Telangana

News September 27, 2024

వరంగల్: పడిపోయిన కొత్త పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు ఈరోజు కొత్త పత్తి భారీగా తరలి వచ్చింది. అయితే ధర మాత్రం గురువారంతో పోలిస్తే నేడు తగ్గింది. నిన్న కొత్త పత్తి క్వింటాకు రూ.7,070 పలకగా నేడు రూ.7,025కి పడిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. పత్తి ధరలు రోజురోజుకూ తగ్గిపోతుండడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.

News September 27, 2024

18 నుంచి LLB రెండో సెమిస్టర్ పరీక్షలు

image

కాకతీయ విశ్వవిద్యాలయ ఐదేళ్ల LLB (రెండో సెమిస్టర్) పరీక్ష టైం టేబుల్‌ను పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య నరసింహచారి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ BSL సౌజన్య విడుదల చేసారు. మొదటి పేపర్ అక్టోబర్ 18న, 2వ పేపర్ అక్టోబర్ 22న, 3వ పేపర్ అక్టోబర్ 24న, 4వ పేపర్ అక్టోబర్ 26న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతాయన్నారు. వివరాలను విశ్వవిద్యాలయ వెబ్ సైట్లో చూడవచ్చన్నారు.

News September 27, 2024

దామరగిద్ద మండలంలో చిరుత సంచారం

image

దామరగిద్ద మండల పరిధిలో చిరుత సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. స్థానిక రైతుల వివరాలు.. రెండు రోజుల క్రితం దామరగిద్ద తండాకు సమీపంలో గోన్యనాయక్ అనే రైతుకు చెందిన ఆవుదూడ పై దాడి చేసింది. గురువారం రోజు వత్తుగుండ్లకు చెందిన గొల్ల రాములు మేకలను మేపుతుండగా ఒక్కసారిగా మేకల గుంపుపై దాడి చేసి మేకను గాయపరిచింది. రైతు కేకలు వేయడంతో అడవిలోకి పారిపోయింది. పులిని బంధించాలని రైతులు కోరుతున్నారు.

News September 27, 2024

కేయూ LLB సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్

image

KU మూడేళ్ల LLB (2వ సెమిస్టర్) & 5 సం.ల (6వ సెమిస్టర్) పరీక్ష టైం టేబుల్‌ను పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య నరసింహ చారి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ సౌజన్య విడుదల చేసారు. మొదటి పేపర్ అక్టోబర్ 17న, 2వ పేపర్ అక్టోబర్ 19న, 3వ పేపర్ అక్టోబర్ 21న, 4వ పేపర్ అక్టోబర్ 23న, 5వ పేపర్ అక్టోబర్ 25న, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల మధ్య జరుగుతాయన్నారు. వివరాలు www.kakatiya.ac.in లో చూడవచ్చన్నారు.

News September 27, 2024

BREAKING: ములుగు జిల్లాలో అటవీ అధికారులపై దాడి

image

ములుగు జిల్లాలో దారుణం జరిగింది. తాడ్వాయి రేంజ్ పరిధి దమరవాయి అటవీ ప్రాంతంలో కొందరు అక్రమంగా చెట్లను నరికి వేస్తుండగా అటవీశాఖ అధికారులు వినోద్, శరత్ చంద్ర, సుమన్ అడ్డుకున్నారు. దీంతో వారిపై JCB ఓనర్ సూరజ్ రెడ్డి మరో ఇద్దరితో కలిసి విచక్షణా రహితంగా ఇనుప రాడ్లతో దాడి చేశాడని అటవీ అధికారులు చెప్పారు. వారి వాహనాలు ధ్వంసం చేశారన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని అటవీ అధికారులు చెప్పారు.

News September 27, 2024

నిజామాబాద్: కళ్లలో కారం చల్లి హత్య

image

నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కంజర్‌లో <<14198416>>వియ్యంకుడిని <<>>హత్య చేసిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. కంజర్‌కు చెందిన సత్యనారాయణ తన కూతురిని అదే గ్రామానికి చెందిన నరహరి కుమారుడికి ఇచ్చి వివాహం చేశాడు. కాగా ఇటీవల వర్ష ఆత్మహత్య చేసుకుంది. దీనికి కారణం అల్లుడే అనే అనుమానంతో అతడి ఇంటిపై దాడి చేశారు. ఆ సమయంలో గోవర్ధన్ ఇంట్లో లేపోవడంతో అతడి తండ్రి కళ్లలో కారం చల్లి కర్రలతో కొట్టి చంపాడు.

News September 27, 2024

వరంగల్: 274 మందికి డీఎస్సీ కౌన్సెలింగ్

image

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 274 మంది 2008 డీఎస్సీ అభ్యర్థులకు కాంట్రాక్టు ఎస్జీటీ ఉద్యోగాల నియామకానికి నేటి నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. నేటి నుంచి అక్టోబర్ 5 వరకు హనుమకొండలోని డీఈవో ఆఫీసులో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని అధికారులు చెప్పారు. అర్హులు వారి సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.

News September 27, 2024

కరీంనగర్: మత్స్యకారుల ఆందోళన!

image

మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు గత ప్రభుత్వం అమలు చేసిన ఉచిత చేపల పంపిణీ కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు జరగకపోవడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం పూర్తి అవుతున్నప్పటికీ చేప పిల్లల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో అయోమయంలో పడ్డారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 13,456 హెక్టార్లలో 1,008 చెరువులు, కుంటలు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి.

News September 27, 2024

వరంగల్: వాహనం ఢీకొని కానిస్టేబుల్ మృతి

image

వాహనం ఢీకొని కానిస్టేబుల్ మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. వరంగల్ జిల్లా మామునూరు శివారులో గురువారం రాత్రి వాహనం ఢీకొని కానిస్టేబుల్ విజయేందర్ మృతి చెందాడు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పోలీస్ స్టేషన్‌లో విజయేందర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 27, 2024

మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌కు రాష్ట్రస్థాయి అవార్డు

image

మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయికి రాష్ట్రస్థాయి అవార్డు వరించింది. రాష్ట్రంలోనే అత్యధికంగా యువ టూరిజం క్లబ్బులను ఏర్పాటు చేసినందుకుగాను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కలెక్టర్ అవార్డు అందుకొనున్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా కలెక్టర్‌కు అవార్డును ఇవ్వనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా 1,350 ఏర్పాటు చేశారు.