Telangana

News April 17, 2024

అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణం

image

శ్రీ సీతారాముల కళ్యాణానికి భద్రాచలం ముస్తాబైంది. చైత్ర శుద్ధ నవమి అభిషేక్ లగ్నం మధ్యాహ్నం 12 గంటలకు కాస్త అటు ఇటుగా రావడం పరిపాటి. ముహూర్త సమయం కాగానే వధూవరులైన సీతారాముల తలపై జీలకర్ర బెల్లం ఉంచుతారు. తరువాత శ్రీరామదాసు చేయించిన మూడు బొట్లు ఉన్న మంగళసూత్రానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మూడు సూత్రాలు ఉన్న తాళిని సీతమ్మ వారి మెడలో కట్టడంతో కళ్యాణ వేడుక కీలక ఘట్టం ముగుస్తుంది.

News April 17, 2024

ఖమ్మం: దంపతుల సూసైడ్ అటెంప్ట్.. భార్య మృతి

image

కల్లూరు చెందిన దంపతులు మంగళవారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. భార్య మృతి చెందగా భర్త పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు ఇలా ఉన్నాయి. బియ్యం వ్యాపారి చల్ల నరసింహారావు, ఆయన భార్య పుష్పావతి(40) ఇంట్లోనే పురుగుల మందు తాగారు. స్థానికులు చూసేసరికి పుష్పావతి మృతి చెంది ఉంది. నరసింహారావును ఆసుపత్రికి తరలించారు. ఎస్సై షాకీర్ ఘటన స్థలానికి చేరుకొని వివరాలు ఆరా తీస్తున్నారు.

News April 17, 2024

NLG: ‘ఇవేమి ఎండలు..! గతంలో ఎప్పుడూ చూడలేదు’

image

ఇవేమి ఎండలు నాయనా.. గతంలో ఎప్పుడూ ఇంత ఎండలు ఎప్పుడూ చూడలేదు.. అంటూ భానుడి ప్రతాపాన్ని తట్టుకోలేక ప్రజలు ఆపసోపాలు పడుతున్నారు. మంగళవారం జిల్లాలోని మాడుగులపల్లిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 44.7, నాంపల్లిలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. ఉమ్మడి జిల్లాలోని దాదాపు 11 మండలాల్లో 40 డిగ్రీల పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News April 17, 2024

NLG: జిల్లాలో కొనసాగుతున్న రేషన్ ఈ – కేవైసీ

image

ఆహారభద్రత కార్డుల ఈ- కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికీ.. రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం ఈ-కేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం లబ్ధిదారుల్లో 74 శాతం మాత్రమే ఇప్పటి వరకు నమోదు చేసుకున్నట్లు తెలుస్తుంది. మిగిలిన వారి కోసం మరో అవకాశం ఉండకపోవచ్చని.. త్వరగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని సంబంధిత పౌరసరఫరాల శాఖ అధికారులు సూచిస్తున్నారు.

News April 17, 2024

కొత్తగూడెం: బాలికతో పెళ్లి.. పోక్సో కేసు నమోదు

image

చండ్రుగొండ మండలంలోని ఓ మైనర్ బాలికను వివాహం చేసుకున్న వ్యక్తితో పాటు దానికి సహకరించిన మరో ఇద్దరు నిందితులను పోక్సో కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయ్యన్నపాలెంకి చెందిన సాంబశివరావు, సంగీత్, పెనుబల్లి మండలం చిన్నమ్మ గూడెంకు చెందిన వెంకటేశ్వర్లును అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు చండ్రుగొండ ఎస్ఐ మాచినేని రవి తెలిపారు.

News April 17, 2024

సిద్దిపేట: హోటల్ భోజనంలో గాజు ముక్క

image

సిద్దిపేట శివారు నాగులబండ వద్ద ఓ హోటల్ వినియోగదారుడు భోజనం చేస్తుండగా అన్నంలో గాజు ముక్క వచ్చింది. ఈ విషయం నిర్వాహకులకు చెప్పగా వాళ్ళు బుకాయించే ప్రయత్నం చేశారు. దీంతో ఆహార భద్రత అధికారులకు వినియోగదారుడు సమాచారం ఇచ్చారు. అధికారులు వచ్చి తనిఖీ చేశారు. గాజు ముక్క, బియ్యం నమూనాలను స్వాధీనం చేసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆహార భద్రత అధికారి అనూష వెల్లడించారు.

News April 17, 2024

బిజినేపల్లి: గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

image

ఈతకు వెళ్లిన గల్లంతైన యువకుడి మృతదేహం మంగళవారం రాత్రి లభ్యమైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బొరుసుగడ్డతండా ఇప్పలతండాకు చెందిన లక్ష్మణ్ నాయక్(18) ఈనెల 13న శనివారం మిత్రులతో కలిసి వట్టెం వెంకటాద్రి జలాశయం వద్ద నీటి కుంటలో ఈతకు వెళ్లి గల్లంతుకాగా, 3 రోజులుగా గజ ఈతగాళ్లు, NDRF బృందాలతో గాలించగా.. మృతదేహం ఆచూకీ లభించడంతో కుటుంబ సభ్యులకు అప్పగించారు. తండ్రి ఆంజనేయులు నాయక్ ఫిర్యాదుతో కేసు నమోదయింది.

News April 17, 2024

శ్రీరామనవమి వేడుకల విధుల్లో నిర్లక్ష్యం వద్దు: ఎస్పీ

image

శ్రీరామనవమి వేడుకల బందోబస్తులో నిర్లక్ష్యం వహించొద్దని ఎస్పీ రోహిత్‌రాజ్‌ సిబ్బందికి సూచించారు. భద్రాచలం టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఆయన సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు. భక్తులకు అసౌకర్యం కలిగించకుండా అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో పని చేయాలని చెప్పారు. సమావేశంలో ఏఎస్పీలు సాయిమనోహర్‌, పరితోష్‌ పంకజ్‌, ఏఆర్‌ ఏఎస్పీ విజయబాబు, ట్రైనీ ఐపీఎస్‌ విక్రాంత్‌ సింగ్‌ పాల్గొన్నారు.

News April 17, 2024

హెచ్‌సీఏ ఆధ్వర్యాన ఉచిత క్రికెట్‌ శిక్షణ

image

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్ సౌజన్యంతో ఖమ్మంలోని పటేల్‌ స్టేడియం, కొత్తగూడెంలోని గౌతంపూర్‌ మైదానంలో ఉచిత క్రికెట్‌ శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు. భద్రాద్రి జిల్లా బాలబాలికలు www.hydcricket Asssociation (HCA) వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని, ఖమ్మం జిల్లాకు సంబంధించి నెట్స్‌ మేనేజర్‌ ఎం.డీ.ఫారూఖ్‌ను సంప్రదించాలని తెలిపారు. 

News April 17, 2024

ఖమ్మం: ఆర్టీసీకి ఆదాయం అదుర్స్

image

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరుగుతుండడంతో సంస్థకు అదే స్థాయిలో ఆదాయం సమకూరుతోంది. ఈనెల 4వ తేదీన ఖమ్మం రీజియన్‌ నుంచి సంస్థకు రూ.1.35 కోట్లు ఆదాయం రాగా, సోమవారం అంతకుమించి రూ.1.50 కోట్లు ఆదాయం సమకూరింది. ఎండల తీవ్రత అధికంగా ఉన్నా శుభకార్యాలు, ఇతర పనుల కోసం ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుండడం ఆదాయం పెరగడానికి కారణంగా అధికారులు చెబుతున్నారు