Telangana

News April 19, 2024

నామినేషన్ దాఖలు చేసిన వంశీ చంద్ రెడ్డి

image

మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వంశీచంద్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే ఎన్నెం శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ హాజరయ్యారు. ఉదయం వంశీ చంద్ రెడ్డికి మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి ర్యాలీ నిర్వహించారు.

News April 19, 2024

నామినేషన్ దాఖలు చేసిన వంశీ చంద్ రెడ్డి

image

మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వంశీచంద్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే ఎన్నెం శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ హాజరయ్యారు. ఉదయం వంశీ చంద్ రెడ్డికి మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి ర్యాలీ నిర్వహించారు.

News April 19, 2024

MDK: బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు

image

మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని ఒక గ్రామంలో బాల్య వివాహాన్ని పోలీసులు అధికారులు అడ్డుకున్నారు. ఒక గ్రామంలో బాలికకు వివాహం చేస్తున్నారంటూ టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం వచ్చింది. వెంటనే గ్రామానికి చేరుకున్న ఎస్సై మహమ్మద్ గౌస్.. బాలికను పోలీస్ స్టేషన్ తరలించి కౌన్సిలింగ్ ఇచ్చి ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. బాలికకు వివాహం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News April 19, 2024

నామా గెలుపు చరిత్రాత్మకం‌ అవుతుంది: పువ్వాడ

image

ఎంపీ ఎన్నికల్లో నామా గెలుపు ఖమ్మం జిల్లాలో చరిత్రాత్మకం‌ అవుతుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. కేసీఆర్ ఆలోచనలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని పువ్వాడ అన్నారు. పార్టీ శ్రేణులంతా కష్టపడి పనిచేసి నామా గెలుపునకు సహకరించాలని ఆయన కోరారు. గతం కంటే అత్యధిక మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం‌ చేశారు. పార్టీ కోసం పనిచేసేవారికి ఎప్పటికైనా అవకాశాలు వస్తాయన్నారు.

News April 19, 2024

సికింద్రాబాద్: ట్రాక్ పునరుద్ధరణలో దక్షిణ మధ్య రైల్వే రికార్డ్

image

దక్షిణ మధ్య రైల్వే తన రైలు నెట్ వర్క్‌లో ట్రాక్ పునరుద్ధరణ పనులకు సంబంధించి మునుపెన్నడూ లేని విధంగా 649 కిలోమీటర్ల ట్రాక్ పునరుద్ధరణను పూర్తి చేయడం ద్వారా 2023-24 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక పనితీరును సాధించిందని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి సిహెచ్ రాకేష్ తెలిపారు. ఇది జోన్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఆర్థిక సంవత్సరంలో కూడా సాధించని అత్యుత్తమ రికార్డు అని ఆయన అన్నారు.

News April 19, 2024

భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిపై కేసు నమోదు

image

భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిపై భూకబ్జా కేసు నమోదైంది. తుర్కయాంజల్‌లోని 200 గజాల ప్లాట్ కబ్జా చేశారంటూ ఆదిభట్ల పీఎస్‌లో ఓ మహిళ ఫిర్యాదు చేసింది. పోలీసులు కిరణ్ పై పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.

News April 19, 2024

ADB: రిమ్స్ పార్కింగ్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

image

ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో గల పార్కింగ్ స్థలంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం శుక్రవారం గుర్తించారు. వ్యక్తి మృతి చెంది ఉండడాన్ని గమనించిన వారు అవుట్ పోస్ట్ పోలీసులకు సమాచారం అందించారు. ఆ వ్యక్తి వద్ద బంగారిగూడ పాఠశాలలో చదువుతున్న ఒక విద్యార్థి ఫొటో మాత్రమే లభించిందని ఇతర వివరాలేవీ ఆయన వద్ద లేవని అవుట్ పోస్ట్ ఇన్‌ఛార్జ్ భూమన్న తెలిపారు. మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించారు.

News April 19, 2024

జగిత్యాల: రైల్వే బ్రిడ్జి పై బ్రిడ్జిపై బాలిక మృతదేహం

image

జగిత్యాల రూరల్ మండలం చల్‌గల్‌ రైల్వే ట్రాక్‌పై కైకేయి(17) అనే బాలిక రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు ఒడిశాకు చెందిన బాలికగా గుర్తించిన జగిత్యాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చల్ గల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇటుక బట్టీల్లో పని చేసే కూలీగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా సూసైడ్‌కు కారణాలు తెలియాల్సి ఉంది.

News April 19, 2024

పీజీ డిప్లొమా ఇన్ లా కోర్సుల పరీక్షా తేదీల ఖరారు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ పీజీ డిప్లొమా ఇన్ లా కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సుల మొదటి, రెండో సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలను ఈనెల 25 నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.

News April 19, 2024

కుక్కల బెడద తగ్గించేందుకు నిధులు అవసరం: కొండా

image

జీహెచ్ఎంసీ పరిధిలో కుక్కల బెడదను తగ్గించేందుకు నిధులు అవసరమని, మణికొండ మున్సిపాలిటీకి సైతం నిధులు అవసరం పడతాయని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇటీవల ఓ వ్యక్తి పై కుక్కలు తీవ్రంగా దాడి చేయడంతో ఆసుపత్రి పాలయ్యాడు. దీని పై స్పందించినా ఆయన, నిధులను సమకూర్చుకొని తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వాల పై ఉందన్నారు.