Telangana

News April 19, 2024

HYD: రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

image

బైకును కారు ఢీకొన్న ఘటనలో కానిస్టేబుల్ మృతి చెందారు. స్థానికుల వివరాలు.. సరూర్ నగర్ PSలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ధనుంజయ్ కుటుంబసభ్యులతో కలిసి బైకుపై ఘట్‌కేసర్‌లో ఓ ఫంక్షన్‌కి గురువారం వెళ్లారు. నేడు ఉదయం ఉప్పల్‌లోని తన నివాసానికి భార్య, పిల్లలతో కలిసి బయల్దేరారు. ఈ క్రమంలో పోచారం ఐటీ కారిడార్ వద్ద కారు వారి బైకును ఢీకొంది. ఈ ఘటనలో కానిస్టేబుల్ మృతి చెందగా.. భార్య, పిల్లలకు గాయాలయ్యాయి.

News April 19, 2024

ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా తాండ్ర నామినేషన్

image

ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా తాండ్ర వినోద్ రావ్ నామినేషన్ వేశారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో తన నామినేషన్ పత్రాలను కలెక్టర్ గౌతమ్‌కు ఆయన అందించారు. తాండ్ర వెంట జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, పొంగులేటి సుధాకర్ రెడ్డి పలువురు నాయకులు ఉన్నారు. గెలుపుపై ఆ పార్టీ నాయకులు ధీమాతో ఉన్నారు.

News April 19, 2024

MBNR, NGKL స్థానాల్లోనూ త్రిముఖ పోటీయే!

image

MBNR, NGKL పార్లమెంట్ల పరిధిలో త్రిముఖ పోరు కొనసాగనుంది. నువ్వా.. నేనా.. అన్నట్లు అన్ని గ్రామాల్లో ఇప్పటికే అభ్యర్థులు ప్రచారం మొదలుపెట్టారు. గెలుపే లక్ష్యంగా ఒకరిపై ఒకరు విమర్శలు కురిపిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్, BJP, BRS పార్టీలు ఆయా జిల్లాలకు ఇన్‌ఛార్జీలను నియమిస్తూ క్షేత్రస్థాయిలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. నామినేషన్ల అనంతరం ప్రచారం జోరుగా కొనసాగనుంది.

News April 19, 2024

జగిత్యాల: 17 సార్లు ఎన్నికలు..ఒక్కసారే మహిళకు అవకాశం

image

నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. అయితే ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. 1952 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో 1967లో మాత్రమే స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. 11 సార్లు కాంగ్రెస్, 3 సార్లు TDP, TRS, BJP ఒకసారి విజయం సాధించాయి. 2014లో TRS అభ్యర్థిగా కవిత ఎన్నికయ్యారు. 2004లో పునర్విభజన అనంతరం జగిత్యాల, కోరుట్లు నియోజకవర్గాలు నిజామాబాద్‌లో వచ్చి చేరాయి.

News April 19, 2024

భువనగిరి ఎంపీ స్థానానికి సీపీఐ (ఎం) అభ్యర్థి నామినేషన్

image

భువనగిరి పార్లమెంట్ స్థానానికి సీపీఐ (ఎం) పార్టీ అభ్యర్థిగా ఎండీ జహంగీర్ నామినేషన్ వేశారు. ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బీ.వీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి, నాయకులు కొండమడుగు నరసింహలతో కలిసి రిటర్నింగ్ అధికారి హనుమంత్ కే జెండగేకు నామినేషన్ పత్రాలు అందజేశారు.

News April 19, 2024

గజ్వేల్: కేసీఆర్ ఇలాకాపై పార్టీల ఫోకస్

image

మెదక్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీల దృష్టి గజ్వేల్ అసెంబ్లీ స్థానంపైనే కేంద్రీకృతమైంది. కేసీఆర్ సొంత ఇలాకా కావడంతో పట్టు నిలుపేందుకు బీఆర్ఎస్ ఎక్కువ ఓట్లు కొల్లగొట్టి కేసీఆర్‌ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్, బీజేపీ ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. మెజార్టీ సాధించి గెలుపునకు బాటలు వేసుకోవాలనే అభ్యర్థులు ఆరాటపడుతున్నారు. పార్టీల ముఖ్య నేతలు ప్రచారాన్ని విస్తృతం చేస్తున్నారు.

News April 19, 2024

యాదాద్రి: రెండు తలలతో గొర్రె పిల్ల జననం

image

భువనగిరి మండలం పెంచికలపాడులోని బాల్దా రాములుకు చెందిన గొర్రె రెండు తలల పిల్లకు జన్మనిచ్చింది. దీంతో గ్రామస్థులంతా ఆ గొర్రె పిల్లను చూడడానికి వచ్చారు. జన్యుపరమైన లోపం వల్ల ఇలా జరుగుతుందని పశువైద్యులు చెబుతున్నారు. కాగా పుట్టిన కాసేపటికే గొర్రె పిల్ల చనిపోయింది.

News April 19, 2024

MNCL: రైలు ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి

image

మంచిర్యాల- పెద్దంపేట రైల్వే స్టేషన్ల మధ్య శుక్రవారం ఉదయం రైలు ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి చెందింది. మృతురాలు డార్క్ బ్రౌన్ రంగు పూల చీర, బ్రౌన్ కలర్ డాట్స్ బ్లౌజ్, ఆకుపచ్చ పసుపు పచ్చ గాజులు ధరించి ఉంది. జీఆర్పీ ఎస్ఐ సుధాకర్ ఉత్తర్వు మేరకు హెడ్ కానిస్టేబుల్ కెంసారం సంపత్ కేసును దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు 8712658596, 8328512176 నంబర్లకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

News April 19, 2024

24న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నామినేషన్

image

ఈనెల 24వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి ఆయన హైదరాబాదులో బీఫామ్ అందుకున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి మాజీ మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ రానున్నట్లు తెలిసింది.

News April 19, 2024

ప్రధాని మోదీ ప్రోత్సాహంతో తెలంగాణలో వెలుగులు: ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి

image

భారతదేశ ప్రధాని మోదీ ప్రోత్సాహంతో తెలంగాణలో వెలుగులు నిండాయని నల్గొండ బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. నల్లగొండ పార్లమెంటు పరిధిలో శుక్రవారం పలు నియోజకవర్గంలో పర్యటన చేశారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలు, మౌలిక వస్తువుల నిర్మాణం, నగదు బదిలీ ద్వారా గత పదేళ్ల లో 10 లక్షల కోట్లు తెలంగాణకు మోదీ ప్రభుత్వం పంపిణీ చేసిందన్నారు.