Telangana

News April 17, 2024

హనుమకొండ: సివిల్స్ ఫలితాల్లో 104వ ర్యాంకు 

image

అఖిల భారత సర్వీసులో నియామకాల కోసం UPSC-2023 సివిల్స్ సర్వీసెస్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. హనుమకొండకు చెందిన రావుల జయసింహారెడ్డి  సివిల్స్‌లో 104వ ర్యాంక్ సాధించారు. జయసింహారెడ్డి తండ్రి రావుల ఉమారెడ్డి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో అడిషనల్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా ఇంటివద్దనే ఉంటూ నాల్గో ప్రయత్నంలో సివిల్స్ ర్యాంక్ పొందారు.

News April 17, 2024

ప్రభుత్వ ఖజానాకు రూ.60 కోట్ల టోకరా

image

కోదాడ పరిధిలోని కొమరబండ గ్రామ శివారులో ఉన్న వెంకటేశ్వర మిల్లుపై అడిషనల్ కలెక్టర్ లతా విజిలెన్స్ అధికారులతో మంగళవారం దాడులు నిర్వహించారు. రైస్ మిల్లులో ఉన్న సీఎంఆర్ నిలువలను తనిఖీ చేశారు. సుమారు 22 వేల టన్నుల రేషన్ బియ్యాన్ని ఎఫ్సీఐకి బాకీ ఉన్నట్లు తెలిపారు. 60 కోట్లకు పైగా అవినీతి జరిగిందని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఈ దాడుల్లో ఆర్డీవో సూర్యనారాయణ, డీఎం సివిల్ సప్లై రాములు ఉన్నారు.

News April 17, 2024

UPSCలో 703 ర్యాంకు సాధించిన మరో ఆదిలాబాద్ వాసి

image

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని మన్నూర్ చెందిన ముకుంద్ రావు-గీత దంపతుల కుమారుడు చౌహన్ రాజ్ కుమార్ సివిల్స్ ఫలితాల్లో అలిండియా 703వ ర్యాంకు సాధించాడు. ఈయన కాగజ్‌నగర్ నవోదయలో పదోతరగతి పూర్తిచేసి, వరంగల్ NITలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. ఆదిలాబాద్ రురల్ మండలంలోని చందా(టి) గ్రామానికి చెందిన విశాల్ 718ర్యాంకు, ఇంద్రవెల్లి మండలం ముత్నూరుకు చెందిన శుభం 790 ర్యాంకు సాధించారు.

News April 17, 2024

నేడు హైదరాబాద్‌లో ఒకటే స్లోగన్

image

శ్రీరామనవమి వేడుకలకు భాగ్యనగరం ముస్తాబైంది. సీతారాంబాగ్ టెంపుల్, ఆకాశ్‌పురి హనుమాన్ టెంపుల్‌ నుంచి భారీ శోభాయాత్రలు ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతాయి. పలు వీధుల గుండా కొనసాగి హనుమాన్ వ్యాయామశాల వద్ద‌ యాత్ర ముగుస్తుంది. ఇందుకు హైదరాబాద్‌ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. నగరంలోని రామాలయాల్లో‌ కళ్యాణానికి ముహూర్తం పెట్టారు. నేడు జైశ్రీరాం నినాదాలతో హైదరాబాద్‌ హోరెత్తనుంది.

News April 17, 2024

సివిల్స్‌లో సత్తాచాటిన కామారెడ్డి వాసి

image

జాతీయస్థాయి సివిల్స్ ఫలితాల్లో కామారెడ్డి పట్టణానికి చెందిన విద్యార్థి రజనీకాంత్ ర్యాంకు సాధించారు. జిల్లా కేంద్రానికి చెందిన రజనీకాంత్ జాతీయస్థాయి సివిల్ ప్రవేశ పరీక్ష రాశారు. ఆయన జాతీయస్థాయిలో574 ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అభినందించారు. అనంతరం రజనీకాంత్ మాట్లాడుతూ.. ఐపీఎస్ అధికారి కావాలన్నదే తన లక్ష్యమన్నారు.

News April 17, 2024

కరీంనగర్: సివిల్స్ విజేత సాయికిరణ్ నేపథ్యం!

image

రామడుగు మండలం వెలిచాలకు చెందిన సాయికిరణ్ సివిల్స్ ఫలితాల్లో 27వ ర్యాంకు సాధించిన విషయం విదితమే. నిరుపేద కుటుంబానికి చెందిన సాయికిరణ్ బాల్యం నుంచే చదువులో చురుగ్గా రాణిస్తున్నారు. వరంగల్ NITలో ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తూ పరీక్షలకు హాజరై ఉత్తమ ర్యాంకు సాధించారు. ఆయన తండ్రి కాంతయ్య బాంబే, భీవండిలో పవర్ లూమ్ కార్మికుడిగా పని చేసి మృతిచెందారు. తల్లి ఇప్పటికీ గ్రామంలో బీడీలు చూడుతున్నారు. 

News April 17, 2024

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు!

image

సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఉపఎన్నికకు 500 వరకు బ్యాలెట్ కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లు అందుబాటులో ఉంటాయన్నారు. కంటోన్మెంట్ పరిధిలో దాదాపుగా 2.51 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, 232 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

News April 17, 2024

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు!

image

సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఉపఎన్నికకు 500 వరకు బ్యాలెట్ కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లు అందుబాటులో ఉంటాయన్నారు. కంటోన్మెంట్ పరిధిలో దాదాపుగా 2.51 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, 232 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

News April 17, 2024

మెదక్: సివిల్ సర్వీస్ ఫలితాల్లో నర్సంపల్లి వాసి

image

మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నర్సంపల్లికి చెందిన కె. అర్పిత నిన్న విడుదలైన సివిల్ సర్వీస్ ఫలితాల్లో 639 ర్యాంకు సాధించారు. తండ్రి అమర్ సింగ్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో సీనియర్ మేనేజర్ గా పని చేస్తుండగా.. తల్లి రేణుక సదాశివపేట రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. ర్యాంకు సాధించడం పట్ల నర్సంపల్లి వాసులు హర్షం వ్యక్తం చేశారు.

News April 17, 2024

కామారెడ్డి: గ్రూప్1 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

image

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా జూన్ 9 న నిర్వహించే గ్రూప్-1 పరీక్ష పకడ్బందీగా నిర్వహించుటకు అధికారులు ముందస్తు ప్రణాళికతో సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని మినీ సమావేశమందిరంలో టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించే గ్రూప్-1 పరీక్షల నిర్వహణ సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాలో పరీక్షలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరపాలన్నారు.