Telangana

News April 16, 2024

నిజామాబాద్: బీఆర్ఎస్ సమన్వయకర్తల నియామకం

image

నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని వివిధ నియోజకవర్గాలకు బీఆర్ఎస్ సమన్వయకర్తలను నియమించింది. కోరుట్లకు ఎల్. రమణ, ఆర్మూర్ కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, నిజామాబాద్ అర్బన్ ప్రభాకర్‌రెడ్డి, బాల్కొండ ఎల్.ఎం.బీ రాజేశ్వర్, నిజామాబాద్ రూరల్ వి.గంగాధర్ గౌడ్, బోధన్ డి.విఠల్‌‌రావులను నియమించింది.

News April 16, 2024

జహీరాబాద్: కాంగ్రెస్‌తోనే రాష్ట్రం అభివృద్ధి: మంత్రి

image

జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. జహీరాబాద్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం మంగళవారం నిర్వహించారు. జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట అని చెప్పారు. కాంగ్రెస్ విజయానికి కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. సమావేశంలో అభ్యర్థి సురేష్ షెట్కార్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

News April 16, 2024

నల్గొండ: స్విమ్మింగ్ పూల్‌లో పడి యువకుడు మృతి 

image

చిట్యాల మండలం వట్టిమర్తికి చెందిన నూనె సంజీవయ్య కుమారుడు నూనె శ్రవణ్ కుమార్ మంగళవారం ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్‌లో పడి మరణించారు. విషయం తెలుసుకున్న బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి ప్రియదర్శిని వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి. పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.

News April 16, 2024

సివిల్స్‌ ఫలితాల్లో కరీంనగర్ యువతి ప్రతిభ

image

సివిల్స్ ఫలితాల్లో కరీంనగర్ యువతి ప్రతిభ కనబరిచారు. పట్టణానికి చెందిన కొలనుపాక సహన 739వ ర్యాంకు సాధించి సివిల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. కరీంనగర్‌ టౌన్‌లో ఇంటర్ వరకు చదివిన సహన.. హైదరాబాద్ జేఎన్‌టీయూలో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం ఢిల్లీలోని ఓ ఐఏఎస్ అకాడమీలో కోచింగ్ తీసుకుని తాజా ఫలితాల్లో ర్యాంకు సాధించారు. సహన తండ్రి అనిల్ కరీంనగర్ టౌన్‌లో ఓ పత్రిక రిపోర్టర్‌గా పని చేస్తున్నారు.

News April 16, 2024

ఖమ్మం: హెడ్ కానిస్టేబుల్ కుమార్తెకు సివిల్స్ ర్యాంక్

image

బోనకల్ మండల పరిధిలోని గోవిందాపురం (ఎల్) గ్రామానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ రావూరి ప్రకాషరావు కుమార్తె రావూరి సాయి అలేఖ్య ఈరోజు ప్రకటించిన సివిల్స్ ఫలితాలలో ఆల్ ఇండియా 938వ ర్యాంకు సాధించారు. సాయి అలేఖ్యకు మధిర టౌన్ ఎస్ఐ సంధ్య, పోలీస్ స్టేషన్ సిబ్బంది, గ్రామస్థులు శుభాకాంక్షలు తెలిపారు.

News April 16, 2024

నల్గొండ: 3నెలల్లో ఏడుగురు దొరికారు..

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రభుత్వ కొలువులను అడ్డం పెట్టుకుని ఆదాయానికి మించి ఆస్తులు కూడబెడుతున్న ఉద్యోగులపై అనిశా దృష్టి పెట్టింది. అయితే గడిచిన 3 నెలల్లోనే ఏడుగురు అధికారులు అనిశాకు చిక్కడం గమనార్హం. ఇందులో యాదాద్రి జిల్లాలో రవాణా అధికారితో పాటు మోత్కురు మండలం పొడిచేడులో పనిచేసిన పంచాయతీ కార్యదర్శి వరకు ఉండడం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది.

News April 16, 2024

మెదక్: ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి ఖాయం: ఎమ్మెల్యే

image

దుబ్బాక ప్రజలకు మాయ మాటలు చెప్పి మోసం చేసిన రఘునందన్ రావు ఎంపీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడం ఖాయమని, మెదక్ గడ్డ మీద గులాబీ జెండా రెపరెపలాడటం ఖాయమని దుబ్బాక ఎమ్మెల్యే, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. చేగుంట మండలం వడియారంలో చేగుంట, నార్సింగి మండలాల పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎంపీ అభ్యర్థి, మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి‌తో కలిసి మాట్లాడారు.

News April 16, 2024

MBNR: RS ప్రవీణ్ కుమార్‌కు BIG షాక్.. BSP నుంచి కీలక నేత పోటీ

image

పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పాలమూరులో రాజకీయం రసవత్తరంగా మారింది. నాగర్ కర్నూల్ కాంగ్రెస్ టికెట్ ఆశించిన మంద జగన్నాథం ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. మల్లు రవికి టికెట్ కేటాయించడంతో అసంతృప్తిగా ఉన్న జగన్నాథం BSPలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆయన మాయావతిని కలిసేందుకు ఢిల్లీకి పయనమయ్యారు. BRS నుంచి పోటీలో ఉన్న RS ప్రవీణ్ కుమార్‌కు ఇది పెద్ద దెబ్బే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

News April 16, 2024

HYD: మొదటి ట్రైన్ ప్రారంభమై నేటికి 171 ఏళ్లు!

image

భారతదేశంలో మొట్ట మొదటి ప్యాసింజర్ ట్రైన్ 16 ఏప్రిల్ 1853న బాంబే నుంచి థానే వరకు వెళ్లేందుకు ప్రారంభమైనట్లు HYD సికింద్రాబాద్ SCR అధికారులు X వేదికగా తెలిపారు. 171 ఏళ్ల సర్వీస్ అందించిన ట్రైన్ తీపి జ్ఞాపకాలు కోట్లాదిమంది గుండెల్లో చోటు సంపాదించుకున్నాయని పేర్కొన్నారు. రవాణా చరిత్రలోనే ఇదొక మైలురాయిగా అభివర్ణించారు.

News April 16, 2024

HYD: మొదటి ట్రైన్ ప్రారంభమై నేటికి 171 ఏళ్లు!

image

భారతదేశంలో మొట్ట మొదటి ప్యాసింజర్ ట్రైన్ 16 ఏప్రిల్ 1853న బాంబే నుంచి థానే వరకు వెళ్లేందుకు ప్రారంభమైనట్లు HYD సికింద్రాబాద్ SCR అధికారులు X వేదికగా తెలిపారు. 171 ఏళ్ల సర్వీస్ అందించిన ట్రైన్ తీపి జ్ఞాపకాలు కోట్లాదిమంది గుండెల్లో చోటు సంపాదించుకున్నాయని పేర్కొన్నారు. రవాణా చరిత్రలోనే ఇదొక మైలురాయిగా అభివర్ణించారు.