Telangana

News April 2, 2025

NZB: ఆత్మహత్య.. చికిత్స పొందుతూ మృతి

image

నిజామాబాద్ రూరల్ మండలంలోని ఆకుల కొండూరులో ఓ యువకుడు ఆన్‌లైన్ గేమ్స్‌లో డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన ఆకాశ్(24) ఆన్‌లైన్లో డబ్బులు పెట్టి గేమ్స్ ఆడాడు. అందులో దాదాపుగా రూ.5లక్షల వరకు పోగొట్టుకున్నాడు. ఇంట్లో వారికి తెలిస్తే కోప్పడతారని గడ్డి మందు తాగాడు. మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 2, 2025

బిగ్ బాస్‌లో ఛాన్స్ ఇవ్వాలని ఆర్టిస్ట్ నిరసన

image

బిగ్ బాస్ సీజన్ 9లో అవకాశం కల్పించాలంటూ ఓ సినీ ఆర్టిస్ట్ నిరాహార దీక్ష చేసిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. అన్నపూర్ణ స్టూడియో సమీపంలో మిర్యాలగూడకు చెందిన రామాచారి అనే నటుడు తాను కూలీ బిడ్డనని, తనకు బిగ్ బాస్ సీజన్ 9లో అవకాశం కల్పించాలంటూ నిరాహార దీక్ష చేశాడు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు రామాచారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

News April 2, 2025

మెదక్: విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి

image

మనోహరాబాద్(M) కొండాపూర్ పారిశ్రామికవాడలో శ్రీహన్ పాలిమర్ కంపెనీలో మధ్యప్రదేశ్(S) అనుపూరు జిల్లా బలియా గ్రామానికి చెందిన రఘునాథ్ సింగ్(21) అనే కార్మికుడు మృతిచెందాడు. మంగళవారం ఉదయం విధులు నిర్వహిస్తుండగా మిషన్‌‌కు చెందిన వైర్ తగలడంతో షాక్‌కు గురై చనిపోయాడు. యజమాని నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని మృతుడి సోదరుడు ఆరోపించాడు. మనోహరాబాద్ ఎస్సై సుభాష్ గౌడ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News April 2, 2025

బాలానగర్: రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి

image

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ బీహార్ వాసి మృతి చెందిన ఘటన బాలానగర్ మండల కేంద్రంలో జరిగింది. ఎస్ఐ లెనిన్ వివరాల ప్రకారం.. బీహార్‌కి చెందిన బినోద్ ముర్ము(32) మండల కేంద్రం శివారులోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. మంగళవారం రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

News April 2, 2025

నిజామాబాద్ జిల్లా ఎండ తీవ్రత

image

నిజామాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. మంగళవారం ఎడపల్లిలో 39.6℃, మంచిప్ప, గోపన్నపల్లి, నిజామాబాద్, కోటగిరి 39.5, మదనపల్లి, చిన్న మావంది 39.4, మల్కాపూర్ 39.3, పెర్కిట్, మోస్రా 39.2, సాలూరా 39.1, రెంజల్, కల్దుర్కి 38.7, వేల్పూర్, వెంపల్లె 38.6, లక్మాపూర్, చింతలకొండూర్, ముప్కల్, యర్గట్ల 38.4, చందూర్, బాల్కొండ 38.3, పోతంగల్ 38, జక్రాన్‌పల్లి, రుద్రూర్, జకోరా 37.8℃ ఉష్ణోగ్రత నమోదైంది.

News April 2, 2025

ఉట్నూర్: అస్వస్థతతో ఉపాధి కూలీ మృతి

image

అస్వస్థతకు గురై ఉపాధి కూలీ మృతిచెందాడు. గ్రామస్థుల వివరాలు.. ఉట్నూర్ (M) అందోలికి చెందిన పారేకర్(34) 3 వారాలుగా ఉపాధి పనులకు వెళ్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం వరకు పని చేసి ఇంటికి చేరుకుని పడుకున్నాడు. కొద్దిసేపటికి అతడికి వాంతులు, విరోచనాలు, ఛాతిలో నొప్పి రావడంతో ఇంద్రవెల్లి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ADBకి తరలించే క్రమంలో మృతిచెందాడు. ఎండ తీవ్రతతో మరణించినట్లు అనుమానిస్తున్నారు.

News April 2, 2025

HYD: CM రేవంత్ రెడ్డికి రాజాసింగ్ లేఖ

image

శ్రీరామనవమి శోభాయాత్రకు ఎటువంటి పరిమితులు లేకుండా అనుమతించాలని BJP ఎమ్మెల్యే రాజాసింగ్ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. 15 ఏళ్లుగా శాంతియుతంగా నిర్వహిస్తున్న యాత్రకు పోలీసులు శబ్ద నియంత్రణ పేరుతో ఆంక్షలు వేస్తున్నారని ఆయన ఆక్షేపించారు. ఇతర మతాలకు ఇలా ఆంక్షలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. యాత్రను నిర్బంధం లేకుండా నిర్వహించేందుకు అనుమతివ్వాలని కోరారు.

News April 2, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆} కామేపల్లిలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన
∆} వైరా పర్ణశాలలో ప్రత్యేక పూజలు
∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద పర్యటన
∆} బోనకల్‌లో విద్యుత్ సరఫరాలో అంతరాయం

News April 2, 2025

పది లక్షల మందితో వరంగల్‌లో BRS సభ!

image

ఈనెల 27న HNK ఎల్కతుర్తిలో BRS సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈమేరకు ఉమ్మడి జిల్లా నాయకులతో మంగళవారం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అయితే సభకు, ఇతర అవసరాలకు దాదాపు 1200 ఎకరాల వరకు అవసరమని, RTC బస్సులతో పాటు ఇతర వాహనాలు 40 నుంచి 50 వేల వరకు వస్తాయని అంచనా వేస్తున్నట్లు సమాచారం. 10 లక్షల మందితో సభ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి సభకు మీరు వెళ్తున్నారా?

News April 2, 2025

MBNR: నేడు ఎస్ఎల్బీసీకి మంత్రి పొంగులేటి రాక

image

ఎస్ఎల్​బీసీ శ్రీశైలం ఎడమ గట్టు సొరంగంలో చిక్కుకొని ప్రాణాలు వదిలిన వారి ఆచూకీ కోసం 38 రోజులుగా సహాయక కొనసాగుతున్నాయి. 24 గంటల పాటు మూడు షిప్టుల్లో 600 మంది రెస్క్యూ బృందాలు శ్రమిస్తూనే ఉన్నారు. ఈ చర్యలను పరిశీలించేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం రానున్నారు. మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే లు రానున్నారు.