Telangana

News April 17, 2024

HYD: వామ్మో.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిస్థితి ఇది!

image

HYD నగరంలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోతుంది. వేసవి వేళ HYD నగరంలో నివసిస్తున్న విద్యార్థులు, ఉద్యోగులు, ఇతరులు భారీ సంఖ్యలో ప్రయాణం సాగిస్తుండటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని రైల్వే అధికారులు తెలిపారు. పదుల సంఖ్యలో సమ్మర్ స్పెషల్ రైళ్లను నడుపుతున్నప్పటికీ సరిపోవడం లేదు. ప్రస్తుత రద్దీని చూసి, నేడు మరో 10 స్పెషల్ రైళ్లకు SCR అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

News April 17, 2024

సికింద్రాబాద్ స్టేషన్ నుంచి మరికొన్ని స్పెషల్ ట్రైన్లు

image

వేసవి వేళ రద్దీని పరిగణనలోకి తీసుకున్న సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు సికింద్రాబాద్ సహా పలు స్టేషన్ల నుంచి మరికొన్ని స్పెషల్ ట్రైన్లను నడపనున్నట్లు వెల్లడించారు. సికింద్రాబాద్ నుంచి నిజాముద్దీన్ జంక్షన్ వెళ్లేందుకు ఏప్రిల్ 21, 28, మే 5, 12, 19, 26, జూన్ 2, 9, 16, 23, 30వ తేదీలలో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

MBNR: ఎకో పార్కులో యువతి మృతదేహం

image

మహబూబ్‌నగర్ పట్టణంలోని ఎకో పార్కులో ఓ యువతి మృతదేహం లభ్యమైంది. డెడ్‌బాడీ కాలిపోవడంతో గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. పార్కు సిబ్బంది సమాచారంలో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. సమీపంలోని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఆమెకు సుమారు 20ఏళ్లు ఉంటాయని భావిస్తున్నారు. మృతురాలికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

News April 17, 2024

అత్యధిక ఉష్ణోగ్రత నల్గొండ జిల్లాలోనే

image

రాష్ట్రంలోనే నల్గొండ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ నిడమనూరులో 44.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా సూర్యాపేట జిల్లా మునగాలలో 44.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. అలాగే యాదాద్రి-భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో అత్యధికంగా 44.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

News April 17, 2024

ఇచ్చోడలో ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి.. వివరాలు ఇవే..!

image

ట్రాక్టర్ అదుపుతప్పి <<13067453>>వ్యక్తి మృతి<<>> చెందిన ఘటన ఇచ్చోడ మండలం చించోలి క్రాస్ రోడ్ వద్ద జరిగిన విషయం తెలిసిందే. SI నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వడ్డర్ గూడకు చెందిన రాజేందర్ (33) ఇచ్చోడలో ట్రాక్టర్‌తో ఇటుక లోడు ఖాళీ చేసి వస్తుండగా ట్రాక్టర్ అతివేగంగా నడుపుతుండటంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

News April 17, 2024

చర్ల: మావోయిస్టుల సమాచారం ఇస్తే రూ. 5లక్షలు బహుమతి

image

చర్ల సరిహద్దు ప్రాంతమైన ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టులకు సంబంధించిన సమాచారం ఇస్తే రూ. 5లక్షలు బహుమతిగా ఇస్తామని ఛత్తీస్‌గఢ్ పోలీస్ విభాగం ప్రకటించింది. “సూచనా దో.. ఇనామ్ పావో” అంటూ ప్రచురించిన కరపత్రాలను జిల్లా మొత్తం పంపిణీ చేస్తున్నారు. గత కొంతకాలం నుండి ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరుగుతున్న విషయం తెలిసీందే. ఈ కాల్పుల్లో చాలామంది మావోయిస్టులు మరణించారు.

News April 17, 2024

దేవరుప్పుల: అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

image

దేవరుప్పుల మండలం మాధాపురం గ్రామానికి చెందిన మాచర్ల బిక్షపతి అనే వ్యక్తి బుధవారం అనుమానాస్పదంగా మృతిచెందారు. గ్రామస్థుల వివరాల ప్రకారం రామచంద్రపురం గ్రామంలోని ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా అనుమానాస్పదంగా రోడ్డు ప్రక్కన మృతిచెంది పడి ఉన్నాడు. ఈ ఘటన పై దేవరుప్పుల ఎస్సై చెన్నకేశవులను సంప్రదించగా అతనే ప్రమాదవశాత్తూ కింద పడి మృతిచెందాడని తెలిపారు.

News April 17, 2024

HYD: శ్రీరామ శోభాయాత్రలో దొంగల బీభత్సం

image

శ్రీరామ శోభాయాత్రలో దొంగలు చేతివాటం చూపించారు. పలువురు భక్తుల నుంచి సెల్‌ఫోన్లు, ఆభరణాలు అపహరించారు. దాదాపు 16 సెల్‌ఫోన్లు, 3 బంగారు గొలుసులు, ఒక బ్రాస్‌లెట్ చోరీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో బాధితులు పాతబస్తీ మంగళ్‌హాట్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.