India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గణపతి నిమజ్జనం సందర్భంగా ఆదిలాబాద్‌లోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ నిబంధనలు అమలులో ఉంటాయని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలియజేశారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ సిబ్బంది, ప్రత్యేకంగా 50 మంది సిబ్బంది ట్రాఫిక్ అంతరాయం కలగకుండా 24 గంటలు విధులు నిర్వహిస్తుంటారని తెలిపారు. ప్రజలు వారికి సహకరించాలని కోరారు.
రామాయంపేట మండల కేంద్రంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు. వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిమజ్జనం వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో తహశీల్దార్ రజనీకుమారి, కమిషనర్ దేవేందర్, కాంగ్రెస్ నాయకులు సుప్రభాత్ రావు, గజవాడ నాగరాజు పాల్గొన్నారు.
వినాయక నిమజ్జనం సందర్భంగా మెదక్ పట్టణంలో ఏర్పాటు చేసిన నిమజ్జన ఘాట్‌లను జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు స్వయంగా పరిశీలించారు. ముఖ్యంగా కొంటూర్ నిమజ్జనం పాయింట్‌ను సందర్శించి అక్కడి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. నిమజ్జన కార్యక్రమం సురక్షితంగా, ప్రశాంతంగా జరగడానికి చేపట్టిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
గణేశ్ నిమజ్జన ప్రక్రియ నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలు మూసి వేయాలని కమిషనర్ సాయి చైతన్య ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 6వ తేదీన ఉదయం 6 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు మద్యం దుకాణాలు మూసి వేయాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించి మద్యం దుకాణాలను తెరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నగరంలో మురుగుశుద్ధి ప్రక్రియ వేగవంతం కానుంది. 39 ఎస్టీపీలను ఏర్పాటు చేయాలని జలమండలి నిర్ణయించింది. ఈ పనులు దసరాలోగా ప్రారంభిస్తామని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. బొంగలూరు, తెల్లాపూర్, రావిర్యాల్, ఇక్రిశాట్, కాప్రా, మాసబ్‌ట్యాంక్, బాచుగూడ, మీర్పేట, తిమ్మక్క చెరువు, హెచ్పీఎస్, చిత్రపురి కాలనీ, పీర్జాదిగూడ, నాగారం, నార్సింగి, బాపూఘాట్, హైదర్షా కోట, ఫతేనగర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామన్నారు.
గణపతి నిమజ్జనోత్సవాలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. 600 మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నారన్నారు. నిఘా కోసం 350 సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నామని చెప్పారు. 8 సెక్టార్లు, 8 క్లస్టర్లు, 23 పికెట్లు, రూఫ్‌టాప్ బందోబస్తు, హైవే పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలకు అందుబాటులో ఉండేందుకు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశామన్నారు.
✒జాతీయస్థాయిలో 53వ స్థానంలో నిలిచింది✒2024లో 73వ స్థానం నుంచి ఏడాదిలోనే 17 స్థానాలు ఎగబాకింది✒విశ్వవిద్యాలయాల విభాగంలో 2024లో ఉన్న 43వ స్థానం నుంచి 13స్థానాలు మెరుగుపరుచుకుని 30వ ర్యాంకు సాధించింది.✒వర్సిటీ హెచ్ ఇండెక్స్ 121కి చేరింది.✒రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని విశ్వవిద్యాలయాల విభాగంలో దేశంలో ఓయూ 7వ స్థానంలో నిలిచింది.✒సైటేషన్లు 15,000 నుంచి 90,000కు పెరిగాయన్నారు
రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన రేషన్ షాపుల ఒకరోజు బంద్ కార్యక్రమం వరంగల్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. 29 ప్రభుత్వం నిర్వహించే షాపులు మినహా మిగతా షాపులన్నీ స్వచ్ఛందంగా మూసివేశారు. రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించకపోతే త్వరలోనే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ధారావత్ మోహన్ నాయక్ అన్నారు.
నిమజ్జన వేడుక సందర్భంగా రేపు నగరంలో రేపు ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడ వాహనాలను మళ్లించి ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ ఆంక్షలపై నగర ప్రజలకు పూర్తి సమాచారం ఇచ్చేందుకు హెల్ప్ లైన్ నంబర్లు పోలీసు అధికారులు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ మళ్లింపులకు సంబంధించి ప్రజలు 9010203626, 8712660600, 040-2785248 నంబర్లకు కాల్ చేయవచ్చు.
గణపతి శోభాయాత్ర సంద్భంగా శనివారం నగర వ్యాప్తంగా 66 చోట్ల ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయి. అవసరమైతే పొడిగిస్తారు కూడా. నగర ప్రజలు సొంత వాహనాల్లో కాకుండా ప్రజా రవాణా వ్యవస్థ అయిన ఆర్టీసీ బస్సులు, మెట్రో రైల్, ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణించాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కోరారు.
Sorry, no posts matched your criteria.