Telangana

News April 18, 2024

HYD: FAKE ప్రచారం చేయకండి: TSSPDCL

image

HYD నాంపల్లి కోర్టులో నేడు మధ్యాహ్నం క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తుండగా పవర్ కట్ అయిందని, చీకటిలోనే జడ్జి వాదనలు విన్నారని కొందరు X వేదికగా వైరల్ చేశారు. దీని పై స్పందించిన TSSPDCL, నిర్ధారించని, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయొద్దని కోరింది. కరెంటు సరఫరాలో ఎలాంటి సమస్య లేదని, అంతర్గత సమస్య వెళ్లే జరిగిందని తెలిపింది. ఫిర్యాదు చేసిన లాయర్ విజయ్ గోపాల్ సైతం దగ్గరుండి చూశారని పేర్కొంది.

News April 18, 2024

డిచ్పల్లి: టీయూ పరిధిలోని డిగ్రీ పరీక్షలకు వన్ టైం ఛాన్స్

image

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ ఫెయిల్ అయిన విద్యార్థులకు వన్ టైం ఛాన్స్ ఇవ్వనున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారిణి అరుణ తెలిపారు. 2011-2016, 2016-2019 సంవత్సరాల్లో డిగ్రీ ఫేయిల్ అయిన విద్యార్థులకు పరీక్షలు రాసే అవకాశం ఇచ్చారు. ఈ పరీక్షలు జూన్/జులైలో జరుగుతాయని పేర్కొన్నారు. పూర్తి వివరాలను తెలంగాణ వర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు వెల్లడించారు.

News April 18, 2024

అన్ని వర్గాల అభ్యున్నతికి మోదీ కృషి: డీకే అరుణ

image

దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రధాని మోదీ ఎనలేని కృషి చేస్తున్నారని డీకే అరుణ అన్నారు. నామినేషన్ల దాఖలు చేసిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలకిచ్చిన 6 గ్యారంటీల అమలు చేయని కాంగ్రెస్ నాయకులు కోతలు కోస్తున్నారని విమర్శించారు. రైల్వే మార్గాలు, ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తామంటున్న CM రేవంత్ రెడ్డి కేంద్రం నుంచి నిధులు రాకుండా ఎలా ఏర్పాటు చేస్తావని ప్రశ్నించారు.

News April 18, 2024

SDNR: పేలుడు పదార్థాలు పట్టుకున్న పోలీసులు

image

ఫరుక్ నగర్ మండలంలోని బూర్గుల గ్రామంలో పోలీసులు ఓ వ్యక్తి వద్ద జిలెటిన్ స్టిక్స్ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. చింతగూడెం గ్రామానికి చెందిన యాదయ్య వద్ద 59 జిలెటిన్ స్టిక్స్ పట్టుకున్నట్లు స్థానిక సీఐ ప్రతాప్ లింగం తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పేలుడు పదార్థాలు కలిగి ఉంటే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.

News April 18, 2024

మాజీ సీఎం కేసీఆర్‌ కలలు కంటున్నారు : మంత్రి

image

సీఎం కేసీఆర్‌ కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలలు ఉండదని ఆరు నెలల్లో పడిపోద్దని కలలు కంటున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య క్యాంపు కార్యాలయంలో మంత్రి మాట్లాడారు. మహబూబాబాద్ పార్లమెంట్‌ అభ్యర్థి బలరాం నాయక్‌ను భారీమెజార్టీతో గెలిపించాలన్నారు. రేపు మహబూబాబాద్‌లో జరిగే బలరాం నామినేషన్ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు హాజరుకావాలని తుమ్మల పిలుపునిచ్చారు.

News April 18, 2024

ఈనెల 25 వరకు బుకింగ్స్ పొడిగింపు: రీజనల్ మేనేజర్

image

శ్రీసీతారాముల కల్యాణ తలంబ్రాలు టిఎస్ ఆర్టిసి కార్గో ద్వారా ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో రూ.151 చెల్లిస్తే భక్తుల ఇండ్ల వద్దకు చేరుస్తామని ఖమ్మం జిల్లా రీజినల్ మేనేజర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ బుకింగ్స్ ఈనెల 25 వరకు పొడిగించడం జరిగిందని.. కావున భక్తులు తలంబ్రాలను బుక్ చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు

News April 18, 2024

మార్పు, మార్పు అని ప్రజలు మోసపోయారు: ఎర్రబెల్లి

image

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని, కార్యకర్తలు వాటిని తిప్పి కొట్టాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పర్వతగిరి మండల స్థాయి ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… మార్పు, మార్పు అని ప్రజలు మోసపోయారని, ప్రజల్లోకి ప్రభుత్వ వైఫల్యాలను తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.

News April 18, 2024

HYD: ప్రజలారా.. జాగ్రత్త..! ఎండ దంచి కొడుతోంది

image

HYD, RR, MDCL, VKB జిల్లాలలో నేటి నుంచి రాగల 5 రోజుల వరకు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు మెట్రోలాజికల్ డిపార్ట్‌మెంట్ తెలియజేసింది. ఏకంగా 41 నుంచి 44 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది. పలుచోట్ల వేడిగాలులు వీచే అవకాశం ఉందని, కావున ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని తెలియజేసింది.

News April 18, 2024

HYD: ప్రజలారా.. జాగ్రత్త..! ఎండ దంచి కొడుతోంది 

image

HYD, RR, MDCL, VKB జిల్లాలలో నేటి నుంచి రాగల 5 రోజుల వరకు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు మెట్రోలాజికల్ డిపార్ట్‌మెంట్ తెలియజేసింది. ఏకంగా 41 నుంచి 44 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది. పలుచోట్ల వేడిగాలులు వీచే అవకాశం ఉందని, కావున ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని తెలియజేసింది.

News April 18, 2024

KCR చేతుల మీదుగా B- ఫారమ్ అందుకున్న బాజిరెడ్డి

image

నిజామాబాద్ పార్లమెంట్ BRS పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గురువారం తెలంగాణ భవన్‌లో KCR చేతుల మీదుగా B-ఫారమ్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సురేశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు గణేశ్ గుప్తా, జీవన్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్లు విఠల్ రావు, దావ వసంత, అలీం, ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.