Telangana

News September 11, 2024

HYD: రూ.10,500 కోట్లు కేటాయించాలి: మేయర్

image

16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగారియా అధ్యక్షతన ప్రజా భవన్లో సోమవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో GHMC మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడారు. అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో కొనసాగుతున్న ప్రాజెక్టుల కోసం 16వ ఆర్థిక సంఘం నుంచి రూ.10,500 కోట్లు కేటాయించాలని అభ్యర్థించినట్లు చెప్పారు.

News September 11, 2024

MBNR: ‘గమ్యం యాప్.. సమయాన్ని ఆదా చేస్తుంది’

image

మహబూబ్ నగర్ టీఎస్ఆర్టీసీ ‘గమ్యం యాప్’ తో మీ ప్రయాణ సమయం ఎంతో ఆదా అవుతుందని ఆర్టీసీ డిపో మేనేజర్ సుజాత మంగళవారం తెలిపారు. పట్టణంలోని గణేష్ మండపాల దగ్గర మహబూబ్ నగర్ ఆర్టీసీ విలేజ్ బస్ ఆఫీసర్స్ మార్కెటింగ్ అయిన సీజన్ టికెట్, తిరుపతి దర్శనం, వివాహ శుభ కార్యాలు, విహారయాత్రల ప్రత్యేక బస్సులు తదితర విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.

News September 11, 2024

KMM: గోదావరి శాంతించాలని ప్రత్యేక పూజలు

image

గోదావరి శాంతించాలని జాలర్లు దక్షిణ గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నదికి చీర, జాకెట్, పసుపు, కుంకుమ సమర్పించారు. ఇదిలా ఉండగా మ.2 గంటలకు 47.1 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరుకుంది. 48 అడుగుల చేరుకుంటే రెండో ప్రమాద హెచ్చరిక అమలు చేశారు. సాయంత్రం 48 అడుగులకు దాటడంతో ఇప్పటికే రెండవ ప్రమాద హెచ్చరిక అమలులో ఉంది.

News September 10, 2024

KMM: రూ.5 వేల కోట్లతో యంగ్ ఇండియా స్కూళ్లు: డిప్యూటీ సీఎం

image

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో అక్షరాస్యత పెంపునకు రూ.5 వేల కోట్లతో యంగ్ ఇండియా స్కూళ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వీటిని 4వ తరగతి నుంచి ఇంటర్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో తీసుకొస్తామని చెప్పారు. టాటా కంపెనీ సహకారంతో 65 ITIలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అలాగే రాష్ట్రంలో ఏటా రూ.20 వేల కోట్లు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామన్నారు.

News September 10, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యవార్తలు..!

image

✔మాజీమంత్రి లక్ష్మారెడ్డి సతీమణి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి,KCR, MLAలు దిగ్భ్రాంతి ✔ముమ్మరంగా ప్రత్యేక పారిశుద్ధ్య పనులు ✔ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి ✔జూరాల ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తివేత ✔భారీగా తగ్గిన చికెన్ ధరలు ✔శ్వేతారెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్న నాయకులు ✔GDWL:12న జాబ్ మేళా,జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు ✔ఘనపూర్: క్లినిక్ సీజ్ చేసిన వైద్యాధికారి ✔విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు

News September 10, 2024

ముగిసిన శ్వేతారెడ్డి అంత్యక్రియలు

image

నాగర్ కర్నూల్ జిల్లా అవంచలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతారెడ్డి అంత్యక్రియలు జరిగాయి. వారి వ్యవసాయ పొలంలో శ్వేతారెడ్డి చితికి కుమారుడు స్వరూన్ రెడ్డి నిప్పు అంటించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి కన్నీటి పర్యాంతమయ్యారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. లక్ష్మారెడ్డిని పాలమూరు ప్రజాపతినిధులతోపాటు బీఆర్అస్ నాయుకలు పరామర్శించారు.

News September 10, 2024

KMM: పోలీస్ జాగిలానికి ఏఎస్పీ ఘన నివాళి

image

అనారోగ్యంతో మరణించిన పోలీస్ జాగిలం షైనీకి ఘనంగా అంతిమ వీడ్కోలు పలికారు. జిల్లా పోలీస్ శాఖకు పోలీస్ జాగిలం షైనీ అందించిన సేవలు మరువలేనివని అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ పరితోష్ పంకజ్ అన్నారు. ఈ రోజు జిల్లా పోలీస్ డాగ్ స్క్వాడ్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ జాగిలం అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది. గత నెల రోజులుగా బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఈ రోజు తుది శ్వాస విడిచింది.

News September 10, 2024

HYD: సేవా గుర్తింపు అవార్డు అందుకున్న CID డైరెక్టర్

image

HYD ఉమెన్ సేఫ్టీ వింగ్ DGP, CID, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ షికా గోయల్, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా సేవా గుర్తింపు అవార్డు అందుకున్నారు. సైబర్ క్రైమ్ అనాలిసిస్ టూల్ సమన్వయ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసినందుకు ఈ అవార్డు అందించారు. అవార్డు అందుకోవడం ఎంతో గర్వంగా ఉందని DGP సంతోషం వ్యక్తం చేశారు.

News September 10, 2024

ఖమ్మం: జిల్లాలో 76 కి.మీ.మేర దెబ్బతిన్న రహదారులు

image

ఖమ్మం జిల్లాలో వరదల కారణంగా 76 కి.మీ.మేర రహదారులు దెబ్బతిన్నాయి. పలు చోట్ల కోతకు గురికాగా, మరికొన్ని చోట్ల పూర్తిగా తెగిపోయాయి. ఈ మొత్తం నష్టం విలువ రూ.180.37 కోట్లుగా ఉందని అధికారులు పేర్కొన్నారు. అలాగే జిల్లావ్యాప్తంగా నీటిపారుదల శాఖ పరిధిలో రూ.60 కోట్ల మేర నష్టం జరిగిందని నివేదికల్లో పొందుపర్చారు. 45 చెరువులకు పలు ప్రాంతాల్లో గండ్లు పడ్డాయి. మొత్తంగా 103 ప్రాంతాల్లో ఈ శాఖకు నష్టం వాటిల్లింది.

News September 10, 2024

వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ వర్క్‌షాప్‌లో వనపర్తి ఫోటో గ్రాఫర్

image

వనపర్తికి చెందిన ఎస్వీ రమేష్(నవీన ఫోటో పార్లర్) ప్రతిభ చాటారు. సౌత్ ఆఫ్రికాలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫోటోగ్రఫీ185 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా 15 రోజు నిర్వహించిన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొన్నారు. అక్కడ చిత్రాలను ఆకర్షణీయంగా చిత్రీకరించిన ఆయన ఫోటోగ్రఫీ వర్క్‌షాప్‌లో చిత్రాలను ప్రదర్శించి ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలు ఆయనకు అభినందనలు తెలిపారు.