Telangana

News May 3, 2024

పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకోవాలి: కలెక్టర్

image

పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును ఎలక్షన్స్ డ్యూటీలో ఉన్న ఉద్యోగులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. అదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఆసిఫాబాద్ నియోజకవర్గంలో విధులు నిర్వహించే ఉద్యోగుల కొరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వినియోగించుకునేందుకు ఆసిఫాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓటరు ఫెసిలిటేషన్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే పరిశీలించారు.

News May 3, 2024

HYD: మెట్రోలో 50 కోట్ల మంది ప్రయాణించారు..!

image

HYD మెట్రో రైలు మరో మైలురాయిని చేరుకుంది. ఇప్పటి వరకు 50 కోట్ల మంది ప్రయాణికులు మెట్రో రైళ్లలో ప్రయాణించినట్లు ఎండీ NVS రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు గ్రీన్ మైల్స్ లాయల్టీ క్లబ్‌ను ఆయన ఆవిష్కరించారు. రోజూ 5.5 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారని, రెండో దశ రైలుకు డీపీఆర్‌లు సిద్ధమయ్యాయన్నారు. మెట్రోపై ప్రయాణికులకు నమ్మకం పెరిగిందన్నారు. మెట్రో రైలు వల్ల 14.5 కోట్ల లీటర్ల ఇంధనం ఆదా అయిందన్నారు.

News May 3, 2024

HYD: మెట్రోలో 50 కోట్ల మంది ప్రయాణించారు..!

image

HYD మెట్రో రైలు మరో మైలురాయిని చేరుకుంది. ఇప్పటి వరకు 50 కోట్ల మంది ప్రయాణికులు మెట్రో రైళ్లలో ప్రయాణించినట్లు ఎండీ NVS రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు గ్రీన్ మైల్స్ లాయల్టీ క్లబ్‌ను ఆయన ఆవిష్కరించారు. రోజూ 5.5 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారని, రెండో దశ రైలుకు డీపీఆర్‌లు సిద్ధమయ్యాయన్నారు. మెట్రోపై ప్రయాణికులకు నమ్మకం పెరిగిందన్నారు. మెట్రో రైలు వల్ల 14.5 కోట్ల లీటర్ల ఇంధనం ఆదా అయిందన్నారు.

News May 3, 2024

మెదక్: రోడ్డుపై వడ్ల కుప్పను ఢీకొని ఒకరు మృతి

image

మనోహరాబాద్ మండలం పాలాట వద్ద రాత్రి వడ్ల కుప్పని ఢీకొని సుంచు సత్యనారాయణ(45) అనే వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై కరుణాకర్ రెడ్డి తెలిపారు. పోతారం గ్రామానికి చెందిన సత్యనారాయణ రాత్రి ద్విచక్రవాహనంపై పాలాట మీదుగా లింగారెడ్డిపేటకు వెళ్తున్నారు. ఈ క్రమంలో పాలాట వద్ద రోడ్డుపై పోసిన వడ్ల కుప్పను ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. తూప్రాన్ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చనిపోయినట్లు ఎస్సై తెలిపారు.

News May 3, 2024

సిద్దిపేటలో అరుదైన శస్త్ర చికిత్స

image

సిద్దిపేటలోని ఓ ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స చేశారు. జీర్ణాశయంలో ఏర్పడిన కంతి క్యాన్సర్‌ను వైద్యులు తొలగించారు. వైద్యులు తెలిపిన వివరాలు.. తొగుట మండలంలోని పల్లెపహాడ్‌కు చెందిన రహమాన్ అనే వ్యక్తికి కడుపులోని జీర్ణాశయంలో కంతి క్యాన్సర్ ఏర్పడింది. దీంతో ఆమెకు అరుదైన శాస్త్ర చికిత్స చేసి ఆ కంతిని తొలగించినట్లు వైద్యులు పేర్కొన్నారు.

News May 3, 2024

రేపు మంచిర్యాల జిల్లాకు గులాబీ బాస్

image

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ శనివారం మంచిర్యాల జిల్లాలో పర్యటిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ తెలిపారు. బీఆర్‌ఎస్ పెద్దపల్లి బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ తరుపున మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించబోయే రోడ్ షోలో పల్గొంటారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమాను భారీ సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

News May 3, 2024

ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న నామినేషన్

image

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఉపఎన్నిక స్థానానికి శుక్రవారం కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న 2 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ములుగు జిల్లా అదనపు కలెక్టర్ సీహెచ్. మహేందర్‌ జీకి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బీర్ల ఐలయ్య, బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

News May 3, 2024

NZB: ఓటు హక్కు వినియోగించుకున్న స్వాతంత్ర్య సమరయోధుడు

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆర్మూర్ పట్టణానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు దొండి జగ్గే శివదాస్ (93) శుక్రవారం తన ఓటు హక్కును ఆయన స్వగృహంలో వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనలాంటి వయోవృద్ధులకు ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు చర్యలు చేపట్టడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. అందరూ తమ ఓటు హక్కును తప్పనిసరి వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

News May 3, 2024

ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న నామినేషన్  

image

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఉపఎన్నిక స్థానానికి శుక్రవారం కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న 2 సెట్లు నామినేషన్ దాఖలు చేశారు. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, రెవిన్యూ అదనపు కలెక్టర్ ములుగు జిల్లా, సిహెచ్. మహేందర్‌కి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బీర్ల ఐలయ్య, బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

News May 3, 2024

MBNRలో 16 లక్షలు.. NGKLలో 17లక్షల ఓటర్లు

image

MBNR, NGKL పార్లమెంట్ పరిధిలో కలిపి మొత్తం 34,20,724 మంది ఓటర్లు ఉన్నారు. MBNRలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 16,82,470 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 8,32,256, మహిళలు 8,50,172, ఇతరులు 42 మంది ఉన్నారు. NGKL పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 17,38,254 మంది ఓటర్లు ఉండగా.. పురుషులు 8,64,875, మహిళలు 8,73,340, ఇతరులు 39 మంది ఓటర్లు ఉన్నారు.