Telangana

News May 4, 2024

రణక్షేత్రంలా లోక్‌సభ ఎన్నికల ప్రచారం

image

ఖమ్మం జిల్లాలో లోక్ సభ ఎన్నికల ప్రచారం రణక్షేత్రంలా సాగుతోంది. అభ్యర్థులతో పాటు ఆయా పార్టీల అగ్రనేతలు, కార్యకర్తలు ప్రచార జోరును పెంచారు. జిల్లా, మండల, గ్రామస్థాయి నాయకులు ఇంటింటి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. పార్టీల కరపత్రాలు, గుర్తులతో రూపొందించిన ఫ్లకార్డులను చేతబూని తమ అభ్యర్థికి ఓటేయమని అభ్యర్థిస్తున్నారు. ఇక సభలు, సమావేశాలు, రోడ్ షోలతో ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.

News May 4, 2024

ఆదిలాబాద్: డిగ్రీ పరీక్షలు వాయిదా ప్రచారం.. అధికారుల క్లారిటీ

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 6 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఓ ప్రెస్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్పందించిన కేయూ అధికారులు అది ఫేక్ అని నిర్ధారించారు. పరీక్షలు యథావిధిగా ఈనెల 6 నుంచి ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

News May 4, 2024

నిజామాబాద్: ఓటర్లకు డబ్బులు పంచుతుండగా పట్టివేత 

image

తాడ్వాయిలోని శుక్రవారం రాత్రి ఓ ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన కార్యకర్త నుంచి రూ.10,100 నగదు, పార్టీ కండువాలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ వెంకటేశ్వర్లు వివరాలిలా.. పార్టీ కార్యకర్త ఓటర్లకు డబ్బు పంచుతున్నట్లు ఎన్నికల సిబ్బందికి సమాచారం అందిందని చెప్పారు. దాడి చేసి ఆ వ్యక్తి వద్ద నుంచి డబ్బు, పార్టీ కండువాలు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. 

News May 4, 2024

NLG: కాంగ్రెస్, బీఆర్ఎస్ ఫిక్స్.. BJP నుంచి అతనేనా..?

image

NLG -WGL-KMM పట్టభద్రుల MLC నామినేషన్ల స్వీకరణ మొదలైంది. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేయగా.. BJP తమ అభ్యర్థిగా వరంగల్‌కు చెందిన రాకేష్ రెడ్డిని ప్రకటించింది. BJP నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి, గతంలో ఈ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. మూడు పార్టీలు గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

News May 4, 2024

BHPL: రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

image

హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందింది. ఎస్సై శ్రీలత వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లా మోరంచపల్లికి చెందిన సాయి అశ్రిత రెడ్డి(22) మాదాపూర్‌లోని ప్రైవేటు హాస్టల్లో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. గురువారం తన స్నేహితురాలి వద్దకు వచ్చి, తిరుగు ప్రయాణంలో ర్యాపిడో బుక్ చేసుకుంది. రాత్రి 12.30 గంటల సమయంలో జేఎన్టీయూ సిగ్నల్ వద్దకు రాగానే లారీ ఢీకొని మృతి చెందింది.

News May 4, 2024

తూప్రాన్: తల్లి, ముగ్గురు పిల్లలు MISSING

image

తూప్రాన్ పట్టణంలో నివాసముండే కిష్టాపూర్‌కు చెందిన వడ్ల పవన్ భార్య అర్చన (27), ముగ్గురు పిల్లలు కార్తీక్(10), ఈశ్వర్(4), అక్షయ(6) అదృశ్యమైనట్లు ఎస్ఐ శివానందం తెలిపారు. 13ఏళ్ల క్రితం యాదాద్రి జిల్లాకు చెందిన అర్చనను పవన్ ప్రేమ వివాహం చేసుకోగా.. తూప్రాన్‌లో ఉంటున్నారు. కిష్టాపూర్‌లో తల్లిదండ్రుల వద్ద గల మరో ఇంట్లో ఉండేందుకు నిర్ణయించడంతో గొడవ చేసింది. నిన్న ఇంట్లోంచి వెళ్లి కనిపించకుండా పోయింది.

News May 4, 2024

MBNR, NGKL ఎంపీ అభ్యర్థుల విద్యార్హత వివరాలు ఇలా..!

image

MBNR ఎంపీ అభ్యర్థులు చల్లా వంశీచంద్ రెడ్డి(కాంగ్రెస్), మన్నె శ్రీనివాస్ రెడ్డి(BRS) విద్యార్హత ఇంటర్ కాగా.. BJP అభ్యర్థి డీకే అరుణ ఎస్ఎస్సీ చదివారు. NGKL లోక్ సభ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి MBBS చేయగా.. BJP అభ్యర్థి భరత్ ప్రసాద్ బీటెక్ చదివారు. BRS అభ్యర్థి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ యూఎస్ఏలోని హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంఏ(పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) చేశారు. ఈ మేరకు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

News May 4, 2024

మల్కాజిగిరిలో పురుషుల ఓట్లే కీలకం!

image

దేశంలోని అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజిగిరిలో అభ్యర్థుల గెలుపోటములకు పురుషుల ఓట్లే కీలకం కానున్నాయి. మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 37,79,596 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 19,45,624 కాగా.. మహిళా ఓటర్లు 18,33,430 మంది ఉన్నారు. నియోజకవర్గంలో మహిళా ఓట్ల కంటే పురుషుల ఓట్లు 1,12,194 అధికంగా ఉన్నాయి.

News May 4, 2024

మల్కాజిగిరి: కీలకంగా మారనున్న పురుష ఓటర్లు!

image

దేశంలోని అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజిగిరిలో అభ్యర్థుల గెలుపోటములకు పురుషుల ఓట్లే కీలకం కానున్నాయి. మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 37,79,596 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 19,45,624 కాగా.. మహిళా ఓటర్లు 18,33,430 మంది ఉన్నారు. నియోజకవర్గంలో మహిళా ఓట్ల కంటే పురుషుల ఓట్లు 1,12,194 అధికంగా ఉన్నాయి.

News May 4, 2024

HYD: బర్త్‌డే కేక్‌ కోసం వెళ్లి బాలుడి మృతి

image

బర్త్‌డే సందర్భంగా కేక్ తెచ్చుకోవడానికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందిన ఘటన HYD షాద్‌నగర్‌లో జరిగింది. పోలీసుల వివరాలు.. రతన్‌ కాలనీకి చెందిన బిజ్వి సందీప్‌ (16) బర్త్‌డే సందర్భంగా స్నేహితులతో కలిసి కేక్‌ కట్‌ చేయాలని గురువారం రాత్రి బయటికి వెళ్లాడు. కేశంపేట బైపాస్‌ చౌరస్తాలో రోడ్డు దాటుతుండగా జడ్చర్ల వైపు వెళ్తున్న వాహనం అతడిని ఢీకొంది. దీంతో సందీప్ అక్కడికక్కడే మృతి చెందాడు.