఎవరో మీ కామెంట్?

News May 4, 2024

KNR: ఈ సారైనా పోలింగ్ శాతం పెరిగేనా?

image

ఓటర్లు అసెంబ్లీ ఎన్నికలపై చూపినంత ఆసక్తి లోక్‌సభ ఎన్నికలపై చూపడం లేదు. కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య పెరుగుతున్నా పోలింగ్ శాతం మాత్రం పెరగడం లేదు. 2014లో జరిగిన ఎన్నికల్లో 74.71 శాతం పోలింగ్ నమోదు కాగా.. 2019 ఎన్నికల నాటికి అది కాస్తా 69.52 శాతంకు తగ్గింది. ఈసారి ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్యను మరింత పెంచాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు.

News May 4, 2024

కూరగాయలు, పండ్లు అమ్మిన కడియం కావ్య

image

కాజీపేట, రహమాత్‌నగర్ చౌరస్తాలో శనివారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి డా.కడియం కావ్య ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్కెట్లో కూరగాయలు అమ్ముకునే వ్యాపారులను, రైతులను కలిశారు. ఈ ఎన్నికల్లో తనకే ఓటు వేయాలని వారిని కోరారు. అనంతరం మార్కెట్లో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు అమ్మారు.

News May 4, 2024

మాచారెడ్డి: ‘మా గ్రామాన్ని దత్తత తీసుకోండి‘

image

ఎన్నికలు సమీపిస్తున్న వేళ గ్రామాల్లో వినూత్న పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. తాజాగా మాచారెడ్డి మండలం లక్ష్మీరావు పల్లి గ్రామంలో మాట ఇవ్వండి-ఓటు అడగండి ఫ్లెక్సీ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇందులో గ్రామాన్ని దత్తత తీసుకోవాలని ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గ్రామస్థులు కోరినట్లుగా ఉంది.

News May 4, 2024

వర్గల్: పెళ్లి ఇష్టం లేక యువతి ఆత్మహత్య

image

వర్గల్ మండలం వేలూరు గ్రామానికి చెందిన మౌనిక (21) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. వేలూరు గ్రామానికి చెందిన మల్లేశం కూతురు మౌనిక టైలరింగ్ చేస్తుంది. గత నెల 27న మౌనికకు పెళ్లి చూపులు నిర్వహించారు. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక పురుగుల మందు సేవించింది. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

News May 4, 2024

MBNR: భానుడి భగభగలు.. వీటికి ఫుల్ డిమాండ్

image

భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. జిల్లాలో ప్రతీ 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదై పలు ప్రాంతాలు రెడ్‌జోన్ లోకి వెళ్లాయి. ఈ పరిస్థితుల్లో వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు రకరకాలుగా యత్నిస్తున్నారు. కొందరు కొబ్బరి బోండాలు, శీతల పానీయాలను తాగు తుండగా, ఎక్కువ మంది తాటి ముంజలను తినేందుకు ఇష్టపడుతున్నారు. వేసవిలోనే ప్రత్యేకంగా లభించే తాటి ముంజలకు జిల్లాలో డిమాండ్ విపరీతంగా పెరిగింది.

News May 4, 2024

ఆదిలాబాద్: రేపు ఇద్దరు అగ్రనేతల రాక

image

రేపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇద్దరు అగ్రనేతలు రానున్నారు. ఈ నెల 5వ తేదీన ఒకే రోజు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు రావడం ఆసక్తి రేపుతోంది. ఆదిలాబాద్ లోక్ సభ పరిధిలోకి వచ్చే నిర్మల్‌లో కాంగ్రెస్ నిర్వహించే భారీ బహిరంగ సభకు రాహుల్ గాంధీ హజరు కానుండగా.. కాగజ్‌నగర్‌లో బీజేపీ నిర్వహించనున్న బహిరంగ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

News May 4, 2024

కొత్తగూడెం చేరుకున్న సీఎం రేవంత్

image

ఖమ్మం పార్లమెంట్ ఎన్నిక ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తగూడేనికి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో సీఎం కొద్దిసేపటి క్రితం ప్రగతి మైదాన్లో దిగారు. ప్రకాశం స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన సభా స్థలికి చేరుకున్నారు.