Telangana

News April 17, 2024

రాములోరి కళ్యాణానికి పొంగులేటి బ్రదర్స్

image

భద్రాచలంలో జరుగుతున్న శ్రీ సీతారామ స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు ప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. సాంప్రదాయ దుస్తుల్లో పొంగులేటి బ్రదర్స్ అందరినీ ఆకర్షించారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఆలయ ఈవో రమాదేవి వారికి ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

News April 17, 2024

కామారెడ్డి: ఆకుపై శ్రీ రాముని చిత్రం

image

శ్రీ రామనవమి సందర్భంగా ప్రముఖ చిత్రకారుడు బాస బాల్ కిషన్ ఆకుపై శ్రీ రాముని చిత్ర పటం వేశాడు. దీంతో పాటు జై శ్రీ రామ్ నామం 12 భాషల్లో రాశాడు. దీన్ని చూసిన వారు బాల్ కిషన్‌‌కు అభినందనలు తెలియజేశారు. కాగా కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాల్ కిషన్ చిత్ర కళ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. పలు రకాల వినూత్న చిత్రాలు గీసి ప్రశంసలు పొందాడు.

News April 17, 2024

ఖమ్మం: ఇద్దరు ఉద్యోగుల సస్పెండ్

image

లోక్‌సభ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే కారణంతో ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ హఫ్జల్ హసన్, ప్రభుత్వ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఆర్.వీ.సాగర్ ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా వ్యవహరించారని ఫిర్యాదు అందింది. దీంతో విచారణ అనంతరం వీరిద్దరిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ వీ.పీ.గౌతమ్ ఉత్తర్వులు జారీ చేశారు.

News April 17, 2024

మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలి: ములుగు ఎస్పీ

image

ప్రభుత్వ నిషేధిత CPI మావోయిస్టు పార్టీలో పని చేస్తున్న అజ్ఞాత మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోవాలని ములుగు ఎస్పీ శబరీష్  ప్రకటనలో తెలిపారు. ఆ పార్టీ సిద్ధాంతాలు కాలం చెల్లినవని, వారి భావజాలం ప్రజల్లో ప్రాముఖ్యం కోల్పోయిందని పేర్కొన్నారు. మావోయిస్టు సిద్ధాంతాలను ప్రజలు నమ్మడం లేదన్నారు.

News April 17, 2024

ఈ నెల 20న మెదక్‌కు సీఎం రేవంత్ రెడ్డి

image

మెదక్ జిల్లాకు CM రేవంత్ రెడ్డి రానున్నారు. శామీర్‌పేటలో మంగళవారం రాత్రి PCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మల్కాజిగిరి మాజీ MLA మైనంపల్లి, ఎంపీ అభ్యర్థి నీలం మధు, డీసీసీ ప్రెసిడెంట్లు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, మండల, బ్లాక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులతో మంత్రి కొండా సురేఖ సమావేశమయ్యారు. నీలం మధు ఏప్రిల్ 20న నామినేషన్ వేస్తారని.. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని తెలిపారు.

News April 17, 2024

నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి

image

లోక్ సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు NLG కలెక్టరేట్లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. పోటీ చేసే అభ్యర్థులు ఫారం 2ఏ లో అన్ని వివరాలు పూరించి నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఒక్కో అభ్యర్థి నుంచి గరిష్టంగా నాలుగు సెట్ల వరకు నామినేషన్ పత్రాలు స్వీకరిస్తారు.

News April 17, 2024

సివిల్స్‌లో సత్తాచాటిన ఆదిలాబాద్ జిల్లా బిడ్డ

image

సివిల్ సర్వీసెస్ మంగళవారం వెలువరించిన ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా వాసి ర్యాంక్ సాధించాడు. మండలంలోని చందా(టి) గ్రామానికి చెందిన విశాల్ సివిల్స్‌లో 718 ర్యాంక్ సాధించి సత్తాచాటాడు. దీంతో గ్రామస్థులు, కుటుంబసభ్యులు విశాల్‌ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. కాగా తండ్రి వెంకన్న మంచిర్యాల ACPగా విధులు నిర్వహిస్తున్నారు.

News April 17, 2024

HYD: ఫిలింనగర్‌లో యువతితో వ్యభిచారం.. RAIDS

image

వ్యభిచార గృహాలపై HYD పోలీసులు దాడులు కొనసాగిస్తున్నారు. తాజాగా ఫిలింనగర్ రోడ్‌ నం.8లో రైడ్స్ చేశారు. ‘అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం మేరకు దాడులు చేశాం. సబ్‌ఆర్గనైజర్‌, విటుడిని అరెస్ట్ చేశాం. దీపక్‌ అనే వ్యక్తి ఆన్‌లైన్‌ ద్వారా ఈ దందా చేస్తున్నట్లు గుర్తించాం’ అని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. వ్యభిచారకూపంలో మగ్గుతున్న యువతి(22)ని స్టేట్‌ హోంకు తరలించారు.

News April 17, 2024

HYD: ఫిలింనగర్‌లో యువతితో వ్యభిచారం.. RAIDS

image

వ్యభిచార గృహాలపై HYD పోలీసులు దాడులు కొనసాగిస్తున్నారు. తాజాగా ఫిలింనగర్ రోడ్‌ నం.8లో రైడ్స్ చేశారు. ‘అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం మేరకు దాడులు చేశాం. సబ్‌ఆర్గనైజర్‌, విటుడిని అరెస్ట్ చేశాం. దీపక్‌ అనే వ్యక్తి ఆన్‌లైన్‌ ద్వారా ఈ దందా చేస్తున్నట్లు గుర్తించాం’ అని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. వ్యభిచారకూపంలో మగ్గుతున్న యువతి(22)ని స్టేట్‌ హోంకు తరలించారు.

News April 17, 2024

భద్రాచలం చేరుకున్న డిప్యూటీ సీఎం

image

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుకకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో పాటు మంత్రి కొండా సురేఖ పట్టణానికి చేరుకున్నారు. ఐటిసి గెస్ట్ హౌస్ లో వారు సేద తీరుతున్నారు. కళ్యాణ తంతు ప్రారంభం అవుతున్న సమయానికి వారు మిథిలా స్టేడియానికి చేరుకుంటారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.