Telangana

News May 4, 2024

HYD: రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి

image

HYDలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి చెందింది. SI శ్రీలత వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లా మోరంచపల్లికి చెందిన సాయి అశ్రితరెడ్డి(22) మాదాపూర్‌లోని ప్రైవేటు హాస్టల్లో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. గురువారం బాచుపల్లిలోని తన స్నేహితురాలి వద్దకు వచ్చి తిరుగు ప్రయాణంలో ర్యాపిడో బుక్ చేసుకుంది. రాత్రి 12.30 గంటల సమయంలో JNTU సిగ్నల్ వద్దకు రాగానే లారీ ఢీకొని మృతి చెందింది.

News May 4, 2024

WGL: రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలుపు (REWIND)

image

లోక్‌సభ ఎన్నికలు మరో వారం రోజులుండగానే.. ఇటీవల ఖాళీ అయిన నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ ఎమ్మెల్సీ ఎన్నిక సందడి మొదలైంది. కాగా, 2021లో గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా గెలవడంతో తాజా ఎన్నిక అనివార్యమైంది. ఆ ఎన్నికల్లో గెలుపుకోసం 1,83,167 ఓట్లు అవసరం కాగా మొదటి ప్రాధాన్యతా ఓట్లలో ఎవరికీ 50శాతానికి మించి రాలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లతో పల్లా గెలిచారు.

News May 4, 2024

HYD: రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి

image

HYDలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి చెందింది. SI శ్రీలత వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లా మోరంచపల్లికి చెందిన సాయి అశ్రితరెడ్డి(22) మాదాపూర్‌లోని ప్రైవేటు హాస్టల్లో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. గురువారం బాచుపల్లిలోని తన స్నేహితురాలి వద్దకు వచ్చి తిరుగు ప్రయాణంలో ర్యాపిడో బుక్ చేసుకుంది. రాత్రి 12.30 గంటల సమయంలో JNTU సిగ్నల్ వద్దకు రాగానే లారీ ఢీకొని మృతి చెందింది.

News May 4, 2024

WGL: కాంగ్రెస్, బీఆర్ఎస్ ఫిక్స్.. BJP నుంచి అతనేనా..?

image

WGL-NLG-KMM పట్టభద్రుల MLC నామినేషన్ల స్వీకరణ మొదలైంది. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేయగా.. BRS తమ అభ్యర్థిగా వరంగల్‌కు చెందిన రాకేష్ రెడ్డిని ప్రకటించింది. BJP నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి, గతంలో ఈ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. మూడు పార్టీలు గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

News May 4, 2024

బెల్లంపల్లి: పరీక్షలకు భయపడి విద్యార్థిని ఆత్మహత్య

image

పరీక్షలకు భయపడి బెల్లంపల్లి పట్టణంలోని ఇంక్లైన్ బస్తీకి చెందిన మహా శివప్రియ(20) ఆత్మహత్య చేసుకుంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని ఫార్మసీ కళాశాల సమీపంలోని ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ఫార్మా డీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. శుక్రవారం నుంచి పరీక్షలు ప్రారంభమవగా ఉత్తీర్ణత సాధిస్తానో లేదో అని భయాందోళన చెంది ఉదయం హాస్టల్ భవనం రెండో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది.

News May 4, 2024

BREAKING.. హన్మకొండ జిల్లాలో దారుణం

image

హన్మకొండ జిల్లా దామెర మండలం ఉరుగొండలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఆడ శిశువును పూడ్చిపెట్టారు. గమనించిన స్థానికులు మట్టి తొలగించి శుశువును బయటకు తీశారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 4, 2024

సిద్దిపేట: ఉద్యోగం పేరుతో యువతికి రూ16.45 లక్షలు టోకరా

image

ఓ యువకుడు ఆన్‌లైన్ ద్వారా యువతిని మోసం చేసి జైలు పాలయ్యాడు. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి గ్రామానికి చెందిన అరవింద్ సిద్దిపేట‌కు చెందిన ఓ యువతిని ఉద్యోగం పేరుతో మోసం చేశాడు. ఆమె నుంచి రూ.16,75,750ల నగదును ఆన్‌లైన్ ద్వారా తీసుకున్నాడు. అనంతరం ఫోను ఆఫ్ చేయడంతో మోసపోయానని గ్రహించిన యువతి సిద్దిపేట పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు విచారణ చేపట్టి అరవింద్‌ను అరెస్ట్ చేశారు.

News May 4, 2024

ఉమ్మడి పాలమూరుకు అధినేతల రాక

image

పార్లమెంట్‌ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఉమ్మడి జిల్లాలో ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఆయా పార్టీల అగ్ర నేతల పర్యటనలు పెరుగుతున్నాయి. ఈనెల 5న AICC అగ్రనేత రాహుల్‌ గాంధీ గద్వాల జిల్లా ఎర్రవల్లిలో నిర్వహించనున్న సభలో పాల్గొననున్నారు. అలాగే ప్రధాని మోదీ ఈనెల10న NRPTకు రానున్నారు. నేడు రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి కొత్తకోటలో సాయంత్రం నిర్వహించనున్న కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొననున్నారు.

News May 4, 2024

త్వరలో నూతన హంగులతో చర్లపల్లి రైల్వే స్టేషన్!

image

చర్లపల్లి రైల్వే స్టేషన్ త్వరలో నూతన హంగులతో ప్రజలందరికీ అందుబాటులోకి రానుందని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ఎలివేషన్ డిజైన్ సంబంధించిన ఫొటోను విడుదల చేశారు. ఇప్పటికే శరవేగంగా నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని, సకల హంగులతో నిర్మించినట్లు పేర్కొన్నారు. ఓ వైపు ఎలివేషన్, మరోవైపు ఫకాడే, పార్కింగ్ లాంటి సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.

News May 4, 2024

త్వరలో నూతన హంగులతో చర్లపల్లి రైల్వే స్టేషన్!

image

చర్లపల్లి రైల్వే స్టేషన్ త్వరలో నూతన హంగులతో ప్రజలందరికీ అందుబాటులోకి రానుందని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలియజేశారు. ఈ మేరకు ఎలివేషన్ డిజైన్ సంబంధించిన ఫొటోను విడుదల చేశారు. ఇప్పటికే శరవేగంగా నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని, సకల హంగులతో నిర్మించినట్లు పేర్కొన్నారు. ఓ వైపు ఎలివేషన్, మరోవైపు ఫకాడే, పార్కింగ్ లాంటి సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.