Telangana

News May 3, 2024

ADB: ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

image

ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కుంటాల మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై రజనీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లింబా (బి) గ్రామానికి చెందిన గంగుల యోగేష్ (22) ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. నిన్న రాత్రి సమయంలో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. మృతుడి తండ్రి నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News May 3, 2024

బీర్కూర్: గుండెపోటుతో ఐకెపి VAO మృతి

image

కామారెడ్డి జిల్లా కిష్టాపూర్ గ్రామానికి చెందిన విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్‌గా ఐకెపిలో విధులు నిర్వహిస్తున్న చాకలి బోయిన అంజయ్య (38) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అంజయ్యకు కూతురు, కుమారుడు ఉన్నారు. అంజయ్య మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.

News May 3, 2024

శంషాబాద్‌లో 34 కేజీల బంగారం స్వాధీనం

image

HYD శంషాబాద్‌ విమానాశ్రయం సమీపంలో పోలీసులు భారీగా బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కారులో 34 కిలోల బంగారం, 40 కిలోల వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి. సరైన పత్రాలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఆభరణాలను ముంబయి నుంచి హైదరాబాద్‌ తీసుకొస్తున్నట్టు గుర్తించారు.

సిద్దిపేట: పెళ్లిరోజు విషాదం.. రోడ్డు ప్రమాదంలో మృతి

image

జగదేవ్పూర్ మండలం తీగుల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కందుకూరి వెంకటేశం(45) పెళ్లిరోజు మృతి చెందాడు. తీగుల్‌కు చెందిన వెంకటేశం పెళ్లిరోజు కావడంతో భార్య, పిల్లలతో ఆలయంలో పూజలు చేశారు. అనంతరం అతను పనిచేసే ప్రజ్ఞాపూర్ రెస్టారెంట్‌కు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో గ్రామ శివారులో ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొనడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడ్డ మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.

News May 3, 2024

8న వరంగల్‌కు ప్రధాని మోదీ

image

ఈ నెల 8న వరంగల్ జిల్లాకు పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రానున్నారు. ఈ నేపథ్యంలో తిమ్మాపూర్(మామునూర్) సమీపంలోని సభ వేదిక వద్ద ఏర్పాట్లను ఎంపీ అభ్యర్థి ఆరూరీ రమేశ్, ఇతర నేతలు పరిశీలించారు. బహిరంగ సభకు వరంగల్ పరిధిలోని పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆరూరి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.

News May 3, 2024

HYD: టాప్ హోదాను నిలుపుకునేందుకు కృషి చేయాలి: సీఎస్

image

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో రాష్ట్రం గతంలో సాధించిన విజయాన్ని పునరావృతం చేసి ఈ ఏడాది టాప్ అచీవర్ హోదాను నిలుపుకునేందుకు కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను కోరారు. ఈఓడీబీ పరిధిలోని వివిధ శాఖలు చేపట్టిన సంస్కరణలపై సీఎస్‌ సీనియర్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. జూలై నెలాఖరులోగా ఈఓడీబీ కింద చేపట్టాల్సిన అన్ని సంస్కరణలను పూర్తి చేయాలని ఆదేశించారు.

ఉమ్మడి జిల్లాలో TODAY TOP NEWS

image

✒MPఎన్నికలు.. సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా: SPలు
✒BJPని ఓడించడమే కమ్యూనిస్టుల లక్ష్యం:CPI
✒భగ్గుమన్న పాలమూరు.. పెరుగుతున్న ఎండలు
✒నిరుద్యోగ, ప్రజాసమస్యలు పరిష్కరిస్తా: బర్రెలక్క
✒MBNRలో 16 లక్షలు.. NGKLలో 17లక్షల ఓటర్లు
✒ఏర్పాట్లు పూర్తి.. రేపు కొత్తకోటకు సీఎం రేవంత్ రెడ్డి రాక
✒GDWL: సీఎం, రాహుల్ పర్యటన కోసం హెలిపాడ్ స్థల పరిశీలన
✒పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకోండి: కలెక్టర్లు

News May 3, 2024

అంతర్జాతీయ మార్కెట్లో కొల్లాపూర్ మామిడి పండ్లకు డిమాండ్

image

కొల్లాపూర్ సంస్థానాధీశులు కొల్లాపూర్ మండలం ఎల్లూరు సమీపంలోని(రాజుగారి) పెద్దతోట, చుక్కాయిపల్లి క్రిష్ణ విలాస్ లో మామిడి తోటల సాగును ప్రారంభించారు. APలోని కృష్ణా జిల్లా నూజివీడు నుంచి తెచ్చిన మామిడి మొక్కలు.. కొల్లాపూర్ ప్రాంతం నేల, వాతావరణంలో కాయలు నాణ్యంగా, మంచి పరిమాణంతో పెరిగి, తీపిగా,ఆకర్షణీయంగా ఉండడంతో అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం 25 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి.