Telangana

News April 16, 2024

HYD: భార్యాభర్తల మధ్య గొడవ.. రైలు కిందపడి భర్త ఆత్మహత్య!

image

భార్యాభర్తలు గొడవపడి మనస్థాపంలో భర్త రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. రైల్వే ఇన్స్పెక్టర్ ఆర్.ఎల్లప్ప తెలిపిన వివరాల ప్రకారం.. మలక్ పేట్ ప్రాంతానికి చెందిన విశ్రాంత సహాకార ఉద్యోగి ఎన్.సుదర్శన్(63) మలక్ పేట్-కాచిగూడ రైల్వే స్టేషన్ల మధ్య మంగళవారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.

News April 16, 2024

వికారాబాద్: జిల్లాలో ‘TODAY TOP NEWS’

image

✒VKB: సీతారాముల కళ్యాణం మహోత్సవానికి సిద్ధమైన ఆలయాలు
✒కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి: స్పీకర్ గడ్డం ప్రసాద్
✒రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: కలెక్టర్
✒కొడంగల్: తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు
✒రేపు తాండూర్‌లో మాంసం విక్రయాలు బంద్
✒సివిల్స్ ఫలితాల్లో 231 ర్యాంకు సాధించిన పూడూరు మండలవాసి తరుణ్
✒అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు: మహమ్మదాబాద్ ఎస్సై

News April 16, 2024

HYD: ఉమ్మడి జిల్లాలో నేటి..TOP న్యూస్

image

✓HCA ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపు రిజిస్ట్రేషన్ షురూ
✓HYD జిల్లాలో 20వేలకు పైగా మద్యం సీజ్
✓లోక్ సభ ఎన్నికల పై సిపి అవినాష్ మహంతి మీటింగ్
✓ఓయూ ఎంఫార్మసీ ఫలితాలు విడుదల
✓కాంగ్రెస్ పార్టీలో చేరిన డిసిసిబి చైర్మన్ కుర్మ సత్తయ్య
✓వనస్థలిపురంలో పల్టీ కొట్టిన ఆటో
✓మధ్యాహ్నం 12 నుంచి 4PM వరకు గ్రేటర్లో పరిమితంగా ఆర్టీసీ బస్సులు
✓పేట బషీరాబాద్ పరిధిలో మర్డర్

News April 16, 2024

HYD: జువైనల్ హోమ్ నుంచి పారిపోయిన బాలిక!

image

జువైనల్ హోమ్(బాలికల సదన్) నుంచి ఓ బాలిక పారిపోయిన ఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. ఎస్సై నరేష్ కుమార్ వివరాల ప్రకారం.. మంగళ్ హాట్ ప్రాంతానికి చెందిన హనుమంతు కుమార్తె ప్రియగిరి(17)ని కాచిగూడలోని బాలికల సదన్‌కు 2023 జనవరిలో తీసుకువచ్చారు. మంగళవారం బాలికల సదన్ నుంచి గోడ దూకి పారిపోయింది. సూపర్ వైజర్ సావిత్రి కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

News April 16, 2024

HYD: జువైనల్ హోమ్ నుంచి పారిపోయిన బాలిక

image

జువైనల్ హోమ్(బాలికల సదన్) నుంచి ఓ బాలిక పారిపోయిన ఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. ఎస్సై నరేష్ కుమార్ వివరాల ప్రకారం.. మంగళ్ హాట్ ప్రాంతానికి చెందిన హనుమంతు కుమార్తె ప్రియగిరి(17)ని కాచిగూడలోని బాలికల సదన్‌కు 2023 జనవరిలో తీసుకువచ్చారు. మంగళవారం బాలికల సదన్ నుంచి గోడ దూకి పారిపోయింది. సూపర్ వైజర్ సావిత్రి కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

News April 16, 2024

భద్రాద్రి రామయ్య ఎదురుకోలు ఉత్సవం

image

భద్రాద్రి రామయ్య ఎదురుకోలు ఉత్సవం ఈరోజు సాయంత్రం భద్రాచలం లో కన్నుల పండుగగా అట్టహాసంగా జరిగింది. కల్యాణానికి కొద్ది ఘడియలు ముందు అత్యంత ఘనంగా ఎదుర్కోలు వేడుక ఉంటుంది. సీతారాములవారి గుణాలను వివరించే తీరు మంత్రముగ్ధులను చేస్తుంది. సీతమ్మవారి వైపు ఒకరు, రామయ్య తండ్రి వైపు ఇంకొకరు ఉండి ఇరు వంశాల గొప్పలు సుభాషించే తీరు ఆద్యంతం సంతోషాలను పంచుతుంది. ఈ ఉత్సవం తర్వాత స్వామివారి తిరువీధి సేవ చేసారు.

News April 16, 2024

MBNR: వంశీ చంద్ రెడ్డి గెలుపుతో పాలమూరు అభివృద్ధి: ఎమ్మెల్యే

image

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి పాలమూరు ఎంపీగా గెలిస్తే పాలమూరును అభివృద్ధి చేసి చూపిస్తామని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం ఆత్మకూరు పట్టణంలోని సాయి తిరుమల ఫంక్షన్ హాల్‌లో జరిగిన మండల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఎంపీ అభ్యర్థి వంశీ చందు రెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే పాలమూరు అభివృద్ధి చెందుతుందని వాకిటి శ్రీహరి అన్నారు.

News April 16, 2024

ఎన్నికల విధుల పట్ల అవగాహన కలిగి ఉండాలి: కలెక్టర్

image

ఎన్నికల విధుల పట్ల పూర్తి అవగాహన కలిగివుండాలని ఖమ్మం ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారులకు ఏర్పాటుచేసిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ అవగాహన కల్పించారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

News April 16, 2024

MBNR: ఈనెల 18 నుండి నామినేషన్ల స్వీకరణ: కలెక్టర్

image

ఈనెల 18 నుండి 25 వరకు పార్లమెంట్ అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తామని కలెక్టర్ రవి నాయక్ తెలిపారు. మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు పలువురు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అభ్యర్థుల వాహనాలు మాత్రమే లోపలికి అనుమతిస్తామని, మిగతా వాహనాలను 100 మీటర్ల దూరంలో పార్కింగ్ చేయిస్తామని, ఆయా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ నియమాలను పాటించాలని తెలిపారు.

News April 16, 2024

ఎన్ని జన్మలెత్తినా మెదక్ ప్రజల రుణం తీర్చుకోలేను: KCR

image

మెదక్ ప్రజలు ఇచ్చిన ధైర్యంతోనే పోరాడి తెలంగాణను సాధించానని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఎన్ని జన్మలెత్తినా మెదక్ ప్రజల రుణం తీర్చుకోలేనన్నారు. ఈ గడ్డలో పుట్టిన తాను మెదక్ ప్రజల ఆశీర్వాదం వల్ల కేంద్రమంత్రి, రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రి అయ్యాయని గుర్తు చేసుకున్నారు.