Telangana

News September 11, 2024

HYD: మెట్రో ప్రయాణికుల కొత్త డిమాండ్

image

హైదరాబాద్‌ మెట్రో‌లో రద్దీ రోజురోజుకి పెరుగుతోంది. ముఖ్యంగా నాగోల్ నుంచి రాయదుర్గం రూట్‌లో ఉదయం, సాయంత్రం నిలబడలేని పరిస్థితి ఉంటోంది. నాన్‌స్టాప్ సర్వీసులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. దీనివలన ప్రయాణం సౌలభ్యంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. రెగ్యులర్ సేవలతో పాటు నాన్ స్టాప్ సర్వీసులు కూడా ఏర్పాటు చేయడంతో‌ సమయం ఆదా అవుతోందన్నారు. దీనిపై మీ కామెంట్?

News September 11, 2024

దుమ్ముగూడెం: తూరుబాక ప్రధాన రహదారిలో రాకపోకలు బంద్

image

దుమ్ముగూడెం మండలం తూరుబాక ప్రధాన రహదారిపై బుధవారం గోదావరి వరద నీరు చేరింది. దీంతో స్థానిక ప్రజలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గోదావరి నీటిమట్టం గణనీయంగా పెరుగుతుండడంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారి వద్ద అధికారులు రాకపోకలను నిలిపివేశారు. గోదారి నీరు చేరిన రహదారులను దాటే ప్రయత్నం చేసి ప్రమాదాలకు గురి కావద్దని అధికారులు సూచించారు.

News September 11, 2024

వరంగల్ మీదుగా 12 స్పెషల్ రైళ్లు

image

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వరంగల్ మీదుగా అక్టోబర్ 16 నుంచి 20 వరకు అప్ అండ్ డౌన్ రూట్లో 12 రైళ్ల సర్వీసులను ప్రవేశపెట్టి నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. జబల్పూర్, ఇటార్సీ, నాగ్పూర్, బల్లార్షా, సిర్పూర్ కాగజ్‌నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, విజయవాడ, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ కల్పించినట్లు చెప్పారు.

News September 11, 2024

MDK: తట్టుకోలేక.. తనువు చాలిస్తున్నారు

image

కుటుంబ ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కెరీర్‌లో ఎత్తు పల్లాలు, లవ్ ఫెయిల్యూర్ ఇలా వివిధ కారణాలతో కొందరు తనువు చాలిస్తున్నారు. ఎంతో విలువైన జీవితానికి ముగింపు పలుకుతున్నారు. ఫలితంగా కుటుంబ సభ్యులకు వేదన మిగుల్చుతున్నారు. జిల్లాలో బలవన్మరణానికి పాల్పడే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాలో ఈ ఏడాది 640 ఆత్మహత్యలు నమోదయ్యాయంటే.. ఆ తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

News September 11, 2024

12,18 తేదీల్లో PHD అభ్యర్థులకు ఇంటర్వ్యూలు

image

MGU నిర్వహించిన PHD పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ ఆకుల రవి మంగళవారం తెలిపారు. ఈనెల 12న బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, 18న కామర్స్ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు ఉంటాయని, ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో పాటు, నెట్, సెట్ ఇతర అర్హత పత్రాలను తీసుకురావాలన్నారు. మిగిలిన సబ్జెక్టుల వారికి త్వరలో ప్రకటిస్తామన్నారు.

News September 11, 2024

శాలిగౌరారం: విషాదం.. ఆర్టీసీ కండక్టర్ మృతి

image

విధులు ముగించుకొని ఇంటికి చేరుకుంటుండగా ఆకస్మాత్తుగా రక్తపు వాంతులు చేసుకొని ఆర్టీసీ కండక్టర్ మరణించిన ఘటన నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల శివారులో జరిగింది. గ్రామానికి చెందిన వైద్యుల ప్రకాశ్(50) సూర్యాపేట ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా రక్తపువాంతులు చేసుకొని మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

News September 11, 2024

MBNR: ఆడపడుచులకు ఆపదలో అస్త్రాలివే

image

పాలమూరు జిల్లాలో పోకిరీలు రెచ్చిపోతున్నారు. జిల్లాలో ఎక్కడో ఒకచోట అత్యాచారాలు, లైంగిక వేధింపు కేసులు నమోదవుతూనే ఉన్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు అధికారలు చర్యలు చేపట్టారు. అత్యవసర సమయాల్లో రక్షణకు టోల్‌ఫ్రీ నంబర్లను, యాప్‌లను తీసుకొచ్చారు. చైల్డ్ హెల్పులైన్-198, షీ టీం-8712657963, భరోసా-08457293098, మహిళా హెల్ప్‌లైన్-181, మిషన్ పరివర్తన-14446, పోక్సో ఈ బాక్స్, 112 యాప్‌‌లు ఉన్నాయి. SHARE IT

News September 11, 2024

సాంఘిక సంక్షేమ గురుకులలో స్పాట్ అడ్మిషన్లు

image

వరంగల్ రీజియన్ పరిధిలోని ములుగు, హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి జిల్లాల్లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 12న స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించనున్నట్లు జిల్లా కో-ఆర్డినేటర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థుల తల్లిదండ్రులు ఉదయం 10 గంటలకు మడికొండలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలకు హాజరు కావాలన్నారు.

News September 11, 2024

KMR: తట్టుకోలేక.. తనువు చాలిస్తున్నారు

image

కుటుంబ ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కెరీర్‌లో ఎత్తు పల్లాలు, లవ్ ఫెయిల్యూర్ ఇలా వివిధ కారణాలతో కొందరు తనువు చాలిస్తున్నారు. ఎంతో విలువైన జీవితానికి ముగింపు పలుకుతున్నారు. ఫలితంగా కుటుంబ సభ్యులకు వేదన మిగుల్చుతున్నారు. కామారెడ్డి జిల్లాలో బలవన్మరణానికి పాల్పడే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. జిల్లాలో ఈ ఏడాది 252 ఆత్మహత్యలు నమోదయ్యాయంటే.. ఆ తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

News September 11, 2024

మంచిర్యాలలో వ్యభిచారం

image

మంచిర్యాల పట్టణంలో ఇటీవల వ్యభిచారం కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం పట్టణంలోని ఓ లాడ్జిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నలుగురు యువతులు, ఇద్దరు బాలికలు, ఆరుగురు విటులతో పాటు నిర్వాహకులను అరెస్ట్ చేశారు. కాగా నిర్వాహకులు భార్యాభర్తలని పోలీసులు వెల్లడించారు.