Telangana

News April 19, 2024

ఖమ్మం: ఎండిపోతున్న చెరువులు..

image

వర్షాభావానికి తోడు ఎండల తీవ్రతతో జిల్లాలో పలు చెరువుల్లో నీరు అడుగంటి నెర్రెలు బారుతున్నాయి. సాగునీటి కొరతతో రైతులు ఇప్పటికే ఆశలు వదిలేసుకున్నారు. చెరువులో ఉన్న కొద్దోగొప్ప నీటితో చేపలు బతుకుతాయని ఆశిస్తున్న మత్స్యకారులకు నిరాశే ఎదురవుతోంది. చెరువులు ఎండి లక్షల్లో చేపలు మృత్యువాత పడుతుండడంతో ఉపాది లేదని వారు ఆందోళన చెందుతున్నారు.

News April 19, 2024

గ్యాస్ సబ్సిడీ డబ్బు బ్యాంకు ఖాతాలో జమ కాలేదా..?

image

రూ.500 గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులను పౌరసరఫరాల శాఖ ఇప్పటికే చాలా మంది అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నా.. ఖమ్మం జిల్లాలో కొంత మందికి ఇంకా గ్యాస్ డబ్బులు జమ కాలేదు. దీనికి లబ్దిదారులు LPG గ్యాస్ కనెక్షన్ కోసం e-KYC చేయకపోవడమే కారణమని తాజాగా పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. గ్యాస్ కనెక్షన్లు కలిగిన 30% మంది మాత్రమే e-KYC చేసుకున్నారని, మిగత వారు వెంటనే e-KYC చేసుకోవాలని సూచించింది.

News April 19, 2024

రెబ్బెన: రెండు లారీలు ఢీ.. తప్పిన పెను ప్రమాదం

image

రెబ్బెన మండలం దేవులగూడా సమీపంలో గురువారం రెండు లారీలు ఢీకొన్న ఘటనలో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్ వైపు నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న లారీని మరో లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో వెనుకాల ఢీకొన్న లారీ పక్కనే ఉన్న హోటల్ లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.

News April 19, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} ఖమ్మంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం
∆} సత్తుపల్లి మండలంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం
∆} బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద రావు నామినేషన్ ర్యాలీ
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం

News April 19, 2024

ఖమ్మంలో ఒకటే నామినేషన్

image

లోక్‌సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఖమ్మంలో తొలి రోజు ఒకటే నామినేషన్ దాఖలైంది. అలయెన్స్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఆదార్‌) అభ్యర్థిగా కుక్కల నాగయ్య గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఇక బీఆర్ఎస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు కేసీఆర్ బీ-ఫాం అందుజేశారు.

News April 19, 2024

తాడ్వాయి: ప్రభుత్వ ఉపాధ్యాయుడి సస్పెన్షన్

image

తాడ్వాయి మండలం నందివాడ గ్రామం జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు దశరథ రెడ్డిని సస్పెండ్ చేసినట్లు డీఈవో ఎస్.రాజు గురువారం ఉత్తర్వులను జారీ చేశారు. ఫైనాన్స్, చిట్టీల పేరిట ప్రజల నుంచి డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేయడం, కస్టమర్లను బెదిరించిన ఘటనలో అతడిపై క్రిమినల్ కేసు నమోదు కావడంతో సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.

News April 19, 2024

సిర్పూర్ ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలి: రావి శ్రీనివాస్

image

కాంగ్రెస్ మంత్రి సీతక్కను విమర్శించే స్థాయి సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబుకు లేదని కాంగ్రెస్ పార్టీ సిర్పూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రావి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా గురువారం వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకుల పైన అసత్యపు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని అన్నారు. నియోజకవర్గ ప్రజల నుంచి ఆదరణ లభించకపోవడంతో ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులపై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

News April 19, 2024

నల్గొండ, భువనగిరి ఎంపీ స్థానాలకు ఏడు నామినేషన్లు

image

నల్గొండ లోక్ సభ స్థానానికి తొలిరోజు నలుగురు అభ్యర్థులు ఆరు సెట్ల నామినేషన్ వేశారు. రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ హరిచందనకు పత్రాలు అందజేశారు. బీజేపీ నుంచి సైదిరెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా విశ్రాంత ఐఏఎస్ ప్రభాకర్, సోషలిస్టు పార్టీ తరఫున రచ్చ సుభద్రారెడ్డి, ప్రజావాణి పార్టీ తరఫున లింగిడి వెంకటేశ్వర్లు నామినేషన్ వేశారు. యాదాద్రి నుంచి ముగ్గురు నామినేషన్ వేశారు.

News April 19, 2024

MBNR: నేడు వంశీచంద్ రెడ్డి నామినేషన్‌.. సీఎం రేవంత్ రెడ్డి రాక

image

లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నేడు నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. MBNRలోని మెట్టుగడ్డ నుంచి ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్ వెయ్యనున్నారు. అనంతరం గడియారం చౌరస్తాలో జరిగే సభలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పార్టీ ముఖ్యనేతలు పాల్గొని ప్రసంగించనున్నారు. CM పర్యటన కోసం జడ్చర్ల, MBNR ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

News April 19, 2024

HYD: ఇందులో మీ వాహనం ఉందా?

image

HYD బాచుపల్లి పోలీసులు ఓ ప్రకటన చేశారు. తమ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏడాదిగా ద్విచక్ర వాహనాలు పడి ఉన్నాయని, అందులో ఎవరిదైనా దొంగిలించి బడిన వాహనం ఉంటే సంబంధిత డాక్యుమెంట్లు చూపించాలని తెలిపారు. అలా డాక్యుమెంట్లు చూపించిన వారికి వెంటనే వాహనం అందజేస్తామని చెప్పారు. పూర్తి సమాచారం కోసం తమను సంప్రదించాలని కోరారు. నగరమే కాకుండా నిజామాబాద్, సూర్యాపేటకు చెందిన వాహనాలు ఉన్నాయన్నారు.