Telangana

News September 11, 2024

తెలంగాణలో కషాయ జెండా ఎగరడమే లక్ష్యం: డీకే అరుణ

image

తెలంగాణలో కషాయ జెండా ఎగరవేయడమే ధ్యేయంగా ముందుకు సాగాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. నేడు మల్కాజ్గిరి, మేడ్చల్ జిల్లాలలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. డీకే అరుణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని అన్నారు. దేశ సాంస్కృతి సాంప్రదాయాలను కాపాడడానికి ప్రతి కార్యకర్త 200 మందిని సభ్యత్వంలో చేర్పించాలని అన్నారు.

News September 11, 2024

మారుముల ప్రాంత యువత క్రీడల్లో రాణించాలి: ఎస్పీ

image

మారుమూల ప్రాంత యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కొత్తపేట, సనుగుల గ్రామంలో మంగళవారం సాయంత్రం యువతకు స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌పీ మాట్లాడుతూ.. యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా ఉన్నత లక్ష్యాలు ఎంచుకోవాలన్నారు. మన జీవనశైలిలో చదువు, ఉద్యోగంతో పాటు క్రీడలు కూడా ముఖ్యమేనని అన్నారు.

News September 11, 2024

కాలం చెల్లిన వాహనాలను నడిపితే చర్యలు: ఏసీపీ

image

కాలం చెల్లిన వాహనాలను నడిపితే సంబంధిత వాహనదారులపై తగిన చర్యలు తీసుకుంటామని జనగామ ఏసీపీ పార్థసారధి వాహనదారులను హెచ్చరించారు. మంగళవారం రాత్రి నర్మెట్ట మండల కేంద్రంలో స్థానిక పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్డెన్ చర్చిలో ఆయన మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News September 11, 2024

MBNR: ఈనెల 12 న స్పాట్ అడ్మిషన్లు

image

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 5వ,9వ తరగతిలో మిగులు సీట్ల భర్తీకి ఈనెల 12న స్పాట్ అడ్మిషన్లు చేపడుతున్నట్లు ఉమ్మడి జిల్లాల జోనల్ అధికారి నిర్మల మంగళవారం తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా NRPT, MBNR, GDL, WNPT, NGKL జిల్లాల్లోనిగురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు తెలిపారు.

News September 11, 2024

NLG: నేడు దామరచర్ల‌లో మంత్రుల పర్యటన

image

నల్గొండ జిల్లాలోని దామరచర్లలో మంత్రుల పర్యటనలో భాగంగా హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయంలో ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఉ.11:00 కి మిర్యాలగూడ, దామరచర్ల, యాదాద్రి పవర్ ప్లాంట్ మంత్రుల పర్యటించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పవర్ ప్లాంట్ పురోగతిపై రాష్ట్ర మంత్రులు సమీక్షించనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొననున్నారు.

News September 11, 2024

ఖమ్మంలో ఈ నెల 12న జాబ్ మేళా…!

image

ఖమ్మం నగరంలోని టేకులపల్లి ప్రభుత్వ ఐటిఐ కళాశాల మోడల్ కెరీర్ నందు ఈనెల 12న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మాధవి తెలిపారు. స్పందన స్పీహూర్తి ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థ నందు ఖాళీగా ఉన్న 100 పోస్టులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 18-29 ఏళ్ళు కలిగి, ఇంటర్ విద్యార్హత కలిగిన వారు అర్హులు అన్నారు. ఉ.10 గంటలకు జరిగే జాబ్ మేళాలో విద్యార్హత పత్రాలతో హాజరు కావాలన్నారు.

News September 11, 2024

బోధన్: శ్యామ్ రావు అంత్యక్రియల్లో పాల్గొన్న మందకృష్ణ మాదిగ

image

వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశి తండ్రి శ్యామ్ రావు అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ మంగళవారం బోధన్ మండలం బెల్లాల్ గ్రామంలో నిర్వహించిన అంత్యక్రియలకు హాజరై పాడెను మోశారు. శ్యామ్ రావు అకాల మరణం పట్ల ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. అంత్యక్రియలో మాదిగ సంఘ నాయకులు పాల్గొన్నారు.

News September 11, 2024

కాంగ్రెస్ నేతను పరామర్శించిన బీజేపీ ఎంపీ

image

ఏఐసీసీ సభ్యుడు, కాంగ్రెస్ నాయకుడు జాదవ్ నరేష్‌ను అదిలాబాద్ బీజేపీ ఎంపీ గోడం గణేష్ పరామర్శించారు. గుడిహత్నూర్ మండలం తోషం తండ కు చెందిన జాదవ్ నరేష్ అన్నయ్య జాదవ్ చందూలాల్ ఇటీవల మృతి చెందారు. విషషయం తెలుసుకున్న ఎంపీ నరేష్ కుటుంబ సభ్యులను ఎంపీ పరామర్శించి, మృతికి గల కారణాలు తెలుసుకున్నారు. ఎంపీ వెంట
బీజేపీ నాయకులు వామన్ గిత్తే, చంద్రకాంత్, నారాయణ తదితరులు ఉన్నారు.

News September 11, 2024

HYD: శ్రీమహా విష్ణువుతో వినాయకుడి పాచికలు

image

సికింద్రాబాద్(లష్కర్)లో వివిధ రకాల గణపతులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కలాసిగూడలో శ్రీలక్ష్మీ గణపతి అసోసియేషన్ ఏర్పాటు చేసిన గణేశుడు వెరైటీగా ఉండి, భక్తుల నుంచి విశేష పూజలు అందుకుంటున్నాడు. శ్రీమహావిష్ణువుతో కూర్చొని పాచికలు ఆడుతున్నట్లుగా ఏర్పాటు చేసిన విగ్రహాల సెట్టింగ్ భక్తులను ఆకట్టుకుంటోంది. 108 రకాల స్వీట్లను తయారు చేసి, గణేశుడికి నైవేద్యంగా పెట్టారు.

News September 11, 2024

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రోడ్లు విస్తరించాలని సీఎంకు కిషన్ రెడ్డి లేఖ

image

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, చర్లపల్లి రైల్వే టర్మినల్‌కు వెళ్లే రోడ్లను విస్తరించాలని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి సోమవారం బహిరంగ లేఖ రాశారు. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లకు పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని చర్లపల్లిలో రూ.415 కోట్లతో కొత్త రైల్వే టర్మినల్ నిర్మాణ పనులు కొనసాగిస్తున్నామన్నారు.