Telangana

News September 10, 2024

శ్వేతారెడ్డికి నివాళులర్పించిన ఎమ్మెల్యేలు

image

జడ్చర్ల మాజీ మంత్రి చర్లకోల లక్ష్మారెడ్డి సతీమణి గత రాత్రి అనారోగ్యంతో చెన్నైలో మరణించింది. ఆమె భౌతిక దేహాన్నినాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఉమ్మడి MBNR జిల్లా ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, జనంపల్లి అనిరుద్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి వాకటి శ్రీహరి, కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.

News September 10, 2024

ADB: ‘క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకోవద్దు’

image

క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆదిలాబాద్ డీఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 10 ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా స్థానిక రిమ్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని కరపత్రాలను ఆవిష్కరించారు. ఆత్మహత్యలకు పాల్పడటం వల్ల వారి కుటుంబాలు చిన్న భిన్నమవుతాయన్నారు. ఉచిత కౌన్సెలింగ్ కొరకు 14416 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

News September 10, 2024

HYD: టీవీవీపీ ఆస్పత్రుల్లోని సిబ్బందికి జీతాలు చెల్లించాలి

image

తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో పని చేస్తున్న శానిటేషన్, ఇతర సిబ్బందికి 6 నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడం అమానుషం అని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నట్లు చెప్పుకునే సీఎంకు వీరి వెతలు కనిపించకపోవడం శోచనీయమన్నారు. టీవీవీపీ ఆసుపత్రుల్లోని సిబ్బందికి వెంటనే జీతాలు చెల్లించాలని, పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేశారు.

News September 10, 2024

లక్ష్మారెడ్డి సతీమణి మృతి పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి

image

మాజీ మంత్రి, BRS మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతా లక్ష్మారెడ్డి(60) సోమవారం రాత్రి మృతిచెందారు. కాగా శ్వేతా మృతి పట్ల మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. లక్ష్మారెడ్డికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంత్యక్రియలకు బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు తదితరులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు వెల్లడించారు.

News September 10, 2024

జక్రాన్‌పల్లి: చోరీకి గురైన శివలింగం

image

నూతనంగా నిర్మించనున్న శివాలయం స్థలంలో తాత్కాలికంగా ప్రతిష్ఠించిన శివలింగాన్ని గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లిన ఘటన వారం రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. మండలంలోని మునిపల్లి గ్రామంలోని వడ్డెర కాలనీలో నిర్మించనున్న గుడి స్థలంలో ప్రతిష్ఠించిన శివలింగం చోరీకి గురైనట్లు స్థానికులు కాలనీవాసులు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు ఎస్ఐ తిరుపతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News September 10, 2024

గల్ఫ్‌లో మరో మెదక్ జిల్లా వాసి మృతి

image

గల్ఫ్‌లో మరో మెదక్ జిల్లా వాసి మృతి చెందాడు. హవేలీఘనపూర్ మండలం సుల్తాన్ పూర్ తండాకు చెందిన రామావత్ వస్రాం(40) మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిజామాబాద్‌కు చెందిన ఏజెంట్ ద్వారా గత నెల10న కూలి పని కోసం దుబాయ్ వెళ్ళాడు. నిన్న మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. కాగా మెదక్ మండలం తిమ్మక్కపల్లి తండాకు చెందిన రాట్ల సూర్య కూడా ఈనెల 1న అబుదాబిలో మరణించగా మృతదేహం కోసం ఎదురు చూస్తున్నారు.

News September 10, 2024

కరీంనగర్: ఏరియా ఆసుపత్రులకు గుర్తింపు.. నిధులు కరవు!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రి, వేములవాడ ఏరియా ఆసుపత్రులకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇటీవల ఎన్క్వాస్ అవార్డుకు ఎంపికయ్యాయి. ఇక్కడి వైద్యులు ఆసుపత్రిలో రోగులకు నాణ్యమైన సేవలు అందిస్తుండడంతో పాటు చక్కటి నాణ్యత ప్రమాణాలను పాటిస్తున్నారు. ఈ క్రమంలో గుర్తింపు లభించింది. అయితే మంచి సేవలు అందిస్తున్నప్పటికీ ఈ ఆసుపత్రులకు నిధులు మాత్రం కరవయ్యాయి.

News September 10, 2024

HYD: వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ ఏర్పాటుకు 3 ప్రాంతాల పరిశీలన

image

HYD శివారులో రానున్న ప్యూచర్ సిటీలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రారంభించేందుకు రంగారెడ్డి జిల్లా అధికారులు ప్లాన్‌లు రూపొందిస్తున్నారు. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ తరహాలో మన HYDలోనూ సెంటర్ ఏర్పాటు చేయాలని వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆసక్తి చూపినట్లు వారు తెలిపారు. ఇందుకు 3ప్రాంతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ మేరకు 70 ఎకరాల స్థలం అవసరమని భావిస్తున్నారు.

News September 10, 2024

HYD: వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ ఏర్పాటుకు 3 ప్రాంతాల పరిశీలన

image

HYD శివారులో రానున్న ప్యూచర్ సిటీలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రారంభించేందుకు రంగారెడ్డి జిల్లా అధికారులు ప్లాన్‌లు రూపొందిస్తున్నారు. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ తరహాలో మన HYDలోనూ సెంటర్ ఏర్పాటు చేయాలని వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆసక్తి చూపినట్లు వారు తెలిపారు. ఇందుకు 3ప్రాంతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ మేరకు 70 ఎకరాల స్థలం అవసరమని భావిస్తున్నారు.

News September 10, 2024

వరంగల్: మార్కెట్లో క్వింటా పత్తి ధర రూ.7,700

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో రెండు రోజులుగా పత్తి ధరలు రైతన్నలకు స్వల్ప ఊరటనిస్తున్నాయి. మార్కెట్లో ఈరోజు క్వింటా పత్తి ధర నిన్నటి లాగే రూ.7,700 పలికిందని మార్కెట్ అధికారులు తెలిపారు. పత్తి ధర మరింత పెరిగేలా వ్యాపారులు చొరవ తీసుకోవాలని రైతన్నలు కోరుతున్నారు. మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.