Telangana

News September 10, 2024

MBNR: భారీగా తగ్గిన చికెన్ ధరలు

image

పాలమూరు జిల్లాలో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. గతవారం కిలో రూ. 200లకు పైగానే విక్రయించారు. గణేశ్ నవరాత్రులు మొదలుకావడంతో‌ మాంసం విక్రయాలు క్రమంగా తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. మంగళవారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. విత్ స్కిన్ కిలో రూ. 161, స్కిన్ లెస్ రూ. 183, ఫాంరేటు రూ. 89, రిటైల్ రూ. 111 చొప్పున విక్రయిస్తున్నారు.
SHARE IT

News September 10, 2024

NZB: నూతన రేషన్ కార్డులకు దరఖాస్తులు

image

నిజామాబాద్ జిల్లా ప్రజలకు నూతన రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈ నెల 17 నుంచి నిర్వహించే ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రజాపాలనలో కార్డులు లేనివారికి ఇస్తారా? కుటుంబీకుల పేర్లు జత చేర్చుతారా? ప్రస్తుతం ఉన్నవారికి కొత్తకార్డులు ఇస్తారా తెలియాల్సి ఉంది. అయితే కొత్త కార్డుల జారీకి ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాలేదని అధికారులు వెల్లడించారు.

News September 10, 2024

ADB: రిమ్స్ ఆసుపత్రి టాయిలెట్‌లో క్రికెటర్ మృతి

image

ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో జిల్లాకు చెందిన క్రికెటర్ మృతిచెందాడు. శాంతినగర్‌కు చెందిన శ్రీహరి తన కుమారుడి బ్లడ్ రిపోర్ట్స్ కోసం సోమవారం రిమ్స్‌కి వెళ్లాడు. ఆసుపత్రిలో బాత్‌రూమ్‌కి వెళ్లిన శ్రీహరి తిరిగి రాలేదు. కాగా టాయిలేట్ నుంచి ఫోన్ రింగ్ అవడం గమనించిన సిబ్బంది తలుపు తెరిచి చూడగా అతడు కిందపడి ఉన్నాడు. పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు.

News September 10, 2024

చర్లకోల లక్ష్మారెడ్డి ఇంట్లో విషాదం

image

మాజీ మంత్రి చర్లకోల లక్ష్మారెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. లక్ష్మారెడ్డి భార్య శ్వేతారెడ్డి సోమవారం రాత్రి మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. NGKL జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచలో నేడు మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి. ఆమె మరణంతో నియోజకవర్గంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News September 10, 2024

పాలమూరు జిల్లా వర్షపాత వివరాలు

image

గడచిన 24 గంటల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. గద్వాల జిల్లా కేంద్రంలో 4.8 మిల్లీమీటర్లు, మహబూబ్‌నగర్ జిల్లాలోని చిన్న చింతకుంటలో 3.5 మి.మీ, నాగర్ కర్నూల్ జిల్లా జఠప్లోల్‌లో 2 మి.మీ, నారాయణపేట జిల్లా జక్లేర్లో 5.8 మి.మీ, వనపర్తి జిల్లా వెల్గొండలో 5.8 మి.మీల వర్షపాతం నమోదయింది.

News September 10, 2024

MDK: డెంగ్యూతో బాలుడు మృతి

image

డెంగ్యూతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన బాలుడు చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందాడు. హత్నూర మండలం కొన్యాల గ్రామానికి చెందిన ప్రభులింగం కుమరుడు దశ్విక్(45రోజులు) మూడు రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి నీలోఫర్‌ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు.

News September 10, 2024

వరంగల్: వరకట్న వేధింపులతో వివాహిత సూసైడ్

image

వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు తెలిపిన వివరాలు.. పైడిపల్లికి చెందిన స్వాతికి అదే గ్రామానికి చెందిన నిరంజన్‌తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లయిన తర్వాత నుంచి ఆమె భర్త, అత్త కట్నం తీసుకురమ్మని వేధించేవారు. ఈ క్రమంలో పెద్దమనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయితీ జరిగినా వేధించడం మానకపోయేసరికి ఈ నెల 5న గడ్డి మందు తాగింది. MGMలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది.

News September 10, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

>వివిధ శాఖల అధికారులతో ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష
> వరదలపై వైరా ఎమ్మెల్యే అధికారులతో సమీక్ష
>భద్రాచలం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి
>ఖమ్మం మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న చర్యలు
>అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన
>పినపాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాయం పర్యటన
>సత్తుపల్లిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

News September 10, 2024

MBNR: పీజీ సెమిస్టర్-2 పరీక్షలు ప్రారంభం

image

పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని పీజీ సెమిస్టర్- 2 పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు పీజీ కళాశాల పరీక్ష కేంద్రంలో పీయూ రిజిస్ట్రార్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్షలు సజావుగా జరిగే విధంగా అధికారులు చూడాలని, చూచిరాతలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట కంట్రోలర్ రాజ్ కుమార్, ప్రిన్సిపాల్ చంద్రకిరణ్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

News September 10, 2024

MDKలో భారీగా తగ్గిన చికెన్ ధరలు

image

ఉమ్మడి మెదక్‌లో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. గతవారం కిలో రూ. 200లకు పైగానే విక్రయించారు. గణేశ్ నవరాత్రులు మొదలుకావడంతో‌ మాంసం విక్రయాలు క్రమంగా తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. మంగళవారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. విత్ స్కిన్ కిలో రూ. 161, స్కిన్ లెస్ రూ. 183, ఫాంరేటు రూ. 89, రిటైల్ రూ. 111 చొప్పున విక్రయిస్తున్నారు.
SHARE IT