Telangana

News September 10, 2024

HYD: గండిపేట చెరువులో భారీ చేప (PHOTO)

image

ఇటీవల కురుస్తోన్న భారీ వర్షాలు, వరదలకు గండిపేట చెరువు నిండుకుండలా మారింది. దీంతో జాలరులు చేపల వేట కొనసాగిస్తున్నారు. సోమవారం మొయినాబాద్ మండలం హిమాయత్‌నగర్‌కి చెందిన కొంతమంది చేపల వేటలో పడ్డారు. దాదాపు 12 కిలోలకు పైగా చేప వలకు చిక్కింది. ఇది తెలుసుకున్న యువత గాళాలు వేసి చేపలు పట్టేందుకు ఆసక్తి చూపించారు.

News September 10, 2024

HYD: గండిపేట చెరువులో భారీ చేప (PHOTO)

image

ఇటీవల కురుస్తోన్న భారీ వర్షాలు, వరదలకు గండిపేట చెరువు నిండుకుండలా మారింది. దీంతో జాలరులు చేపల వేట కొనసాగిస్తున్నారు. సోమవారం మొయినాబాద్ మండలం హిమాయత్‌నగర్‌కి చెందిన కొంతమంది చేపల వేటలో పడ్డారు. దాదాపు 12 కిలోలకు పైగా చేప వలకు చిక్కింది. ఇది తెలుసుకున్న యువత గాళాలు వేసి చేపలు పట్టేందుకు ఆసక్తి చూపించారు.

News September 10, 2024

NLG: 10.58 లక్షల ఎకరాల్లో వరి సాగు!

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో వరి నాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సీజన్లో మొత్తం 20.83 లక్షల ఎకరాలు సాగు చేయగా.. ఇందులో 90% ప్రస్తుతం పంటలు వేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక్క వరి పంటనే 10.58 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. గత వారం రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు భారీ,మధ్య,చిన్న తరహా ప్రాజెక్టులతో పాటు చెరువులు, కుంటలు నిండుకుండలుగా మారాయి.

News September 10, 2024

MDK: టాస్కులు, కమీషన్ పేరుతో భారీ మోసం

image

సైబర్ మోసంలో టెకీ రూ.లక్షలు పోగొట్టుకున్న ఘనట అమీన్‌పూర్ PS పరిధిలో జరిగింది. పోలీసులు వివరాలు.. జన్మభూమి కాలనీ ఫేస్-2కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి టాస్కులు, కమీషన్ పేరుతో మెసేజ్ వచ్చింది. ఉద్యోగి తన వివరాలు నమోదు చేయగా టాస్కులు పూర్తి చేస్తే పెట్టిన నగదుతోపాటు కమీషన్ వస్తుందని నమ్మించారు. ఉద్యోగి పలు దఫాలుగా రూ.15.82లక్షలు వేశాడు. తాను పెట్టిన నగదుతో పాటు కమీషన్ ఇవ్వాలని అడుగగా స్పందించ లేదు.

News September 10, 2024

కరీంనగర్: ఎమ్మెల్సీ పదవికి ఎత్తుగడలు!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 30 నుంచి ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభించాలని కేంద్రం ప్రకటన జారీ చేసింది. దీంతో ప్రధాన పార్టీలు బలమైన నాయకులను పోటీలో దింపేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఆశావహులు కూడా పోటీలో నిలబడేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు.

News September 10, 2024

HYD: మరణంలోనూ వీడని స్నేహం

image

HYD శివారు షాద్‌నగర్ సమీపంలోని ఎలికట్ట శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. కొందర్గు మండలానికి చెందిన కరుణాకర్, శేఖర్ ప్రాణ స్నేహితులు. వీరు ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్లేవారు. ఆదివారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు షాద్‌నగర్‌లో కలుసుకున్నారు. మద్యం సేవించి బైక్‌పై ఇంటికి బయల్దేరారు. మార్గమధ్యలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు.

News September 10, 2024

NZB: ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

డిచ్పల్లి మండలం రాంపూర్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించబోయే వృద్ధాశ్రమంలో పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా రెడ్ క్రాస్ ఛైర్మన్ ఆంజనేయులు తెలిపారు. హోమ్ కోఆర్డినేటర్, అసిస్టెంట్ కోఆర్డి నేటర్, ఏఎన్ఎం, వంట మనిషి, వంట సహాయకుడు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ నెల 18లోపు రెడ్ క్రాస్ జిల్లా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News September 10, 2024

నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆప్డేట్

image

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు 12 గేట్లను ఎత్తి 95,490 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 1,38,473 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 1,38,473 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589 అడుగులుగా ఉంది.

News September 10, 2024

మళ్ళీ పెరిగిన పత్తి ధర….ఎంతంటే!

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.20,000, క్వింటా పత్తి ధర రూ.7,900 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర స్థిరంగా ఉండగా, పత్తి ధర మాత్రం రూ.100 పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు. మార్కెట్ కు వచ్చే రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు.

News September 10, 2024

ADB: నోటితో విషం తీసి విద్యార్థి ప్రాణం కాపాడిన టీచర్

image

విద్యార్థిని పాము కాటేయడంతో వెంటనే ఓ ఉపాధ్యాయుడు నోటితో విషం తొలగించి విద్యార్థి ప్రాణాన్ని కాపాడాడు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం ధనోర ప్రభుత్వ పాఠశాలలో సోమవారం 1వ తరగతి విద్యార్థి యశ్వంత్‌ని పాము కాటేసింది. వెంటనే ఉపాధ్యాయుడు సురేశ్ నోటితో విషం తీసేసి విద్యార్థి ప్రాణం కాపాడినట్లు స్థానికులు తెలిపారు. దీంతో ఆయన్ను పలువురు అభినందించారు.