Telangana

News September 11, 2024

NLG: అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు.!

image

NLGలో 8 మంది జర్నలిస్టులు జీవో నెంబర్ 59లోని లొసుగులను ఆసరా చేసుకొని ఇరిగేషన్ శాఖకు చెందిన కోట్ల విలువ చేసే భూమిని గతేడాది అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని కోరుతూ జర్నలిస్టులు అప్పటి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ జరిగిన అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ చేయించారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

News September 11, 2024

సంగారెడ్డి: కేజీబీవీ ఉద్యోగుల మెరిట్ జాబితా విడుదల

image

2023-24 సంవత్సరం కేజీబీవీ అభ్యర్థుల 1:3 మెరిట్ జాబితాను www.deosangareddy.in వెబ్ సైట్ లో ఉంచినట్లు డీఈవో వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. జాబితాలో పేర్లు ఉన్నవారు 13వ తేదీన కలెక్టరేట్లోని సమగ్ర శిక్ష కార్యాలయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాలని చెప్పారు. ఆ తర్వాత 1:1 మెరిట్ జాబితాను విడుదల చేస్తామని పేర్కొన్నారు. అభ్యంతరాలు ఉంటే 18వ తేదీలోపు సమగ్ర శిక్ష కార్యాలయంలో సమర్పించాలన్నారు.

News September 11, 2024

అడవుల్లో ప్రకృతి ప్రకోపం అత్యంత బాధాకరం: కేటీఆర్

image

అడవుల్లో ప్రకృతి ప్రకోపం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. మానవ తప్పిదాల వల్ల పర్యావరణంలో ఇలా ఎన్నడూ లేని మార్పులు ఏర్పడుతున్నాయని, పర్యావరణాన్ని రక్షిస్తూ.. ఇలాంటి ప్రకృతి విపత్తుల నుంచి బయటపడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే ములుగు జిల్లా అటవీ ప్రాంతాన్ని భారీ చెట్ల పెంపకంతో సంరక్షించాలని కేటీఆర్ కోరారు.

News September 11, 2024

NLG: భౌమాకోన్ ఎక్స్ పో ఇండియాకు రావాలని మంత్రి కోమటిరెడ్డికి ఆహ్వానం

image

అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఎక్విప్ మెంట్ మ్యాన్ ఫ్యాక్చరర్స్‌తో కలిసి ‘మెస్సె ముంచన్ ఇండియా’ సంస్థ డిసెంబర్ 11 నుంచి 14 వరకు గ్రేటర్ నోయిడాలో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక ‘భౌమాకోన్ ఎక్స్ పో ఇండియా’కు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని నిర్వాహకులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం అందించారు. ప్రతీయేటా నిర్మాణ రంగంలో వస్తున్న అధునాతన పరికరాలు, టెక్నాలజీలను ఈ ఎక్స్ పోలో ప్రదర్శిస్తారు.

News September 11, 2024

సంగారెడ్డి: బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలి: కలెక్టర్

image

గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు పోలింగ్ బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ బిఎల్వోలు ఇంటింటికి తిరిగి యాప్ ద్వారా ఓటర్ల వివరాలను సరి చేస్తున్నారని చెప్పారు. వీరికి పార్టీల ప్రతినిధులు సహకరించాలని కోరారు.

News September 11, 2024

శిక్ష‌ణ పూర్తి చేసుకున్న ఎస్ఐల‌కు హ‌రీశ్‌రావు శుభాకాంక్ష‌లు

image

బీఆర్ఎస్ ప్ర‌భుత్వం 2022లో 17 వేల పోలీసు ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసేందుకు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఇందులో 547 ఎస్ఐ పోస్టులు ఉండ‌గా, ఆ పోస్టుల‌కు సంబంధించిన శిక్ష‌ణ నేటితో పూర్త‌యింది. తెలంగాణ పోలీసు అకాడ‌మీలో ఇవాళ పాసింగ్ ఔట్ ప‌రేడ్ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా శిక్ష‌ణ పూర్తి చేసుకున్న ఎస్ఐల‌కు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు శుభాకాంక్ష‌లు తెలిపారు.

News September 11, 2024

భద్రాచలం: గంట గంటకు తగ్గుతున్న గోదావరి నీటిమట్టం

image

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గంట గంటకు తగ్గుతూ వస్తుందని సీడబ్ల్యూసీ అధికారులు బుధవారం సా.6 గంటలకు ప్రకటించారు. గోదావరి నీటిమట్టం 48.7 అడుగులకు తగ్గిందని చెప్పారు. వర్షాలు తగ్గుముఖం పడటంతో వరద ప్రవాహం తగ్గుతుందని తెలిపారు. కాగా గణేష్ నిమజ్జనం గోదావరిలో కొనసాగడంతో జిల్లా పోలీసు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. వరద ప్రవాహం తగ్గుతుండడంతో స్థానికులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

News September 11, 2024

ఈనెల 17న జాతీయ పతాక ఆవిష్కరణ చేయనున్న మంత్రి, విప్

image

సెప్టెంబర్ 17న రాష్ట్రంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహించాలని, జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఐటీ, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్‌లు జాతీయ పతాక ఆవిష్కరణ చేయాలని సీఎస్ శాంతి కుమారీ ఉత్తర్వులు జారీ జారీచేశారు.

News September 11, 2024

మధిర: ‘గణేష్ ప్రత్యేక పూజలో ముస్లిం దంపతులు’

image

కులమతాలకు అతీతంగా అందరూ కలిసి ఘనంగా జరుపుకునే పండుగల్లో గణేష్ నవరాత్రి వేడుక ఒకటని చెప్పవచ్చు. మధిర మండలం రాజీవ్ నగర్‌లో ఏర్పాటు చేసిన గణేష్ నవరాత్రి ఉత్సవ వేడుకల్లో ముస్లిం దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం షేక్ నాగుల్ మీరా – బీజాన్ దంపతులు గణనాథుడికి కుంకుమ పూజ నిర్వహించారు. దాంతో కులమతాలకు అతీతంగా పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News September 11, 2024

చింతలపాలెం: బంకులో పెట్రోల్ బదులు నీళ్లు!

image

చింతలపాలెం మండల కేంద్రంలోని హెచ్పీ పెట్రోల్ బంకు యాజమాన్యంపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ పైపుల నుంచి నీళ్లు వస్తున్న విషయాన్ని గుర్తించి సిబ్బందిని నిలదీయగా యాజమాన్యం బంకును మూసివేసింది. సంబంధిత అధికారులు స్పందించి పెట్రోల్ బంకు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.