Telangana

News May 4, 2024

భువనగిరి: వడదెబ్బతో గ్రామపంచాయతీ ఉద్యోగి మృతి

image

గ్రామపంచాయతీ ఉద్యోగి వడదెబ్బతో మృతి చెందిన ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. గ్రామస్థుల వివరాలిలా.. భువనగిరి మండలం జమ్మాపురానికి చెందిన మాదాను కస్పరాజు శనివారం గ్రామంలో నీరు సరఫరా చేస్తుండగా వడదెబ్బతో స్పృహ తప్పి పడిపోయాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పెద్దదిక్కును కోల్పోవడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.

News May 4, 2024

HYD: ‘ఎన్నికల తర్వాత మెట్రో రెండో దశ పనులు’

image

లోక్‌సభ ఎన్నికల అనంతరం మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్టుపై కార్యాచరణ చేపట్టనున్నట్లు HYD మెట్రో రైల్ ఎండీ NVS రెడ్డి తెలిపారు. రెండో దశపై ఇప్పటికే DPRను సిద్ధం చేసినట్లు చెప్పారు. ఎన్నికల తర్వాత కేబినెట్ అనుమతి కోసం DPRను అందజేయనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం కేంద్రం ఆమోదంతో మెట్రో రెండో దశ పనులు ప్రారంభమవుతాయన్నారు. LB నగర్-శంషాబాద్ విమానాశ్రయం వరకు పనులను చేపట్టనున్నట్లు తెలిపారు.

News May 4, 2024

HYD: ‘ఎన్నికల తర్వాత మెట్రో రెండో దశ పనులు’

image

లోక్‌సభ ఎన్నికల అనంతరం మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్టుపై కార్యాచరణ చేపట్టనున్నట్లు HYD మెట్రో రైల్ ఎండీ NVS రెడ్డి తెలిపారు. రెండో దశపై ఇప్పటికే DPRను సిద్ధం చేసినట్లు చెప్పారు. ఎన్నికల తర్వాత కేబినెట్ అనుమతి కోసం DPRను అందజేయనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం కేంద్రం ఆమోదంతో మెట్రో రెండో దశ పనులు ప్రారంభమవుతాయన్నారు. LB నగర్-శంషాబాద్ విమానాశ్రయం వరకు పనులను చేపట్టనున్నట్లు తెలిపారు.

News May 4, 2024

ఆదిలాబాద్: MLC ఎన్నికలు మళ్ళీ ఉంటాయా..?

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో మరో కుదుపు ఏర్పడింది. ఆదిలాబాద్ MLC సభ్యుడు దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడం అన్ని రాజకీయ పార్టీల్లో తీవ్ర కలకలం రేపింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు మరోసారి నిర్వహించక తప్పదా అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. విఠల్ సుప్రీం కోర్టుకు వెళితే అక్కడి నుంచి వచ్చే ఫలితాన్ని బట్టి ఏం జరుగుతుందో ఆసక్తి నెలకొంది.

News May 4, 2024

MBNR: మండే ఎండలో రాజకీయ కాక.!!

image

ఉమ్మడి జిల్లాలో రాజకీయం కాకలు రేపుతోంది. మండు వేసవిలో వచ్చిన ఎన్నికలు ఎండల తీవ్రతలాగే.. రాజకీయ వేడి కూడా పెరుగుతోంది. ఉమ్మడి పాలమూరులోని NGKL, MBNR పార్లమెంటు నియోజకవర్గాలలో అభ్యర్థులు పెద్ద ఎత్తున పోటీలో ఉన్నా ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, BJP, BRS అభ్యర్థుల మధ్యనే ఉన్నది. అధికార కాంగ్రెస్ ఇటు ప్రచారంతో పాటు.. వివిధ పార్టీల ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలను చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

News May 4, 2024

ఎండీ కావ్య కావాలి.. కడియం కావ్య ఎలా అవుతుంది?: ఆరూరి

image

హన్మకొండ జిల్లా దామెరలో నిర్వహించిన ప్రచారంలో వరంగల్ BJP ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేశ్.. కడియం కావ్యపై కీలక వ్యాఖ్యలు చేశారు. తండ్రి ఎమ్మెల్యే, బిడ్డ ఎంపీనా? ఇవేమైనా రాజరికమా అని ఎమ్మెల్యే కడియంను ఉద్దేశించి మాట్లాడారు. ముస్లింను పెళ్లి చేసుకున్న ఆమె కడియం కావ్య ఎలా అవుతుందని, ఎండీ కావ్య అవుందని మండిపడ్డారు. NTR, KCR, చంద్రబాబులను వెన్నుపోటు పొడిచిన ఘనత కడియం శ్రీహరిదన్నారు.

News May 4, 2024

ప్రతీ ఎకరాకు సాగునీరు అందిస్తాం: ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి

image

పాలమూరులో సాగుకు యోగ్యమైన ప్రతీ ఎకరాకు సాగునీరు అందించేందుకు, రెండేళ్లలో పాలమూరు-రంగారెడ్డి, మక్తల్- నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకాలు కృషి చేస్తానని మహబూబ్‌నగర్ కాంగ్రెస్ MP అభ్యర్థి వంశీచంద్ రెడ్డి అన్నారు. ‘పార్లమెంట్ పరిధిలో ప్రతీ నిరుద్యోగికి ఉద్యోగం కల్పించేందుకు పరిశ్రమలు, టూ టైర్ ఐటీ హబ్ లను డెవలప్ చేస్తా. నారాయణపేటకు దక్కకుండా పోయిన సైనిక్ స్కూల్ ను మంజూరు చేయిస్తా’ అని తెలిపారు.

News May 4, 2024

KTDM: స్నానం చేస్తుండగా కాలువలో పడి వ్యక్తి మృతి

image

స్నానం చేస్తూ కాలువలో జారి పడి వ్యక్తి మృతి చెందిన ఘటన చంద్రుగొండ మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన కథన ప్రకారం.. మండలంలోని బెండలపాడు వద్ద సీతారామ ప్రాజెక్టు కాలువ కూలీ పనులకు ఒడిశా నుంచి కొంతమంది వచ్చారు. కాలువలో స్నానం చేస్తుండగా జారిపడి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. 

News May 4, 2024

MLC ఉప ఎన్నికకు 7 నామినేషన్లు

image

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండోరోజు నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. తొలిరోజు ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేసిన విషయం తెలిసిందే. రెండోరోజు నలుగురు అభ్యర్థులు తమ నామపత్రాలను రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. దీంతో ఇప్పటి వరకు ఎమ్మెల్సీ ఎన్నికకు దాఖలైన నామినేషన్ల సంఖ్య ఏడుకు చేరింది. ఈ నెల 9వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు గడువుంది.

News May 4, 2024

నిజామాబాద్: గర్భిణి మెడలో బంగారు గొలుసు చోరీ

image

ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణి మెడలో నుంచి బంగారు గొలుసు అపహరణకు గురైన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. నిజామాబాద్ జిల్లా గగ్గుపల్లి గ్రామానికి చెందిన అంజలి కడుపు నొప్పితో వైద్యం కోసం ఆస్పత్రిలో చేరింది. ఈనెల 1వ తేదీ రాత్రి అంజలి మెడలో నుంచి 2 1/2 తులాల గొలుసు, రెండు సెల్ పోన్లను అపహరించారు. ఉదయం అంజలి మెడలోని బంగారు గొలుసు సెల్ ఫోన్లు చోరీకి గురైన విషయం భర్త నరేశ్‌కు తెలిపింది. కేసు నమోదైంది.