Telangana

News September 10, 2024

నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆప్డేట్

image

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు 12 గేట్లను ఎత్తి 95,490 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 1,38,473 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 1,38,473 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589 అడుగులుగా ఉంది.

News September 10, 2024

మళ్ళీ పెరిగిన పత్తి ధర….ఎంతంటే!

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.20,000, క్వింటా పత్తి ధర రూ.7,900 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర స్థిరంగా ఉండగా, పత్తి ధర మాత్రం రూ.100 పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు. మార్కెట్ కు వచ్చే రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు.

News September 10, 2024

ADB: నోటితో విషం తీసి విద్యార్థి ప్రాణం కాపాడిన టీచర్

image

విద్యార్థిని పాము కాటేయడంతో వెంటనే ఓ ఉపాధ్యాయుడు నోటితో విషం తొలగించి విద్యార్థి ప్రాణాన్ని కాపాడాడు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం ధనోర ప్రభుత్వ పాఠశాలలో సోమవారం 1వ తరగతి విద్యార్థి యశ్వంత్‌ని పాము కాటేసింది. వెంటనే ఉపాధ్యాయుడు సురేశ్ నోటితో విషం తీసేసి విద్యార్థి ప్రాణం కాపాడినట్లు స్థానికులు తెలిపారు. దీంతో ఆయన్ను పలువురు అభినందించారు.

News September 10, 2024

HYD: మరణంలోనూ వీడని స్నేహం

image

షాద్‌నగర్ సమీపంలోని ఎలికట్ట శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. కొందర్గు మండలానికి చెందిన కరుణాకర్, శేఖర్ ప్రాణ స్నేహితులు. వీరు ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్లేవారు. ఆదివారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు షాద్‌నగర్‌లో కలుసుకున్నారు. మద్యం సేవించి బైక్‌పై ఇంటికి బయల్దేరారు. మార్గమధ్యలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు.

News September 10, 2024

RRR భూ సేకరణకు మరో ముందడుగు..!

image

RRR భూ సేకరణకు మరో ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు జాతీయ రహదారుల విభాగం వారు కోరినంత స్థలాన్ని అప్పగించేందుకు జిల్లా రెవెన్యూ యంత్రాంగం నడుం బిగించింది. జిల్లాకు సంబంధించి తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాలకు అదనపు కలెక్టర్, భువనగిరి, చౌటుప్పల్ రెవిన్యూ డివిజన్లకు ఆయా డివిజన్ల ఆర్డీవోలను అధీకృత భూసేకరణ అధికారులుగా నియమించారు.

News September 10, 2024

MBNR: మరణంలోనూ వీడని స్నేహం

image

షాద్‌నగర్ సమీపంలోని ఎలికట్ట శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. కొందర్గు మండలానికి చెందిన కరుణాకర్, శేఖర్ ప్రాణ స్నేహితులు. వీరు ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్లేవారు. ఆదివారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు షాద్‌నగర్‌లో కలుసుకున్నారు. మద్యం సేవించి బైక్‌పై ఇంటికి బయల్దేరారు. మార్గమధ్యలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు.

News September 10, 2024

HYD: విజేతలను అభినందించిన సీఎం రేవంత్

image

హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఇంటర్ కాంటినెంటల్ కప్ (4వ ఎడిషన్) 2024 విజేతలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఇంటర్ కాంటినెంటల్ కప్ 2024 విజేతగా సిరియా నిలిచింది. విన్నింగ్ టీమ్‌కు ఇంటర్ కాంటినెంటల్ కప్-2024ను సీఎం అందజేశారు. ఈ నెల 3న ఫుట్ బాల్ టోర్నమెంట్‌ను సీఎం రేవంత్ ప్రారంభించిన విషయం తెలిసిందే.

News September 10, 2024

జగిత్యాల: విష జ్వరంతో విద్యార్థి మృతి

image

విష జ్వరంతో విద్యార్థి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. ధర్మపురి మండల కేంద్రంలో హనుమాన్ వీధికి చెందిన గజ్జల రామ్ చరణ్(10) 4వ తరగతి చదువుతున్నారు. వారం రోజులుగా జ్వరం రావడంతో కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఆసుపత్రిలో వైద్యం వికటించడంతోనే తమ కుమారుడు మృతి చెందాడని బాలుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

News September 10, 2024

హైదరాబాద్‌లో మొదలైన సందడి

image

HYDలో వినాయక నిమజ్జనాల సందడి మొదలైంది. 3 రోజుల పాటు పూజలు అందుకున్న చిట్టి గణనాథులు ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటున్నాయి. సోమవారం సా. నుంచే వందల సంఖ్యలో విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఖైరతాబాద్ బడా గణేశుడి దర్శనం కోసం భక్తులు క్యూ కట్టారు. ఈ నెల 11, 13, 15, 17న ఇసుకేస్తే రాలనంత మంది భక్తులు ట్యాంక్‌బండ్‌కు వస్తారు. ‘జై బోలో గణేశ్ మహారాజ్‌‌కి జై’ నినాదాలతో HYD హోరెత్తనుంది.