Telangana

News September 9, 2024

జగిత్యాల: తొమ్మిది మంది ఎమ్మార్వోల బదిలీ

image

జగిత్యాల జిల్లాలో 9 మంది ఎమ్మార్వోలను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. కథలాపూర్ ఎమ్మార్వోగా వి.వినోద్‌, పెగడపల్లి MROగా రవీందర్ నియామకమయ్యారు. ఆర్.శ్రీనివాస్ మెట్పల్లికి, కథలపూర్‌లో పనిచేస్తున్న ముంతాజ్బుద్ధిన్ బీర్పూర్ బదిలీ అయ్యారు. ఏ.శ్రీనివాస్ జగిత్యాల రూరల్, సి.రామ్మోహన్ జగిత్యాల అర్బన్‌కు బదిలీ చేశారు. వరందన్ సారంగాపూర్, రమేష్ కొడిమ్యాలకు బదిలీ అయ్యారు.

News September 9, 2024

విద్యార్థుల సామర్థ్యాలు పెంచేందుకే కాంప్లెక్స్ సమావేశాలు

image

విద్యార్థుల సామర్థ్యాలు పెంచేందుకే కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు మండల విద్యాధికారి శంకర్ తెలిపారు. సదాశివపేట మండలం నందికండి ఉన్నత పాఠశాలలో కాంప్లెక్స్ సమావేశం సోమవారం నిర్వహించారు. ఎంఈఓ మాట్లాడుతూ.. పాఠశాలలోని విద్యార్థుల సామర్థ్యాలపై చర్చించినట్లు చెప్పారు. సమావేశంలో నోడల్ అధికారి సుధాకర్, ఆర్పీలు పాల్గొన్నారు.

News September 9, 2024

బాసర: అర్జీయూకేటీ విద్యార్థుల చర్చలు సఫలం

image

బాసర అర్జీయూకేటి వీసీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అసోసియేట్ డీన్లు సోమవారం విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వివిధ సమస్యలపై చర్చించి, ప్రభుత్వంలోని అవసరమైన ఏజెన్సీలతో మాట్లాడి వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

News September 9, 2024

ప్రజలకు విజ్ఞలు తొలగి విజయం కలగాలి: డిఐజి చౌహన్

image

మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు మొదలుపెట్టిన పనులలో ఎలాంటి విఘ్నాలు లేకుండా.. అన్నింటా విజయం సాధించాలని జోగులాంబ జోన్ -7 డిఐజి ఎల్ఎస్ చౌహాన్ అన్నారు. ఆయన స్థానిక జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలీసు సురక్షా వినాయక విగ్రహంకు జిల్లా ఎస్పీ జానకి, అదనపు ఎస్పీ రాములు లతో గణనాథునికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

News September 9, 2024

KMR: జిల్లాలో 5.43 లక్షల ఎకరాల్లో పంటలు

image

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వానాకాలం సీజన్లో 5.43 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగుచేస్తున్నట్లు వ్యవసాయ అధికారుల లెక్కల్లో తేలింది. ప్రస్తుత వానకాల సీజన్ ఆరంభమైన తర్వాత తొలకరి జల్లులే.. ఆలస్యమైనా ఇటీవల సమృద్ధిగా వర్షాలు కురిశాయి. దీంతో వరి, పత్తి, కంది, సోయాబీన్ పంటలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. కాగా ఎప్పటిలాగే ఈ సారి కూడా వరి స్థానంలో ఇతర పంటల సాగుకు ప్రత్యామ్నాయం కరువైంది.

News September 9, 2024

సీఎంను కలిసిన ADB ఎమ్మెల్యే పాయల్ శంకర్

image

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వేలాది ఎకరాలు నీట మునిగి అపార నష్టం వాటిల్లిందని, ముంపు బాధిత రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆయన అదిలాబాద్ జిల్లా రైతు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. పెన్ గంగ నది పరివాహక ప్రాంతంలో వరదలు పోటెత్తి పత్తి, సోయాబీన్, కంది పంటలు నీట మునిగి రైతులు నష్టపోయారని పేర్కొన్నారు.

News September 9, 2024

HYD: హుసేన్‌సాగర్‌లో నిమజ్జనంపై హైకోర్టులో విచారణ

image

హుసేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనం పై హైకోర్టులో విచారణ జరిగింది. హుసేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయకూడదని గతంలో ఇచ్చిన హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని పిటిషనర్ కోరారు. హైడ్రాను కూడా ప్రతిపాది గా చేర్చాలని పిటిషనర్ కోరారు. హుసేన్‌సాగర్ పరిరక్షణ హైడ్రా బాధ్యత కాబట్టి ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్ కోరారు. రేపు వాదనలు న్యాయస్థానం వింటామంది. చీఫ్ జస్టిస్ బెంచ్‌ రేపు వాదనలు విననుంది.

News September 9, 2024

నవరాత్రులను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని: ఏసీపీ

image

గణేష్ నవరాత్రులను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని నర్సంపేట ఏసీపీ కిరణ్ కుమార్ సూచించారు. నర్సంపేట పట్టణంలోని సిద్ధార్థ నగర్ లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద ఏసిపి కిరణ్ కుమార్ సోమవారం పూజలు నిర్వహించారు. డిప్యూటీ తహసిల్దార్ రవి, పిఆర్టియు జిల్లా అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, నరసింహ రాములు తదితరులు ఉన్నారు.

News September 9, 2024

హైకోర్టు తీర్పు నేపథ్యంలో స్పందించిన భద్రాచలం ఎమ్మెల్యే

image

ప్రజల అభీష్టం మేరకే తాను ఎమ్మెల్యే అయ్యానని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు అన్నారు. BRS పార్టీని చూసి ప్రజలు ఓటు వేయలేదన్నారు. సోమవారం హైకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో ఎమ్మెల్యే స్పందించారు. నియోజకవర్గ ప్రజలకు తన వ్యక్తిగతం తెలుసని, మారుమూల పల్లెల్లో పుట్టి ఎమ్మెస్ పూర్తి చేశానన్నారు. ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల ఆశీర్వాదంతోనే గెలిచానని తెలిపారు.

News September 9, 2024

నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో దారుణం

image

నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో దారుణం జరిగింది. హలియాకు చెందిన కృపారాణి అనే మహిళ ప్రసవం కోసం ఈ నెల 4న ఆసుపత్రిలో చేరింది. డాక్టర్లు సాధారణ ప్రసవం కోసం 5 రోజులు వేచి చూశారు. దీంతో కడుపులోనే శివువు మృతి చెందిందని భాదితులు ఆరోపించారు. శిశువు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.