Telangana

News September 10, 2024

ముగిసిన శ్వేతారెడ్డి అంత్యక్రియలు

image

నాగర్ కర్నూల్ జిల్లా అవంచలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతారెడ్డి అంత్యక్రియలు జరిగాయి. వారి వ్యవసాయ పొలంలో శ్వేతారెడ్డి చితికి కుమారుడు స్వరూన్ రెడ్డి నిప్పు అంటించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి కన్నీటి పర్యాంతమయ్యారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. లక్ష్మారెడ్డిని పాలమూరు ప్రజాపతినిధులతోపాటు బీఆర్అస్ నాయుకలు పరామర్శించారు.

News September 10, 2024

KMM: పోలీస్ జాగిలానికి ఏఎస్పీ ఘన నివాళి

image

అనారోగ్యంతో మరణించిన పోలీస్ జాగిలం షైనీకి ఘనంగా అంతిమ వీడ్కోలు పలికారు. జిల్లా పోలీస్ శాఖకు పోలీస్ జాగిలం షైనీ అందించిన సేవలు మరువలేనివని అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ పరితోష్ పంకజ్ అన్నారు. ఈ రోజు జిల్లా పోలీస్ డాగ్ స్క్వాడ్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ జాగిలం అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది. గత నెల రోజులుగా బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఈ రోజు తుది శ్వాస విడిచింది.

News September 10, 2024

HYD: సేవా గుర్తింపు అవార్డు అందుకున్న CID డైరెక్టర్

image

HYD ఉమెన్ సేఫ్టీ వింగ్ DGP, CID, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ షికా గోయల్, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా సేవా గుర్తింపు అవార్డు అందుకున్నారు. సైబర్ క్రైమ్ అనాలిసిస్ టూల్ సమన్వయ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసినందుకు ఈ అవార్డు అందించారు. అవార్డు అందుకోవడం ఎంతో గర్వంగా ఉందని DGP సంతోషం వ్యక్తం చేశారు.

News September 10, 2024

ఖమ్మం: జిల్లాలో 76 కి.మీ.మేర దెబ్బతిన్న రహదారులు

image

ఖమ్మం జిల్లాలో వరదల కారణంగా 76 కి.మీ.మేర రహదారులు దెబ్బతిన్నాయి. పలు చోట్ల కోతకు గురికాగా, మరికొన్ని చోట్ల పూర్తిగా తెగిపోయాయి. ఈ మొత్తం నష్టం విలువ రూ.180.37 కోట్లుగా ఉందని అధికారులు పేర్కొన్నారు. అలాగే జిల్లావ్యాప్తంగా నీటిపారుదల శాఖ పరిధిలో రూ.60 కోట్ల మేర నష్టం జరిగిందని నివేదికల్లో పొందుపర్చారు. 45 చెరువులకు పలు ప్రాంతాల్లో గండ్లు పడ్డాయి. మొత్తంగా 103 ప్రాంతాల్లో ఈ శాఖకు నష్టం వాటిల్లింది.

News September 10, 2024

వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ వర్క్‌షాప్‌లో వనపర్తి ఫోటో గ్రాఫర్

image

వనపర్తికి చెందిన ఎస్వీ రమేష్(నవీన ఫోటో పార్లర్) ప్రతిభ చాటారు. సౌత్ ఆఫ్రికాలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫోటోగ్రఫీ185 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా 15 రోజు నిర్వహించిన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొన్నారు. అక్కడ చిత్రాలను ఆకర్షణీయంగా చిత్రీకరించిన ఆయన ఫోటోగ్రఫీ వర్క్‌షాప్‌లో చిత్రాలను ప్రదర్శించి ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలు ఆయనకు అభినందనలు తెలిపారు.

News September 10, 2024

షిర్డీ సాయినాథుడి సేవలో స్పీకర్

image

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ షిర్డీ సాయినాథుడిని ఈరోజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సభ్యులు స్పీకర్‌కు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం మధ్యాహ్నం హారతి సమయంలో మహారాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రాధాకృష్ణ వికే పాటిల్‌తో కలిసి సాయినాథుడిని మహా సమాధిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

News September 10, 2024

దుబ్బాక: ఆస్తి విషయంలో తండ్రితో గొడవ.. కొడుకు సూసైడ్

image

దుబ్బాక మండలం పెద్దగుండవెల్లిలో ఆస్తి పంపకాల విషయంలో తండ్రితో గొడవపడి కొడుకు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉమ్మడి ఆస్తిగా ఉన్న ఆరు ఎకరాల వ్యవసాయ భూమి పంపకం చేయాలని తండ్రి వెంకయ్యతో కొడుకు గంట బాలయ్య(39) 3న గొడవపడ్డాడు. పెద్దల సమక్షంలో రిజిస్ట్రేషన్ చేయిస్తానని తండ్రి చెప్పడంతో ఇంట్లోకి వెళ్లి గడ్డి మందు గుళికలు మింగాడు. చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందినట్లు ఎస్సై గంగరాజు తెలిపారు.

News September 10, 2024

జగిత్యాల: మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలి: కలెక్టర్

image

జగిత్యాల జిల్లాలోని సీజనల్ వ్యాధులపై జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆధ్వర్యంలో మెడికల్ ఆఫీసర్లు, హెల్త్ సూపెర్వైజర్‌లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో డెంగీ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉందని పలు అంశాలపై మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అన్ని గ్రామాల్లో ఫాగింగ్ చేయాలనీ, పిచ్చి మొక్కల్ని తొలిగించి జ్వరాలు వచ్చే చోట మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు.

News September 10, 2024

అడవుల సంరక్షణకై పోరాటం చేస్తూ ప్రాణాలు అర్పిస్తున్నారు: మంత్రి కొండా

image

దేశ రక్షణకు సరిహద్దుల్లో శత్రుమూకలతో పోరాడుతూ సైనికులు ప్రాణాలు అర్పిస్తుంటే, సహజ వనరులైన అడవుల సంరక్షణకై పోరాటం చేస్తూ అటవీ ఉద్యోగులు ప్రాణాలు అర్పిస్తున్నారని మంత్రి కొండా సురేఖ తెలిపారు. రేపు జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా అడవుల సంరక్షణకై ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను స్మరించుకుంటూ అటవీ సంపద సంరక్షణకు, వన్యప్రాణుల పరిరక్షణకు ఉద్యోగులు చేస్తున్న కృషిని ప్రశంసించారు.

News September 10, 2024

కామారెడ్డి: అష్టావధాని ఆయాచితం నటేశ్వరశర్మ కన్నుమూత

image

ప్రఖ్యాత కవి,అష్టావధాని డాక్టర్ ఆయాచితం నటేశ్వరశర్మ మంగళవారం అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. రామారెడ్డి మండలానికి చెందిన నటేశ్వర శర్మ సంస్కృతంలో 50కి పైగా రచనలు రాశారు. డాక్టర్ నటేశ్వర శర్మ రచనలకు గాను రాష్ట్ర ప్రభుత్వం 2023లో దాశరథి పురస్కారంతో ఘనంగా సత్కరించారు. డాక్టర్ నటేశ్వర శర్మ కన్నుమూయడంతో కవులు, కళాకారులు శోక సముద్రంలో మునిగారు.