Telangana

News May 4, 2024

HYD: 5 నుంచి వేసవి సెలవులు

image

HYD జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు ఈ నెల 5 నుంచి 26 వరకు వేసవి సెలవులు ప్రకటిస్తూ ప్రిన్సిపల్ డాక్టర్ నరసింహారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మూడో ఏడాది వారికి మాత్రం ఈ నెల 6 నుంచి జూన్ 1 వరకు సెలవులు ఉంటాయని వివరించారు. వారు ఇంటర్న్‌షిప్ చేసేందుకు వీలుగా అదనంగా వారం రోజులు ఇచ్చినట్లు తెలిపారు.

News May 4, 2024

HYD: 5 నుంచి వేసవి సెలవులు

image

HYD జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు ఈ నెల 5 నుంచి 26 వరకు వేసవి సెలవులు ప్రకటిస్తూ ప్రిన్సిపల్ డాక్టర్ నరసింహారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మూడో ఏడాది వారికి మాత్రం ఈ నెల 6 నుంచి జూన్ 1 వరకు సెలవులు ఉంటాయని వివరించారు. వారు ఇంటర్న్‌షిప్ చేసేందుకు వీలుగా అదనంగా వారం రోజులు ఇచ్చినట్లు తెలిపారు.

News May 4, 2024

సత్తుపల్లి: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

image

అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందిన ఘటన సత్తుపల్లి మండలంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా రాచపట్నంకు చెందిన నాగరాజు,  భార్య లావణ్య(40) కొద్దిరోజుల క్రితం తుంబూరు శివారులోని కిషోర్ రెడ్డి అనే రైతుకు చెందిన అరటితోటలో కాపలాకు వచ్చారు. అయితే గురువారం రాత్రి లావణ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గమనించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ కిరణ్ తెలిపారు.

News May 4, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✔నేడు కొత్తకోటకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక
✔నేడు సమీక్ష.. రేపు నీట్ ప్రవేశ పరీక్ష
✔పలు నియోజకవర్గాల్లో పర్యటించిన ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు
✔ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న పోలింగ్ చిట్టిల పంపిణీ
✔కొనసాగుతున్న హోమ్ ఓటింగ్
✔SSC సప్లమెంటరీ పరీక్షలపై అధికారుల ఫోకస్
✔పలుచోట్ల కేంద్ర బలాలతో కవాతు
✔పకడ్బందీగా కొనసాగుతున్న తనిఖీలు
✔ఎంపీ ఎన్నికలు.. ప్రచారంలో స్పీడ్ పెంచిన నేతలు

News May 4, 2024

ఎమ్మెల్సీ నామినేషన్లు షురూ

image

ఒక వైపు పార్లమెంట్ ఎన్నికల హోరు కొనసాగుతుండగా.. ఇప్పుడు NLG – WGL-KMM పట్టభద్రుల MLC ఎన్నిక హడావుడి కూడా మొదలైంది. ఈ నెల 27న జరిగే MLC ఎన్నిక పోలింగ్ జరగనుంది. 2 నుంచే నామినేషన్ల స్వీకరణ మొదలైంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న)ను ప్రకటించగా, బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా వరంగల్‌కు చెందిన ఏనుగు రాకేష్ రెడ్డి ని ప్రకటించింది. బీజేపీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు.

News May 4, 2024

ఈనెల 6న కామారెడ్డికి ప్రియాంక గాంధీ

image

ఈనెల 6వ తేదీన కామారెడ్డికి ఏఐసీసీ నేత ప్రియాంక గాంధీ రానున్నారు. కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రియాంక గాంధీ మాట్లాడుతారు. ప్రియాంక గాంధీ హాజరుకానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పనుల్లో కాంగ్రెస్ నేతలు నిమగ్నం అయ్యారు.

News May 4, 2024

MBNR: నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రెడ్డి

image

పార్లమెంట్ ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రచారం ఊపందుకుంది. ఇందులో భాగంగా శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తకోటలో నిర్వహించనున్న రోడ్ షో, కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. MBNR పార్లమెంట్ పరిధిలోని నారాయణపేటలో బహిరంగ సభ తర్వాత ఇదే పార్లమెంట్ పరిధిలోని కొత్తకోటలో సాయంత్రం 4 గంటలకు నిర్వహించే కార్నర్ మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు.

News May 4, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యంశాలు

image

> తిరుమలాయపాలెంలో మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పర్యటన
> కొత్తగూడెంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ
> సత్తుపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి పర్యటన
> కామేపల్లిలో సీపీఎం మండల కమిటీ సమావేశం
> ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన
> కూసుమంచిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పర్యటన

News May 4, 2024

రూ: 2లక్షల 53 వేల విలువగల గంజాయి స్వాధీనం

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డు సమీపంలో టూ టౌన్ పోలీసులు తనిఖీ నిర్వహిస్తుండగా భారీగా గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో షేక్ షోయబ్ ను ఆరెస్ట్ చెయ్యగా, షేక్ సాదిక్ పరారీలో ఉన్నట్లు డిఎస్పి జీవన్ రెడ్డి మీడియాకు తెలిపారు. సుమారు 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు, దీని విలువ రూ: 2లక్షల 53 వేలు ఉంటుందని పేర్కొన్నారు. టూ టౌన్ సీఐ అశోక్, ఎస్సై లాల్ సింగ్ నాయక్, తదితరులు ఉన్నారు.

News May 4, 2024

ఖమ్మం: రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలుపు (REWIND)

image

లోక్‌సభ ఎన్నికలు మరో వారం రోజులుండగానే.. ఇటీవల ఖాళీ అయిన నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ ఎమ్మెల్సీ ఎన్నిక సందడి మొదలైంది. కాగా 2021లో గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా గెలవడంతో తాజా ఎన్నిక అనివార్యమైంది. ఆ ఎన్నికల్లో గెలుపుకోసం 1,83,167 ఓట్లు అవసరం కాగా మొదటి ప్రాధాన్యతా ఓట్లలో ఎవరికీ 50శాతానికి మించి రాలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లతో పల్లా గెలిచారు.