Telangana

News April 17, 2024

HYD: మెట్రో నిర్మాణ వ్యయం తగ్గించడంపై ఫోకస్

image

పాతబస్తీ మెట్రో నిర్మాణంలో వ్యయం తగ్గించేందుకు అధికారులు టెక్నికల్ అంశాలపై ఫోకస్ పెట్టారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా 5.5KM అంటున్నప్పటికీ , ఇప్పటికే మూసీలో 0.3KM మెట్రో రివర్సల్ ఉంది. ఇంకా 5.2KM నిర్మిస్తే సరిపోతుంది. దీంతో కొంత వ్యయం తగ్గించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. పాత అలైన్మెంట్ ప్రకారం ఆరు స్టేషన్లు ఉండగా, నాలుగు స్టేషన్లకు కుదించే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

News April 17, 2024

భద్రాచలం సీతమ్మకే మూడు సూత్రాల తాళి

image

భద్రాచలం సీతమ్మ తల్లికి ప్రత్యేకమైన మూడు సూత్రాల తాళితో కళ్యాణం నవమి నాడు నిర్వహించనున్నారు. పుట్టింటి సూత్రం, మెట్టినింటి సూత్రంతో పాటు రాముని పరమ భక్తుడు భక్తరామదాసు భక్తుల తరఫున ఏర్పాటు చేసిన మూడో సూత్రం కలిపి దేవాలయ అర్చకులు శ్రీరామ నవమి నాడు రాములోరి కళ్యాణం నిర్వహిస్తారు. భద్రాచలంలో ఆలయానికి మాత్రమే ఈ తంతు ప్రత్యేకం.

News April 17, 2024

HYD: రాత్రి వేళల్లోనూ MMTS!

image

HYD నగరం నుంచి విశాఖపట్నం, బెంగళూరు, తిరుపతి మధ్య నడుస్తున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు అనుగుణంగా రాత్రి వేళల్లో MMTS అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. HYD నగరానికి వచ్చే వందే భారత్ రైళ్లన్నీ రాత్రి 11 గంటల తర్వాతే వస్తున్నాయని.. ఆ సమయంలో ప్రజారవాణా లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారనే విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నామని పేర్కొన్నారు.

News April 17, 2024

18 నుంచి నామినేషన్ల స్వీకరణ

image

లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 18న రానుందని ఖమ్మం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. నామినేషన్ల స్వీకరణ ఈ నెల 18 నుంచి 25 వరకు ఉదయం 11 గంటల నుంచి మ.3 గంటల వరకు చేపడతామని చెప్పారు. కలెక్టరేట్‌కు దరఖాస్తుల సమర్పణకు వచ్చే ప్రజలు దీనిని గమనించాలని, పై తేదీల్లో సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు మాత్రమే కలెక్టరేట్‌కు దరఖాస్తుదారులు రావాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

News April 17, 2024

HYD నగర ప్రజలకు GOOD NEWS.. త్వరలో 3D VIEW

image

రాష్ట్ర రాజధాని HYD నగరానికి 3D చిత్రం రాబోతుంది. గ్రేటర్ విస్తీర్ణాన్ని డ్రోన్లతో రికార్డు చేసి, తద్వారా వచ్చే బేస్ మ్యాప్ పై క్షేత్రస్థాయి సర్వేలో తీసే ఫొటోలు, ఇతర వివరాలను పొందుపరుస్తారు. దీని పై GHMC ఐటీ విభాగం భారీ కసరత్తు చేసింది. మొదట ఆస్తిపన్ను ఆదాయాన్ని పెంచుకునేందుకు,తాగునీరు, విద్యుత్తు కనెక్షన్లు, నగరంలోని ఎత్తుపల్లాలు, నిర్మాణాలను సైతం డిజిటలైజ్ చేయనున్నారు.

News April 17, 2024

HYD నగర ప్రజలకు GOOD NEWS.. త్వరలో 3D VIEW

image

రాష్ట్ర రాజధాని HYD నగరానికి 3D చిత్రం రాబోతుంది. గ్రేటర్ విస్తీర్ణాన్ని డ్రోన్లతో రికార్డు చేసి, తద్వారా వచ్చే బేస్ మ్యాప్ పై క్షేత్రస్థాయి సర్వేలో తీసే ఫొటోలు, ఇతర వివరాలను పొందుపరుస్తారు. దీని పై GHMC ఐటీ విభాగం భారీ కసరత్తు చేసింది. మొదట ఆస్తిపన్ను ఆదాయాన్ని పెంచుకునేందుకు, తాగునీరు, విద్యుత్తు కనెక్షన్లు, నగరంలోని ఎత్తుపల్లాలు, నిర్మాణాలను సైతం డిజిటలైజ్ చేయనున్నారు.

News April 17, 2024

MBNR: 17 స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: మంత్రి జూపల్లి

image

లోక్ సభ ఎన్నికల్లో 17 స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం అలంపూర్ నియోజకవర్గంలోని మానవపాడు, వడ్డేపల్లి మండలాల్లో పర్యటించారు. శాంతినగర్ క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో రూ.8 లక్షల కోట్లు అప్పులు చేసి తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టివేశారని తెలిపారు.

News April 17, 2024

జయంతికి కొండగట్టులో సకల సౌకర్యాలు కల్పించాలి: అదనపు కలెక్టర్

image

కొండగట్టు అంజన్న ఆలయంలో ఈ నెల 22 నుంచి జరిగే చిన్న జయంతి ఉత్సవాల్లో  భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని అదనపు కలెక్టర్ దివాకర అధికారులను ఆదేశించారు. మంగళవారం కొండగట్టులో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉత్సవాలలో అధికారులు సమన్వయంతో పని చేయాలని, ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కల్గనివ్వొద్దన్నారు. ఆర్డీఓ మధుసూదన్, డీఎస్పీ రఘుచందర్‌తో పాటు ఆయా శాఖల అధికారులు ఉన్నారు.

News April 17, 2024

NZB: రికార్డ్‌స్థాయిలో 2.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ

image

రాష్ట్రంలో ఈసారి యాసంగిలో ఇప్పటివరకు రికార్డ్‌స్థాయిలో 2.69లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగిందని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దేవేంద్రసింగ్ జవాన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో అధికారులతో మాట్లాడుతూ.. అవసరమైతే ఇంకా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ కేంద్రంలో సరిపడా టర్పైన్లు, ఇతర సదుపాయాలు ఉండేలా చూసుకోవాలన్నారు.

News April 17, 2024

HYD: అనంతగిరి టూర్‌ స్పెషల్

image

అనంతగిరి HYD నగరానికి దాదాపుగా 70.3 కిలోమీటర్ల దూరంలో ఉంది. బయట వాతావరణంతో పోల్చితే ఇక్కడ 5 సెంటిగ్రేడ్‌ల ఉష్ణోగ్రత తక్కువే ఉంటుంది. గుహలు, కోటలు, దేవాలయాలు ఈ ప్రదేశ ఔన్నత్యాన్ని తెలియజేస్తాయి. అనంత పద్మనాభస్వామి దేవాలయం ఫేమస్. అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్ కూడా ఉంటుంది. మూసీనది పుట్టింది కూడా ఇక్కడే. వేసవి కావడంతో‌ టూరిస్టుల ఇటువైపు మొగ్గుచూపుతున్నారని అధికారులు తెలిపారు.