Telangana

News September 8, 2025

నేడు గ్రీవెన్స్ డే రద్దు: ఎస్పీ

image

నేడు (సోమవారం) నిర్వహించాల్సిన గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఆయన అందుబాటులో ఉండని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని ఆయన కోరారు. వచ్చే సోమవారం గ్రీవెన్స్ డే యథావిధిగా జరుగుతుందని తెలిపారు.

News September 7, 2025

నిజామాబాద్‌లో చంద్రగ్రహణం

image

నిజామాబాద్‌లో ఆదివారం రాత్రి చంద్రగ్రహణం కనిపించింది. రాత్రి 8:58 గంటలకు పెనుమంట్ర దశతో ప్రారంభమైంది. పాక్షిక గ్రహణం రాత్రి 9:57 గంటలకు మొదలైంది. సంపూర్ణ గ్రహణం 12:22 గంటలకు ముగుస్తుంది. మొత్తం గ్రహణం తెల్లవారుజామున 2:25 గంటలకు ముగుస్తుందని జ్యోతిష పండితులు తెలిపారు.

News September 7, 2025

HYD: గంగ ఒడికి చేరిన చిట్ట చివరి గణపతి ఇదే!

image

ట్యాంక్‌బండ్‌ వద్ద గణేశ్ నిమజ్జన వేడుకలు ఆదివారం సాయంత్రం పూర్తయ్యాయి. GHMC ఆధ్వర్యంలో ప్రత్యేక క్రేన్లను అధికారులు ఏర్పాటు చేశారు. పకడ్బందీ ఏర్పాట్లతో కార్యక్రమం ప్రశాంతంగా ముగిసిందని పోలీసులు తెలిపారు. ‘చివరి గణేశ్ విగ్రహ నిమజ్జనం విజయవంతంగా పూర్తయింది. ట్రాఫిక్ నిర్వహణ సజావుగా సాగేలా సహకారం అందించిన పౌరులకు కృతజ్ఞతలు’ అంటూ పోలీసులు ట్వీట్ చేశారు. గంగ ఒడికి వచ్చిన చివరి గణపతితో ఫొటోలు దిగారు.

News September 7, 2025

నిజామాబాద్: SRSP 8 వరద గేట్ల ఓపెన్

image

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో ఆదివారం రాత్రి ప్రాజెక్టు 8 స్పిల్వే వరద గేట్లను ఓపెన్ చేశారు. వాటి ద్వారా 25 క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి విడిచిపెట్టారు. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 52,840 క్యూసెక్కుల నీరు వస్తుండగా వరద గేట్లు, ఇతర కాల్వల ద్వారా 53,685 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

News September 7, 2025

ప్రతి ఒక్కరికీ అభినందనలు: ఆదిలాబాద్ ఎస్పీ

image

ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతి, భక్తి వాతావరణంలో 600 మంది పోలీసులతోపాటు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థుల సహకారంతో నిమజ్జన ఉత్సవాలు విజయవంతంగా పూర్తి చేశామని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదివారం పేర్కొన్నారు. మరోవైపు ఇందుకు పలు సంఘాలు, కమిటీలు, మండప నిర్వాహకులు, యువత సహకారం అభినందనీయమని ఆయన తెలిపారు.

News September 7, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. పోలింగ్ కేంద్రాల్లో మార్పులు

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో అధికారులు పోలింగ్ స్టేషన్లలో కొన్నింటిని మార్చారు. బోరబండ ఎన్ఆర్ఆర్‌పురంలోని రెండు అదనపు బూత్‌లను సాయిబాబానగర్ ప్రభుత్వ స్కూల్‌కు మార్చారు. ఎల్లారెడ్డిగూడ రేడియంట్ స్కూల్లోని అదనపు కేంద్రాన్ని పడాల రామిరెడ్డి లా కాలేజీలోకి మార్చారు. అమానత్ పాఠశాలలో అదనపు బూత్‌లు ఏర్పాటు చేశారు. ఆనంద్ విద్యాలయ కిడ్స్ స్కూల్, యూసఫ్‌గూడ వార్డు కార్యాలయంలో కేంద్రాలను ఏర్పాటు చేశారు.

News September 7, 2025

మెదక్: ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం: ఎస్పీ

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవం ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయని ఎస్పీ డీవీ.శ్రీనివాస రావు తెలిపారు. 11 రోజుల పాటు జిల్లా అంతటా పోలీస్ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో 24 గంటలు అప్రమత్తంగా పనిచేయడంతో అన్ని మండలాలు, గ్రామాలు, పట్టణాల్లో వినాయక ఉత్సవాలు సజావుగా జరిగాయని పేర్కొన్నారు. ఈ సందర్బంగా సిబ్బందిని అభినందించారు.

News September 7, 2025

మెదక్: రేపు పోలింగ్ కేంద్రాలు, ఓటర్ జాబితాపై సమావేశం

image

మెదక్ జిల్లాలో పోలింగ్ కేంద్రాలు, ఓటర్ జాబితా ప్రచురణ, సంబంధించిన అంశాలపై సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సమీకృత కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన వివిధ రాజకీయ పార్టీ నాయకులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసినట్లు జడ్పీ సీఈఓ ఎల్లయ్య తెలిపారు. వివిధ ‌రాజకీయ పార్టీ ప్రతినిధులందరూ ఈ సమావేశానికి సకాలంలో తప్పక హాజరుకావాలని సూచించారు.

News September 7, 2025

రంగారెడ్డి: నిరుద్యోగులకు శుభవార్త

image

నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 9న ఉదయం 10.30 నుంచి మ. 2.30 గంటల వరకు రంగారెడ్డి జిల్లా ఉపాధి కార్యాలయం నందు ఉద్యోగ మేళా నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయాధికారి జయశ్రీ తెలిపారు. విద్యార్హత 10th, ఇంటర్, డిగ్రీ, PG, ITI డిప్లమా. వయస్సు: 18-30 మధ్య ఉండాలి. మరిన్ని వివరాలకు 9063099306, 8977175394 నంబర్లను సంప్రదించాలన్నారు.

News September 7, 2025

ఆదిలాబాద్: ‘బీఎస్పీతోనే బహుజనులకు రాజ్యాధికారం’

image

బీఎస్పీ ద్వారానే బహుజనులకు రాజ్యాధికారం సాధ్యమని బీఎస్పీ సెంట్రల్ స్టేట్ కోఆర్డినేటర్ అడ్వకేట్ నిషాని రామచంద్రం పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో బీసీలకు 43% రిజర్వేషన్ అమలు చేయడంలో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. బీజేపీ రాజ్యాంగ రద్దు కోసం కుట్ర చేస్తోందన్నారు. నాయకులు రవీంద్ర, జంగుబాపు, రమేశ్, జగన్మోహన్, తుకారాం తదితరులు ఉన్నారు.