Telangana

News May 3, 2024

NRPT: సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా: ఎస్పీ

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్, x, ఇతర సోషల్ మీడియాలలో అనుచిత వ్యాఖ్యలు, మత విద్వేషాలు చెలరేగేలా వ్యాఖ్యలు చేస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్న కారణంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని అన్నారు. సోషల్ మీడియాను జాగ్రత్తగా వాడాలని అన్నారు.

News May 3, 2024

సిద్దిపేట: రైస్ మిల్ యజమాని ఆత్మహత్య

image

సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ లచ్చపేట వార్డుకు చెందిన వ్యాపారవేత్త కాచం నాగార్జున(57) గ్రామంలోని మహేశ్వర రైస్ మిల్లులో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడు. స్థానికుల సమాచారం.. నాగార్జున గత కొన్ని సంవత్సరాలుగా ఆ రైస్ మిల్లు నడుపుతున్నారు. ఇదే క్రమంలో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News May 3, 2024

NZB: ఓటు వేసిన 108 సంవత్సరాల అవ్వ

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓట్ ఫ్రం హోంలో భాగంగా నిజామాబాద్ నగరంలోని హౌసింగ్ బోర్డులోని కేసీఆర్ కాలనీకి చెందిన 108 సంవత్సరాల ఈశ్వరమ్మ శుక్రవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ కోసం నియమించిన బృందాలు ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఆమె ఇంటి వద్దనే ఓటింగ్ కంపార్టుమెంట్ ఏర్పాటు చేసి ఓటు గోప్యతకు భంగం లేకుండా ఓటు వేయించారు.

News May 3, 2024

BRS లేకుండా చేయాలని కాంగ్రెస్, బీజేపీ కుట్ర: హరీశ్ రావు

image

కాంగ్రెస్, బీజెపీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని బీఆర్ఎస్‌ను లేకుండా చేయాలని కుట్రలు పన్నుతున్నారని ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలో చెరో 8 ఎంపీ స్థానాలను పంచుకొని బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. BJP పదేళ్ల పాలన, కాంగ్రెస్ 5 నెలల పాలనపై మాట్లాడకుండా మతం, రిజర్వేషన్ల పేరిట సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.

News May 3, 2024

‘పిడుగుపాటుకు రైతు మృతి’

image

ములకలపల్లి: పూసుగూడెం గ్రామపంచాయతీ ఒడ్డు రామవరం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. ఈ క్రమంలో మార్కెట్ యార్డులో ఉన్న బోడ శివరాం అనే రైతు పిడుగుపాటుకు గురై మరణించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో గుగులోతు శ్రీను అనే మరో రైతుకు గాయాలయ్యాయి. పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News May 3, 2024

ADB: డిగ్రీ పరీక్షలు వాయిదా ప్రచారంపై అధికారుల క్లారిటీ

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 6 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఓ ప్రెస్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యార్థులు ఆందోళనకు గరువుతున్నారు. ఈ విషయమై Way2News కేయూ అధికారులను సంప్రదించగా అది ఫేక్ అని నిర్ధారించారు. పరీక్షలు యధావిధిగా ఈనెల 6 నుంచి ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

News May 3, 2024

మల్లూరులో 46℃ డిగ్రీల ఉష్ణోగ్రత

image

ములుగు జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం మంగపేట మండలం మల్లూరులో 46℃ డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. వెంకటాపురం 46℃, ధర్మవరం 45℃, మేడారం 45℃, మంగపేట 45℃, ఆలుబాక 45℃ డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదయ్యాయి. ఎండలు, ఉక్కపోతతో జిల్లాలో ప్రజలు బయటికి వెళ్లాలంటే జంకుతున్నారు. పలు ప్రాంతాల్లో ప్రధాన కూడళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి.

News May 3, 2024

రామగుండం చేరుకున్న మాజీ సీఎం KCR

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్‌కు మాజీ సీఎం KCR చేరుకున్నారు. 48 గం. ప్రచార నిషేధం అనంతరం శుక్రవారం గోదావరిఖని చౌరస్తాలో 8 గం. తర్వాత జరిగే బస్ యాత్రలో పాల్గొని ప్రసంగించనున్నారు. స్థానిక ఇల్లెందు క్లబ్‌కు వెళ్లిన ఆయన.. ర్యాలీ ద్వారా చౌరస్తాకు వెళ్లనున్నారు. అనంతరం PDPL MP అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ను గెలిపించాలని ప్రసంగించనున్నారు.

News May 3, 2024

HYD: హోటల్ యజమాని హత్య

image

HYD గచ్చిబౌలిలో ఓ హోటల్ యజమాని ఈరోజు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానిక అంజయ్య నగర్‌లో శ్రీనివాస్ (54) అనే వ్యక్తి హోటల్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో దారి విషయంలో ఏడాది క్రితం హోటల్ పక్కన నివసించే వ్యక్తితో అతడికి గొడవ జరిగింది. కక్ష కట్టిన సదరు వ్యక్తి ఇనుప రాడ్డుతో దాడి చేయడంతో శ్రీనివాస్‌ మృతిచెందాడు. మృతుడి కుమారుడు కేశవ్ ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 3, 2024

HYD: హోటల్ యజమాని హత్య

image

HYD గచ్చిబౌలిలో ఓ హోటల్ యజమాని ఈరోజు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానిక అంజయ్య నగర్‌లో శ్రీనివాస్ (54) అనే వ్యక్తి హోటల్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో దారి విషయంలో ఏడాది క్రితం హోటల్ పక్కన నివసించే వ్యక్తితో అతడికి గొడవ జరిగింది. కక్ష కట్టిన సదరు వ్యక్తి ఇనుప రాడ్డుతో దాడి చేయడంతో శ్రీనివాస్‌ మృతిచెందాడు. మృతుడి కుమారుడు కేశవ్ ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.