Telangana

News September 10, 2024

KMM: అతిథి అధ్యాపక పోస్టులకు ఇంటర్వ్యూ

image

ఖమ్మం జిల్లాలో SR&BGNR కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల పోస్టులకు మంగళవారం సాయంత్రం 5:00 గంటలకు దరఖాస్తు ముగిసింది. ఇంటర్వ్యూకి తేదీలు ప్రకటించారు. 11న జరగనున్న ఇంగ్లిష్-1,హిస్టరీ-3,ఎకనామిక్స్-1 గణితం-3, బోటనీ-1,కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్-3,BCA-1,డేటా సైన్స్-1,బయో టెక్నాలజీ-1,12తేదీన జరగనున్న ఇంటర్వ్యూ కామర్స్-2, పొలిటికల్ సైన్స్-2,BBA-2 ఓ ప్రకటనలో ప్రిన్సిపల్ జాకీరుల్లా తెలిపారు.

News September 10, 2024

BREAKING: 5 నెలల్లో 6,916 డ్రైవింగ్ లైసెన్సులు SUSPEND

image

TG వ్యాప్తంగా ఏప్రిల్ ఒకటి నుంచి ఆగస్టు 31 వరకు 5 నెలల్లో సుప్రీంకోర్టు ఆదేశాలు, రోడ్ సేఫ్టీ అండ్ మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం 6,916 డ్రైవింగ్ లైసెన్సులు సస్పెండ్ చేసినట్లు HYDలో రవాణా శాఖ వెల్లడించింది. ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఓవర్ లోడింగ్ చేసిన వారివి సస్పెండ్ చేశామని వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సు సస్పెండ్ తప్పదని హెచ్చరించారు.

News September 10, 2024

నల్గొండ: ‘వస్త్ర నిల్వలను కొనుగోలు చేసి ఆదుకోవాలి’

image

వస్త్ర నిల్వలను కొనుగోలు చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ డిమాండ్ చేశారు. చేనేత కార్మికుల దగ్గర, సహకార సంఘాల దగ్గర పేరుకుపోయిన వస్త్రాల నిల్వలను ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేయాలని ఆయన కోరారు. జిల్లా కేంద్రంలోని సిపిఎం ఆఫీస్ లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. 280 కోట్ల బకాయిలు, 30 కోట్ల రుణమాఫీ నిధులు విడుదల పట్ల హర్షం వ్యక్తం చేశారు.

News September 10, 2024

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ ప్రావీణ్య

image

వంగరలోని ఉన్నత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నేడు కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన పలు రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన అన్ని విభాగాలను సందర్శించి వాటికి సంబంధించిన సమాచారాన్ని సంబంధిత వైద్య ఆరోగ్య సిబ్బందిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలు నిమిత్తం ఆరోగ్య కేంద్రానికి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలను అందించాలన్నారు.

News September 10, 2024

భద్రాచలం: జిల్లా కలెక్టర్‌తో ఎమ్మెల్యే సమావేశం

image

వరద ప్రభావిత ప్రాంతాల గురించి జిల్లా కలెక్టర్తో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సమావేశం నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో భద్రాచలం నియోజకవర్గానికి సంబంధించిన వరద ప్రభావిత ప్రాంతాల గురించి మాట్లాడారు. 2వ ప్రమాద హెచ్చరికకు గోదావరి వరద ప్రవాహం దగ్గర్లో ఉండడంతో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఎమ్మెల్యే కోరారు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు.

News September 10, 2024

మంత్రి పొన్నం ప్రభాకర్‌పై మండిపడ్డ మేయర్ సునీల్ రావు

image

మంత్రి పొన్నం ప్రభాకర్‌పై కరీంనగర్ మేయర్ సునీల్ రావు మండిపడ్డారు. నగరంలో ఆయన మాట్లాడాతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతుందని, బాధ్యత గల మంత్రిగా కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధికి పొన్నం ఒక్క రూపాయి మంజూరు చేయలేదన్నారు. నగరంలో 3 నెలల క్రితం తమకు సమాచారం లేకుండా మున్సిపల్ సమీక్ష సమావేశం చేశారని, తమ నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా కరీంనగర్లో సమావేశాలు పెట్టడమేంటని ప్రశ్నించారు.

News September 10, 2024

అలంపూర్ నూతన పాలక మండలికి నేనంటే.. నేను.. ?

image

అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి నియమించే పాలక మండలిలో నేనంటే నేనంటూ రాజకీయ నిరుద్యోగులు ఎవరి ప్రయత్నాల్లో వారు తెరచాటు ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. గత పాలక మండలి నుంచి కొందరు ప్రయత్నాలు చేస్తుండగా.. మరికొందరు సంపత్ కుమార్ వర్గం నుంచి ప్రయత్నిస్తుండగా.. మరికొందరు సీఎం సోదరుల ద్వారా ప్రయత్నిస్తున్నారు. ఇలా ఎవరి ప్రయత్నాల్లో వారు పోటీ పడుతున్నారు.

News September 10, 2024

HYD: టీవీవీపీ ఆస్పత్రుల్లోని సిబ్బందికి జీతాలు చెల్లించాలి

image

తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో పని చేస్తున్న శానిటేషన్, ఇతర సిబ్బందికి 6 నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడం అమానుషం అని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నట్లు చెప్పుకునే సీఎంకు వీరి వెతలు కనిపించకపోవడం శోచనీయమన్నారు. టీవీవీపీ ఆసుపత్రుల్లోని సిబ్బందికి వెంటనే జీతాలు చెల్లించాలని, పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేశారు.

News September 10, 2024

సంగారెడ్డి: కరాటే శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

లక్ష్మీబాయి రక్ష ప్రశిక్షణ పేరుతో పాఠశాలలో అమలు చేయనున్న కరాటే శిక్షణ కోసం ఈనెల 16 వరకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. ఎంపికైన వారు పాఠశాలల్లో బాలికలకు కరాటే శిక్షణ నేర్పించాల్సి ఉంటుందని చెప్పారు. పూర్తి వివరాలకు సంగారెడ్డి కలెక్టరేట్ లోని సమగ్ర శిక్ష కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు.

News September 10, 2024

మేడారంలో శాశ్వత పనులకు ప్రతిపాదన సిద్ధం చేయాలి: కలెక్టర్

image

మేడారం జాతరకు శాశ్వత అభివృద్ధి పనుల ప్రతిపాదన సిద్ధం చేయాలని ములుగు కలెక్టర్ దివాకర టిఎస్ అధికారులను ఆదేశించారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సునీతతో కలిసి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మేడారం జాతరలో భక్తుల కోసం ఏర్పాటు చేసే క్యూ లైన్లలో తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. గద్దెల ప్రాంగణంలో నీరు నిల్వ ఉండకుండా పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా నిర్వహించాలన్నారు.