Telangana

News April 18, 2024

HYD: వైట్‌ మార్బుల్‌‌ స్టోన్‌తో చార్మినార్ (AI PHOTO)

image

చారిత్రక కట్టడం చార్మినార్‌ AI ఫొటోలు నెట్టింట్‌లో వైరల్ అవుతున్నాయి. నేడు వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించిన చిత్రాలను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వైట్ మార్బుల్ స్టోన్‌తో నిర్మిస్తే ఇలా ఉంటుంది అని కళ్ళకు కట్టినట్లుగా డిజైన్ చేశారు. సుమారు 425 ఏళ్ల చరిత్ర కలిగిన చార్మినార్‌ను‌ గ్రానైట్, సున్నపురాయి ఉపయోగించి నిర్మించిన సంగతి తెలిసిందే.

News April 18, 2024

NLG: మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం ఏది…!

image

ఓటర్లలో సగ భాగమైన మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కరవవుతోంది. చైతన్యవంతమైన నల్గొండ జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. నల్గొండ, మిర్యాలగూడ, భువనగిరి నియోజకవర్గాల నుంచి ఇప్పటి వరకు ఒక్క పర్యాయమైనా మహిళను గెలిపించి లోక్‌సభకు పంపలేదు. ప్రధాన రాజకీయ పార్టీలు మహిళల ఓట్లను రాబట్టుకునేందుకు వారిని ఆకర్షించే పథకాలను, హామీలను ఎన్నికల మేనిఫెస్టోల్లో ప్రకటిస్తున్నాయి కానీ మహిళా అభ్యర్థులను బరిలో నిలపడం లేదు.

News April 18, 2024

ఖమ్మంలో తొలి నామినేషన్ దాఖలు

image

ఖమ్మం లోక్‌సభకు సాధారణ ఎన్నికలను పురస్కరించుకుని తొలి నామినేషన్ పడింది. 17-ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి ఆధార్ పార్టీ అభ్యర్థిగా కుక్కల నాగయ్య గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం పార్లమెంట్ నియోజక వర్గ ప్రజలు తమ పార్టీని బలపరిచి ఓటు వేయాలని కోరారు.

News April 18, 2024

MBNRలో ఉత్కంఠ రేపుతున్న రాజకీయాలు

image

పాలమూరులో నామినేషన్ల స్వీకరణ నేటి నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు నామినేషన్లు వేశారంటే ప్రచార పర్వం జోరందుకోనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, BJP, BRS హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయం వేడెక్కుతోంది. రానున్న రోజుల్లో కురు క్షేత్రంగా మారనుంది. అన్ని పార్టీల నేతలు ప్రచారానికి బారులు తీరనున్నారు. CM రేవంత్ రెడ్డి 3సార్లు జిల్లాలో పర్యటించారు.

News April 18, 2024

MBNR:మన పాలమూరులో ఇవి FAMOUS..!

image

చారిత్రక సంపదకు పుట్టినిల్లు పాలమూరు. ఉమ్మడి జిల్లాకు నంద వంశం నుంచి అసిఫ్ జాహి రాజావంశం వరకు 22రాజావంశాలు ఈ ప్రాంతాన్ని పాలించారు. రాజావంశాలకు కేరాఫ్‌గా 1662నిర్మించిన గద్వాల్ కోట, 18వ శతాబ్దంలో నిర్మించిన వనపర్తి‌కోట, ఖిల్లా ఘనపూర్ కోట, నిజంకోట, ప్రసిద్ధి ఆలయాలు చెన్నకేశవ స్వామి ఆలయం(గంగాపురం), జటప్రోల్ ఆలయం(పెంట్లవెల్లి), గొల్లత్తగుడి(JDCL) పాలమూరు చరిత్రకు ఆనవాళ్లు.
నేడు ‘World Heritage Day’

News April 18, 2024

26న ఓపెన్ డిగ్రీ సప్లిమెంటరీ ఫీజు గడువు

image

డా.బి.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల ఫీజును ఈ నెల 26లోగా చెల్లించాలని జనగామ అభ్యసన కేంద్రం సమన్వయకర్త శ్రీనివాస్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మే 17 నుంచి పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. కావున విద్యార్థులు ఫీజు నిర్ణీత తేదీలోగా చెల్లించాలని కోరారు.

News April 18, 2024

మెదక్‌: ముహూర్త బలంతో అభ్యర్థులు ముందుకు..!

image

పార్లమెంట్ ఎన్నికల మొదటి ఘట్టం నేటితో ప్రారంభం అవ్వడంతో అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి ముహూర్త బలాన్ని నమ్ముతూ ముందుకు సాగుతున్నారు. మెదక్‌లో నేడు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు నామినేషన్ వేస్తుండగా ఆయన అయోధ్య వెళ్లి రాముని చెంత నామినేషన్ పత్రాలు పెట్టి టైం ఫిక్స్ చేసుకున్నారు. ఎల్లుండి కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముహూర్త బలం ఫిక్స్ చేసుకొని నామినేషన్ వేస్తున్నారు.

News April 18, 2024

ADB: ఈనెల 25 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు

image

ఓపెన్ స్కూల్ ఇంటర్, పదో తరగతి పరీక్షలు ఈనెల 25 నుంచి ప్రారంభమవుతాయని డీఈఓ ప్రణీత తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయంలో పరీక్షల ఏర్పాట్లపై ఆయా శాఖల వారి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఉదయం పూట ఇంటర్, మధ్యాహ్నం పదో తరగతి పరీక్షలు ఉంటాయని ఇంటర్ పరీక్షలకు 463 మంది, పదో తరగతి పరీక్షలకు 792 మంది హాజరవుతారని పేర్కొన్నారు. ఆదిలాబాద్, ఉట్నూర్ లలో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

News April 18, 2024

ఇల్లంతకుంటలో భర్త గెలుపు కోసం భార్య ప్రచారం

image

సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంతో పాటు గాలిపెళ్లి, తాళ్లపల్లి, అనంతగిరి గ్రామాలలో కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ సతీమణి మాధవి గురువారం ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. గత ఐదేళ్లలో బండి సంజయ్ ఎంపీగా ఉండి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో వినోద్ కుమార్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

News April 18, 2024

నా గెలుపును ఎవరూ ఆపలేరు: ఈటల రాజేందర్

image

మల్కాజిగిరి పార్లమెంట్ బరిలో తన గెలుపును ఎవరూ ఆపలేరని BJP అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. నామినేషన్ దాఖలుకు ముందు తన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. మల్కాజిగిరిలో ధర్మానికి, అధర్మానికి జరిగే యుద్ధమే ఈ ఎన్నికలు అని అభివర్ణించారు. కొందరు దొంగ సర్వేలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఈటల ఆరోపించారు.