Telangana

News May 4, 2024

HYD: కాంగ్రెసోళ్లు నన్ను ఓడించాలని చూస్తున్నారు: నివేదిత

image

కాంగ్రెసోళ్లు తనపై కక్ష కట్టి ఓడించాలని చూస్తున్నారని BRS సికింద్రాబాద్ కంటోన్మెంట్ MLA అభ్యర్థి నివేదిత అన్నారు. HYD బోయిన్‌పల్లిలో ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లోని కొంత మంది ముఖ్య నాయకులు కంటోన్మెంట్‌కి వచ్చి తనను ఓడించాలని శత విధాలుగా ప్రయత్నిస్తున్నారని వాపోయారు. ‘మా నాన్న చేయి.. నా తలమీద లేనప్పుడు నన్ను ఇబ్బందులు పెడుతున్న వారికి నా కంటోన్మెంట్ ప్రజలే బుద్ధి చెబుతారు’ అని అన్నారు.

News May 4, 2024

ADB: ఈవీఎంల రెండవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి

image

పార్లమెంటు సాధారణ ఎన్నికలను పురస్కరించుకుని అదిలాబాద్ లోక్ సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజర్షి షా, సాధారణ పరిశీలకులు రాజేంద్ర విజయ్ సమక్షంలో ఈవీఎంల రెండవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల సాధారణ పరిశీలకుల సమక్షంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఈవీఎంల రెండవ ర్యాండమైజేషన్ జరిపారు.

News May 4, 2024

ఎనుమాముల మార్కెట్‌కు 2 రోజుల సెలవు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు నేడు, రేపు 2 రోజులు సెలవులు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. నేడు వారాంతపు యార్డు బంద్, రేపు (ఆదివారం) సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి ఈ రెండు రోజులు మార్కెట్‌కు సరుకులు తీసుకుని రావద్దని సూచించారు.

News May 4, 2024

ఎన్నికల తనిఖీల్లో భారీగా నగదు, మద్యం స్వాధీనం

image

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ఎన్నికల తనిఖీల్లో రూ.18.09 లక్షల నగదు, రూ. 49,681 విలువ చేసే 89.635 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు సీపీ కల్మేశ్వర్ తెలిపారు. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు నిజామాబాద్ వన్ టౌన్, టూ టౌన్, ఫోర్త్ టౌన్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో 4 కేసుల్లో నగదు, నిజామాబాద్, ఆర్మూర్ బోధన్ డివిజన్లలో 6 కేసుల్లో మద్యం పట్టుకున్నట్లు సీపీ వివరించారు.

News May 4, 2024

HYD: కాంగ్రెసోళ్లు నన్ను ఓడించాలని చూస్తున్నారు: నివేదిత

image

కాంగ్రెసోళ్లు తనపై కక్ష కట్టి ఓడించాలని చూస్తున్నారని BRS సికింద్రాబాద్ కంటోన్మెంట్ MLA అభ్యర్థి నివేదిత అన్నారు. HYD బోయిన్‌పల్లిలో ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లోని కొంత మంది ముఖ్య నాయకులు కంటోన్మెంట్‌కి వచ్చి తనను ఓడించాలని శత విధాలుగా ప్రయత్నిస్తున్నారని వాపోయారు. ‘మా నాన్న చేయి.. నా తలమీద లేనప్పుడు నన్ను ఇబ్బందులు పెడుతున్న వారికి నా కంటోన్మెంట్ ప్రజలే బుద్ధి చెబుతారు’ అని అన్నారు.

News May 4, 2024

NRPT: ‘పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలి’

image

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా నిర్వహించాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులకు సూచించారు. శుక్రవారం నారాయణపేట గురుకుల పాఠశాలలో చేపట్టిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను పరిశీలించారు. అప్పటి వరకు నమోదైన ఓట్ల వివరాలను పిఓ, ఏపిఓ లను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 8 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహిస్తామని, దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

News May 4, 2024

MBNR: జిల్లాల వారీగా ‘TET’ అప్లికేషన్లు ఇలా..

image

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)-2024కు శుక్రవారం అధికారులు పరీక్ష షెడ్యూలు విడుదల చేశారు. ఉమ్మడి జిల్లాలో జిల్లాల వారీగా దరఖాస్తుల వివరాలు..✒మహబూబ్ నగర్: పేపర్-1కు 4,297, పేపర్-2కు 7,688✒నాగర్ కర్నూల్: పేపర్-1కు 4,453, పేపర్-2కు 6,023✒నారాయణపేట: పేపర్-1కు 3,262,పేపర్-2కు 3,446✒గద్వాల్: పేపర్-1కు 3,036,పేపర్-2కు 3,581✒వనపర్తి: పేపర్-1కు 2,560, పేపర్-2కు 5,211 అప్లికేషన్లు వచ్చాయన్నారు.

News May 4, 2024

ఈనెల 7న ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ రోడ్ షో

image

ఖమ్మం నగరంలో ఈనెల 7న సా. 5 గంటలకు సినీ హీరో విక్టరీ వెంకటేష్ కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ రోడ్ షో నిర్వహిస్తారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. విక్టరీ వెంకటేష్ రోడ్ షోలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని జిల్లా నేతలు పేర్కొన్నారు. కాగా రఘురాం రెడ్డికి విక్టరీ వెంకటేష్‌కు వరుసకు వియ్యంకుడు.

News May 4, 2024

మహిళలు, బాలికలను వేధిస్తే కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ చందనా దీప్తి

image

నల్గొండ జిల్లా షీ టీం బృందాలు మహిళా రక్షణలో ముందుంటూ ఎలాంటి ఆపద వచ్చిన వెంటనే స్పందిస్తూ రక్షణ కల్పిస్తుందని జిల్లా ఎస్పీ స్పందన దీప్తి తెలిపారు. మహిళలను, యువతులను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా షీ టీం బృందాలు అన్ని ప్రాంతాలలో డేగ కళ్ళతో పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. మహిళలు, యువతులు, బాలికలను ఎవరైనా లైంగికంగా వేధించిన, ఈవ్ టీజింగ్ పాల్పడిన కఠిన చర్యలు తప్పవన్నారు.

News May 3, 2024

HYD: ప్రధాని మోదీవి అన్ని అబద్ధాలే: కేటీఆర్

image

అబద్ధాలు చెప్పే ప్రధాని మోదీ పదేళ్ల క్రితం ప్రతి ఒక్కరి జన్​ ధన్​ ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి, ప్రజలను వంచించారని BRS వర్కింగ్​ ప్రెసిడెంట్​ KTR విమర్శించారు. ఈరోజు రాత్రి సికింద్రాబాద్​ MP అభ్యర్థి పద్మారావుగౌడ్​‌కు మద్దతుగా బన్సీలాల్​‌పేట్ జబ్బర్​ కాంప్లెక్స్​ వద్ద నిర్వహించిన రోడ్డు షోలో ఎమ్మెల్యే తలసాని, పద్మారావుతో కలిసి పాల్గొన్నారు.