Telangana

News April 19, 2024

జాక్రాన్ పల్లి: లారీని ఢీకొన్న బైక్.. ఒకరి మృతి 

image

నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం మహావీర్ తండాకు చెందిన జాదవ్ సుధాకర్(35), అతని భార్యతో కలిసి గురువారం ద్విచక్రవాహనంపై డిచ్పల్లికి వెళ్తున్నారు. జక్రాన్పల్లి జాతీయ రహదారిపై బ్రేక్ డౌన్ కారణంగా నిలిపి ఉంచిన లారీని ఢీకొట్టగా.. సుధాకర్ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన అతని భార్యను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తిరుపతి తెలిపారు.

News April 19, 2024

మానేర్ డ్యామ్‌లో దూకిన వ్యక్తి

image

ఎల్ఎండీ మానేరు డ్యామ్‌లో దూకిన యువకుడిని లేక్ పోలీసులు రక్షించారు. శంకరపట్నం మండలం కరీంపేట గ్రామానికి చెందిన ఓ యువకుడు గురువారం మానేరు డ్యామ్ నీటిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించగా గస్తీ కాస్తున్న పోలీసులు నీటిలో దూకి తనని రక్షించి కౌన్సిలింగ్ ఇచ్చి అతని కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు ఆ యువకుడు తెలియజేశారు.

News April 19, 2024

సింగరేణిలో 327 ఉద్యోగాలు.. అర్హతలివే

image

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(SCCL)లో ఖాళీగా ఉన్న 327 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను సింగరేణి అధికారులు విడుదల చేశారు. సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన వారు మే 4వ తేదీలోపు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు, దరఖాస్తు చేయడం కోసం https://scclmines.com/ వెబ్ సైట్‌ను సందర్శించవచ్చని సింగరేణి అధికారులు తెలిపారు.

News April 19, 2024

HYD: మహిళపై రౌడీషీటర్‌ అత్యాచారం.. అరెస్టు

image

భర్త వదిలేయడంతో పిల్లలతో కలిసి ఉపాధి వెదుక్కుంటూ వచ్చిన ఓ మహిళపై రౌడీషీటర్‌ అత్యాచారం చేశారు. పోచారం IT కారిడార్‌ CI రాజు వర్మ వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన మహిళ (30) అన్నోజిగూడలో అద్దె ఇంట్లో ఉంటూ ఘట్‌కేసర్‌లోని ఓ హోటల్‌లో పని చేస్తోంది. ఆమెను ఈ నెల 16న రౌడీషీటర్‌ ఉమేశ్ నాయక్‌ (22) బెదిరించి అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని గురువారం రిమాండ్‌కు తరలించారు.

News April 19, 2024

HYD: మహిళపై రౌడీషీటర్‌ అత్యాచారం.. అరెస్టు

image

భర్త వదిలేయడంతో పిల్లలతో కలిసి ఉపాధి వెదుక్కుంటూ వచ్చిన ఓ మహిళపై రౌడీషీటర్‌ అత్యాచారం చేశారు. పోచారం IT కారిడార్‌ CI రాజు వర్మ వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన మహిళ (30) అన్నోజిగూడలో అద్దె ఇంట్లో ఉంటూ ఘట్‌కేసర్‌లోని ఓ హోటల్‌లో పని చేస్తోంది. ఆమెను ఈ నెల 16న రౌడీషీటర్‌ ఉమేశ్ నాయక్‌ (22) బెదిరించి అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని గురువారం రిమాండ్‌కు తరలించారు.

News April 19, 2024

ఆదిలాబాద్ అందరిని ఆదరించింది..మరీ ఈ సారీ?

image

ADB ఎంపీ స్థానానికి 17 సార్లు ఎన్నికలు జరగ్గా, కాంగ్రెస్ 7, TDP 6 సార్లు, TRS 2 సార్లు గెలుపొందాయి. మరోవైపు కాంగ్రెస్ (ఐ), సోషలిస్టు పార్టీ, బీజేపీ ఒక్కోసారి విజయం సాధించాయి. తొలి ఎన్నికల్లోనే సోషలిస్ట్ నుంచి బరిలో ఉన్న మాధవరెడ్డికి ప్రజలు పట్టం కట్టారు. గడిచిన 4 ఎన్నికలను పరిశీలిస్తే.. ఒక్కోసారి ఒక్కో పార్టీకి అవకాశం ఇస్తూ వచ్చారు. మరి ఈ ఎన్నికలో ఎవరిని గెలిపిస్తారో చూడాలి మరి.

News April 19, 2024

రేషన్ ఈ-కేవైసీకి మరో అవకాశం

image

ఆహార భద్రతా కార్డుల ఈ-కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశమిచ్చింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినా రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచనలతో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం లబ్ధిదారుల్లో 70శాతం మాత్రమే నమోదు చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,13,855 రేషన్ కార్డులుండగా, 6,85,910మంది రేషన్ లబ్ధిదారులున్నారు. ఇంకా పలు కారణాలతో 2,05,084మంది ఈ-కేవైసీ చేయించుకోలేదని అధికారులు తెలిపారు.

News April 19, 2024

NZB: మీకు తెలుసా?.. ఆ ఇద్దరు హ్యాట్రిక్ వీరులు

image

NZB ఎంపీ ఎన్నికల్లో ఇద్దరు వ్యక్తులు వరుసగా 3 సార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. 1952లో హరీశ్ చంద్ర హెడా కాంగ్రెస్ తరపున మెుదటి సారి ఎంపీగా అడుగు పెట్టారు. 1957, 1964లో వరుస విజయాలతో 3 సార్లు ఎంపీ అయ్యారు. మళ్లీ కాంగ్రెస్ తరపున 1971, 1977,1980 MP ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. టీడీపీ నుంచి గడ్డం గంగారెడ్డి కూడా మూడు సార్లు ఎంపీగా గెలిచినప్పటికీ ఆయనకు హ్యాట్రిక్‌కు మధ్యలో బ్రేక్ పడింది.

News April 19, 2024

నల్గొండ: బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు

image

డిండి మండలంలోని ఓ తండాకు చెందిన బాలికను నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలం మర్రిపల్లి తండాకు చెందిన అంగోత్ వినోద్ ప్రేమ పేరుతో అపహరించి పలుమార్లు బెదిరించి, ఆమెపై అత్యాచారం చేశారు. 2023 ఫిబ్రవరి 20న మైనర్ బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో నిందితునికి 20 ఏళ్లు జైలు శిక్ష, రూ.53 వేలు జరిమాన విధిస్తూ న్యాయమూర్తి బి.తిరుపతి తీర్పు ఇచ్చారు.

News April 19, 2024

బిజినేపల్లిలో కీచక ఉపాధ్యాయుడు

image

బిజినేపల్లిలో విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. పోలీసుల కథనం మేరకు.. బిజినేపల్లి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఓ టీచర్ స్థానిక ఓ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో అదే కాలనీలో మానసిక దివ్యాంగ యువతి(19) నిస్సహాయతను ఆసరాగా చేసుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న యువతి సోదరులు సదరు టీచర్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేశారు.