Telangana

News September 10, 2024

పార్టీ ఫిరాయింపులపై ఎమ్మెల్యే హాట్ కామెంట్స్

image

పార్టీ ఫిరాయించిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. హైకోర్టు తీర్పుకు అనుగుణంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. రాజీనామా చేయకుండా పార్టీ మారితే ప్రజలను మోసం చేసినట్లుగా భావించాలని కూనంనేని కామెంట్స్ చేశారు.

News September 10, 2024

విష జ్వరాలతో ఇబ్బందులు !

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాల నేపథ్యంలో డెంగీ, చికెన్ గన్యా, మలేరియా, టైఫాయిడ్, ఇతర విష జ్వరాలతో పాటు, జలుబు,దగ్గు తదితర వాటితో బాధితులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. MBNR-30, NGKL-35, NRPT-15, WNPT-15, GDWL-12 చొప్పున ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. వీటన్నిటికీ ఔషధాలు MBNRలోని కేంద్ర ఔషధ నిల్వ కేంద్రం నుంచి సరఫరా అవుతున్నాయి. కొన్ని రకాల ఔషధాలు రోగులకు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.

News September 10, 2024

HYD: మెగా జాబ్ మేళా.. DON’T MISS

image

గ్రేటర్ HYD పరిధిలో GHMC డోర్ టూ డోర్ GIS ఫీల్డ్ సర్వేయర్ల నియామకానికి SEP 10 నుంచి 13 వరకు మెగా జాబ్ మేళా జరగనుంది. రూ.14 వేల జీతం, అలవెన్స్ ఉంటుంది. 10వ తరగతి పాసై ఉండాలి. 500+ఖాళీలు ఉన్నాయని, శేర్లింగంపల్లి తారానగర్ విద్యానికేతన్ హై స్కూల్ ఎదురుగా Spatial Hawk Geo informatics ప్రైవేట్ లిమిటెడ్ వద్ద జాబ్‌మేళా ఉంటుందని తెలిపారు. 9581519970, 93906 29693 కు సంప్రదించండి.

News September 10, 2024

HYD: మెగా జాబ్ మేళా.. DON’T MISS

image

గ్రేటర్ HYD పరిధిలో GHMC డోర్ టూ డోర్ GIS ఫీల్డ్ సర్వేయర్ల నియామకానికి SEP 10 నుంచి 13 వరకు మెగా జాబ్ మేళా జరగనుంది. రూ.14 వేల జీతం, అలవెన్స్ ఉంటుంది. 10వ తరగతి పాసై ఉండాలి. 500+ఖాళీలు ఉన్నాయని, శేర్లింగంపల్లి తారానగర్ విద్యానికేతన్ హై స్కూల్ ఎదురుగా Spatial Hawk Geo informatics ప్రైవేట్ లిమిటెడ్ వద్ద జాబ్‌మేళా ఉంటుందని తెలిపారు. 9581519970, 93906 29693 కు సంప్రదించండి.

News September 10, 2024

ఉమ్మడి జిల్లాలో “TODAY TOP NEWS”

image

✔ప్రజావాణి.. సమస్యలపై ఫోకస్ ✔సాహితీ సమరానికి నిలువెత్తు నిదర్శనం కాళోజి:మంత్రి జూపల్లి ✔ఉమ్మడి జిల్లాలో ఘనంగా కాలోజీ జయంతి వేడుకలు ✔రాష్ట్రంలో 80వేల ఎకరాల వక్ఫ్ భూములు:DK అరుణ ✔ఓటు హక్కు నమోదు చేసుకోండి:MROలు ✔అక్రమాలపై హైడ్రా ఫోకస్ ✔డీజేలకు అనుమతి లేదు:SIలు ✔పలుచోట్ల వినాయక నిమర్జనం ✔ప్రజలకు విజ్ఞలు తొలగి విజయం కలగాలి:DIG చౌహన్ ✔ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్‌గా ఎమ్మెల్యే శంకర్

News September 10, 2024

నందిపేటలో రక్షణ కోసం రాళ్లు పట్టిన మహిళలు

image

నందిపేటలో ఒకే రోజు వరుసగా పది మందిని పిచ్చి కుక్క విచక్షణారహితంగా కరిచి తీవ్ర గాయాలపాలు చేసిన విషయం తెలిసిందే. దీంతో మండల కేంద్రంలోని మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు, తమ పనుల నిమిత్తం ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే తమ రక్షణ కోసం రాళ్లు పట్టుకొని వెళ్లే దుస్థితి ఎదురయ్యింది. కుక్క వచ్చి దాడి చేస్తుందో తెలియని పరిస్థితి ఉందని ఏదైనా పనుల నిమిత్తం బయటకు వెళ్ళడానికి భయంగా ఉందని అంటున్నారు.

News September 10, 2024

జూరాల 26 గేట్లు ఎత్తివేత

image

జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం గంటగంటకు పెరుగుతోంది. కర్ణాటకలో భారీ వర్షాలు కురవడంతో ఆల్మట్టి డ్యాం పూర్తిస్థాయిలో నిండిపోవడంతో దిగువకు రెండు లక్షలకు పైగా వరద నీరు వదలడంతో జూరాల ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు డ్యాం 26 గేట్లు ఎత్తి 2 లక్షల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. నది తీర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

News September 10, 2024

NRPT: ఉత్తమ గ్రామ పంచాయతీల ఎంపికకు నివేదికలు పంపండి

image

జాతీయ ఉత్తమ గ్రామ పంచాయతీల ఎంపికకు నివేదికలు పంపించాలని కలెక్టర్ సిక్త పట్నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం నారాయణపేట కలెక్టరేట్లో డిఆర్డిఏ అధికారులతో సమావేశం నిర్వహించారు. 9 అంశాల్లో నివేదికలు మంగళవారం సాయంత్రంలోగా పంపించాలని చెప్పారు. వాటిని పరిశీలించి జాతీయ పురస్కారాల కొరకు ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుందని సూచించారు. సంబంధిత అధికారులు పాలోన్నారు.

News September 9, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్..

image

> WGL: ఏడుగురు పేకాటరాయుళ్ళ అరెస్ట్.. > HNK: గుండెపోటుతో జర్నలిస్టు మృతి.. > BHPL: బిల్డింగ్ పై నుండి పడి వ్యక్తి మృతి.. > MLG: విష జ్వరం.. అనాధలుగా మారిన పిల్లలు.. > HNK: నలుగురు నకిలీ రిపోర్టర్లు అరెస్ట్.. > MHBD: కేసముద్రం మండలాల్లో గుప్పుమంటున్న గుడుంబా! > MLG: దొంగను పట్టించిన సీసీ కెమెరాలు..

News September 9, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాళోజి జయంతి. @ ధర్మారం మండలంలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య. @ ముస్తాబాద్ మండలంలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత. @ తంగళ్ళపల్లి మండలంలో విద్యుత్ షాక్ కు గురైన విద్యార్థిని. @ జగిత్యాలలో డబుల్ బెడ్ రూమ్ ల దరఖాస్తులకు గడువు పెంపు. @ గురుకులాలను తనిఖీ చేయాలని అధికారులకు సూచించిన సిరిసిల్ల కలెక్టర్. @ సిరిసిల్ల ప్రజావాణికి 96 ఫిర్యాదులు.