Telangana

News May 3, 2024

ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న నామినేషన్  

image

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఉపఎన్నిక స్థానానికి శుక్రవారం కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న 2 సెట్లు నామినేషన్ దాఖలు చేశారు. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, రెవిన్యూ అదనపు కలెక్టర్ ములుగు జిల్లా, సిహెచ్. మహేందర్‌కి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బీర్ల ఐలయ్య, బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

News May 3, 2024

MBNRలో 16 లక్షలు.. NGKLలో 17లక్షల ఓటర్లు

image

MBNR, NGKL పార్లమెంట్ పరిధిలో కలిపి మొత్తం 34,20,724 మంది ఓటర్లు ఉన్నారు. MBNRలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 16,82,470 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 8,32,256, మహిళలు 8,50,172, ఇతరులు 42 మంది ఉన్నారు. NGKL పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 17,38,254 మంది ఓటర్లు ఉండగా.. పురుషులు 8,64,875, మహిళలు 8,73,340, ఇతరులు 39 మంది ఓటర్లు ఉన్నారు.

News May 3, 2024

HYD: ప్రాణం తీసిన ఈత సరదా.. జర జాగ్రత్త!

image

వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లలు చెరువులు, బావుల వద్దకు వెళ్లి ప్రమాదాలకు గురై తల్లిదండ్రులకు తీరని శోకం మిగుల్చుతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు జరగ్గా ఈరోజు మరో బాలుడు మృతిచెందాడు. HYD శివారు చేవెళ్ల పరిధి దేవుని ఎర్రవల్లిలో 10 మంది ఫ్రెండ్స్ కలిసి బావిలో ఈతకు వెళ్లారు. ఈ సమయంలో గ్రామానికి చెందిన విఠలయ్య కుమారుడు నాని నీట మునిగి చనిపోయాడు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని వెలికితీసి కేసు నమోదు చేశారు.

News May 3, 2024

HYD: ప్రాణం తీసిన ఈత సరదా.. జర జాగ్రత్త!

image

వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లలు చెరువులు, బావుల వద్దకు వెళ్లి ప్రమాదాలకు గురై తల్లిదండ్రులకు తీరని శోకం మిగుల్చుతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు జరగ్గా ఈరోజు మరో బాలుడు మృతిచెందాడు. HYD శివారు చేవెళ్ల పరిధి దేవుని ఎర్రవల్లిలో 10 మంది ఫ్రెండ్స్ కలిసి బావిలో ఈతకు వెళ్లారు. ఈ సమయంలో గ్రామానికి చెందిన విఠలయ్య కుమారుడు నాని నీట మునిగి చనిపోయాడు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని వెలికితీసి కేసు నమోదు చేశారు.  

News May 3, 2024

మెదక్: బాలికపై అత్యాచారం..!

image

రామాయంపేట మండల పరిధిలో బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 29న బాలికపై ఇద్దరు కలిసి అత్యాచారం చేయగా బాధితురాలు భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇద్దరు నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News May 3, 2024

వరంగల్ మార్కెట్లో మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో శుక్రవారం మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజ మిర్చి క్వింటా రూ.17,700 పలకగా, 341 రకం మిర్చి రూ.16వేల ధర వచ్చింది. అలాగే వండర్ హాట్(WH) రకం మిర్చి రూ.14వేలు, 5531 రకం మిర్చికి రూ.12 వేల ధర వచ్చింది. టమాటా మిర్చికి నిన్న రూ.32,500 ధర రాగా ఈరోజు 31వేల ధర వచ్చింది.

News May 3, 2024

భద్రాద్రి రామయ్యకు స్వర్ణ కవచాలంకరణ

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో స్వామివారికి శుక్రవారం స్వర్ణ కవచాలంకరణ నిర్వహించారు. ముందుగా  ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, అభిషేకం నిత్య బలిహరణం, తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.

News May 3, 2024

ఖమ్మం: కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఐదు ఏపీ గ్రామాల విలీనం 

image

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఆంధ్రాలో విలీనం అయిన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. ఎటపాక , గుండాల, పురుషోత్తం  పట్నం, కన్నెగూడెం , పిచ్చుకలపాడు గ్రామాలను తెలంగాణలో విలీనం చేస్తామని హామీ ఇచ్చింది. 

News May 3, 2024

MBNR: ‘బూత్‌ల వారీగా బీజేపీ సమావేశాలు’

image

మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాల BJP నేతలు బూత్‌ల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. రెండు నియోజకవర్గాల నేతలతో ఇటీవల హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి మోదీ పథకాలను వివరించాలన్నారు. పోలింగ్‌కు తేదీ దగ్గర పడుతుందని, రాబోయే రోజులు మరింత కీలకమని, అప్రమత్తంగా ఉండాలని అమిత్ షా ఆ పార్టీ నేతలకు సూచించారు.

News May 3, 2024

కాంగ్రెస్, BJPలకు కర్రు కాల్చి వాత పెట్టాలి: హరీష్ రావు

image

కాంగ్రెస్, BJPలకు కర్రు కాల్చి వాత పెట్టాలి అని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. శుక్రవారం కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్‌తో కలిసి అక్కన్నపేట మండల కేంద్రం రోడ్ షో‌లో పాల్గొన్నారు. హరీష్ రావు మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణ ప్రజల తలరాతను మారుస్తాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.