Telangana

News April 19, 2024

HYD: తల్లి, చెల్లిని పోషించలేక యువకుడి ఆత్మహత్య

image

తల్లి, చెల్లిని పోషించలేకపోతున్నానని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన  శామీర్‌పేట పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. బాబాగూడకు చెందిన సంపత్ గౌడ్ (23) హైటెక్ సిటీలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. కాగా చేసిన పనికి 2 నెలలుగా జీతాలు రాకపోవడంతో చేతిలో డబ్బులు లేకపోవడంతో తల్లితో చెప్పుకోలేకపోయాడు. బయటకు వెళ్తున్నట్లు చెల్లికి చెప్పి ఓ పాఠశాల సమీపంలో ఉరేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.

News April 19, 2024

పెద్దపల్లి: అక్కడ 4 గంటల వరకే పోలింగ్

image

వచ్చేనెల 13న లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పెద్దపల్లి పార్లమెంట్ పరిధి మంథని, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరులోని కొన్ని అటవీ ప్రాంతాలలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న అటవీ ప్రాంతాలలో పోలీసులు పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లకు సిద్ధమయ్యారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఉన్న అటవీ గ్రామాలపై పోలీసులు డేగ కన్ను వేశారు.

News April 19, 2024

నిప్పుల గుండంగా ఉమ్మడి పాలమూరు జిల్లా

image

ఉమ్మడి పాలమూరు జిల్లా నిప్పుల గుండంగా మారింది. రికార్డు స్థాయిలో 43-44 డిగ్రీల మధ్యన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా ధరూరు మండల కేంద్రంలో కావలి వెంకటమ్మ (60) వడదెబ్బతో మృతి చెందింది. మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలం నల్లవెల్లి గ్రామానికి చెందిన నీలకంఠం (32) పిడుగుపాటుతో మృతి చెందాడు.

News April 19, 2024

సూర్యాపేట: క్షుద్ర పూజలు కలకలం

image

తుంగతుర్తిలో క్షుద్ర పూజలు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల ప్రకారం.. మండల పరిధిలోని బాపన్ బాయి తండా ఎక్స్ రోడ్‌లో పసుపు కుంకుమ, నిమ్మకాయలు, బొమ్మతో చేసిన క్లాత్‌తో  గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. గత రాత్రి చేసినట్లుగా స్థానికులు భావిస్తున్నారు. 

News April 19, 2024

ADB: ఐసీఎంఆర్‌లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ICMR ప్రాజెక్ట్‌లో భాగంగా జిల్లాలో అమలు చేయనున్న సంకల్ప్ కార్యక్రమంలో వివిధ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు DMHO నరేందర్ తెలిపారు. మూడేళ్ల పాటు పని చేసే ఈ ప్రాజెక్ట్‌లో నర్సు-1 (5పోస్టులు), నర్సు-3(5), రీసెర్చ్ సైంటిస్ట్-3 మెడికల్ (1), పిల్లల వైద్యనిపుణుడు (1), గైనకాలజిస్ట్, డాటాఎంట్రీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు, అర్హులైన వారు పూర్తి వివరాలకు thanigaipaeds@gamail.com వెబ్సైట్‌ను సందర్శించాలన్నారు.

News April 19, 2024

HYD: డిప్లొమా, B.Tech చేశారా మీకోసమే!

image

HYD మాదాపూర్‌లోని NAC లో బీఈ, బీటెక్ సివిల్, బీఆర్క్, ఎంటెక్ పూర్తి చేసిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా పీజీ డిప్లొమో కోర్సులను అందిస్తున్నట్లు తెలిపారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమో ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమో ఇన్ క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ కోర్సులున్నాయని, డిప్లొమో చేసిన వారికి కన్ స్ట్రక్షన్ సేఫ్టీ కోర్సులో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.

News April 19, 2024

HYD: డిప్లొమా, B.Tech చేశారా మీకోసమే!

image

HYD మాదాపూర్‌లోని NAC లో బీఈ, బీటెక్ సివిల్, బీఆర్క్, ఎంటెక్ పూర్తి చేసిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా పీజీ డిప్లొమో కోర్సులను అందిస్తున్నట్లు తెలిపారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమో ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమో ఇన్ క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ కోర్సులున్నాయని, డిప్లొమో చేసిన వారికి కన్ స్ట్రక్షన్ సేఫ్టీ కోర్సులో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.

News April 19, 2024

ఖమ్మంలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

ఖమ్మంలో ఇవాళ ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద వేగంగా వెళుతున్న లారీ ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 19, 2024

HYD: రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

image

బైకును కారు ఢీకొన్న ఘటనలో కానిస్టేబుల్ మృతి చెందారు. స్థానికుల వివరాలు.. సరూర్ నగర్ PSలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ధనుంజయ్ కుటుంబసభ్యులతో కలిసి బైకుపై ఘట్‌కేసర్‌లో ఓ ఫంక్షన్‌కి గురువారం వెళ్లారు. నేడు ఉదయం ఉప్పల్‌లోని తన నివాసానికి భార్య, పిల్లలతో కలిసి బయల్దేరారు. ఈ క్రమంలో పోచారం ఐటీ కారిడార్ వద్ద కారు వారి బైకును ఢీకొంది. ఈ ఘటనలో కానిస్టేబుల్ మృతి చెందగా.. భార్య, పిల్లలకు గాయాలయ్యాయి.

News April 19, 2024

NZB: సీఐ, ఎస్ఐలకు మానవ హక్కుల ట్రిబ్యునల్ నోటీసులు

image

డిచ్పల్లి సీఐ, జక్రాన్ పల్లి ఎస్ఐకి మానవ హక్కుల ట్రిబ్యునల్ నోటిసులు జారీ చేసింది. జక్రాన్ పల్లికి చెందిన జగడం మోహన్, భూషణ్, భాస్కర్ తమ సొంత భూమి విషయంలో గ్రామాభివృద్ధి కమిటీ వేధింపులపై జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే గ్రామాభివృద్ధి కమిటీ తరఫున డిచ్పల్లి సీఐ, జక్రాన్ పల్లి ఎస్సైలు బాధితులను వేధింపులకు గురి చేశారు. దీంతో బాధితులు మానవ హక్కుల ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు.