Telangana

News April 16, 2024

మెదక్: ఈనెల 18న నీలం మధు నామినేషన్

image

మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ఈనెల 18న నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ సందర్భంగా మెదక్ పట్టణంలో సుమారు 50 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించేందుకు పార్టీ నాయకత్వం సన్నాహాలు చేస్తుంది. మెదక్ పట్టణంలో ఈ ర్యాలీ కోసం ఇప్పటికే ఏఆర్ఓకు దరఖాస్తు చేసినట్లు సమాచారం. నామినేషన్ సందర్భంగా పార్టీ బలం నిరూపించేలా పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. కార్యక్రమానికి మంత్రులు హాజరు కానున్నారు.

News April 16, 2024

కోమటిరెడ్డి బ్రదర్స్‌కు సరికొత్త ఛాలెంజ్

image

కోమటిరెడ్డి బ్రదర్స్‌కు సరికొత్త ఛాలెంజ్ ఎదురైంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్ సెగ్మెంట్‌కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భువనగిరి నియోజకవర్గానికి ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఇన్‌ఛార్జులుగా నియమితులైన విషయం తెలిసిందే. ఈ రెండు సెగ్మెంట్లలో భిన్నమైన రాజకీయ పరిస్థితులు నెలకొనడంతో.. వారిద్దరూ కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం వ్యూహాలు రచిస్తున్నారు.

News April 16, 2024

నవాబుపేటలో మహిళ దారుణ హత్య

image

నవాబుపేటలో మహిళ దారుణ హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాలు.. లక్ష్మమ్మ(45) కొడుకు పోలీస్ కాగా మరోచోట ఉంటున్నాడు. ఒంటరిగా ఉంటున్న ఆమె ఇంట్లోంచి సోమవారం దుర్వాసన రావడంతో పక్కింటివాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు తాళం పగలగొట్టి చూడగా రక్తపు మడుగులో ఆమె పడి ఉంది. శరీరంపై నగలు, కడియాలు, గొలుసులు లేకపోవడంతో వీటి కోసమే హత్య చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేశారు.

News April 16, 2024

వరంగల్: రూ.5 పెరిగిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర రూ.5 పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,100 పలకగా.. ఈరోజు రూ.7105 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. అయితే పత్తి ధరలు భారీగా పడిపోతుండటంతో రైతన్నలు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడంలేదని ఆవేదన చెందుతున్నారు.

News April 16, 2024

KNR: పోలీస్ స్టేషన్ ఘటనపై పోలీస్ శాఖ చర్యలు.!

image

<<13057630>>మహాదేవపూర్ <<>>PSలో సోమవారం జరిగిన ఘటనపై పోలీస్ శాఖ తీవ్రచర్యలు చేపట్టింది. ఆ ఘటనపై మల్టీ జోన్-1 ఐజీ రంగనాథ్ ఆదేశాల మేరకు జిల్లా SP కిరణ్ ఖరే.. SI ప్రసాద్‌ను VRకు బదిలీ చేశారు. హెడ్ కానిస్టేబుల్ సోయం శ్రీనివాస్‌ను సస్పెండ్ చేశారు. అదేవిధంగా స్టేషన్ పరిధిలోని ఓ హెడ్ కానిస్టేబుల్‌తో పాటు మరో ఆరుగురి సిబ్బందిపై బదిలి వేటు వేశారు. దీంతో పోలీసు అధికారులు, సిబ్బందిలో అలజడి మొదలైంది.

News April 16, 2024

వరంగల్: సమన్వయకర్తలను నియమించిన కేటీఆర్

image

వరంగల్ పార్లమెంట్ ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గాల వారీగా ఇన్చార్జిలను నియమించారు. పరకాలకు బండ ప్రకాష్ ముదిరాజ్, పాలకుర్తి సిరికొండ మధుసూదనాచారి, మెట్టు శ్రీనివాస్, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి పల్లా రాజేశ్వర్ రెడ్డి, వరంగల్ ఈస్ట్‌కు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, వర్ధన్నపేటకు వాసుదేవరెడ్డి, సమ్మరావు, భూపాలపల్లికి బసవరాజు సారయ్యను నియమించారు.

News April 16, 2024

నవీపేట్: గుండెపోటుతో అధ్యాపకురాలు మృతి

image

నవీపేట్ మండలంలోని ఆదర్శ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న జరీనా పిర్దోస్ (48) సోమవారం గుండెపోటుకు గురై మృతి చెందినట్లు పాఠశాల ప్రిన్సిపల్ నవీన్ కుమార్ తెలిపారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. లెక్చరర్ మృతిపై ఉపాధ్యాయులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

News April 16, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా మిర్చి ధర రూ. 20,000 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,350 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈ రోజు మిర్చి ధర రూ.500, పత్తి ధర రూ.50 పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్లో రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు.

News April 16, 2024

బొంరాస్‌పేట: వడదెబ్బతో గొర్రెల కాపరి మృతి

image

వడదెబ్బతో గొర్రెల కాపరి మృతి చెందిన ఘటన బొంరాస్ పేట మండలం నాగిరెడ్డిపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన నందిగామ నర్సింలు(45) గొర్రెలు మేపడానికి కొత్తూరు చెరువు సమీపంలోకి వెళ్లారు. సాయంత్రం గొర్రెలు ఇంటికి వచ్చినా నర్సింలు రాలేదు. దీంతో కుటుంబీకులు వెతకగా కొత్తూరు వెళ్లే రోడ్డు పక్కన పడి ఉన్నారు. ఎండల నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు.

News April 16, 2024

బాసర IIITలో విద్యార్థి ఆత్మహత్య

image

నిర్మల్ జిల్లా బాసర IIITలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పీయూసీ సెంకడీయర్ చదవుతున్న అర్వింద్ వసతి గృహంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతదేహన్ని నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి స్వస్థలం సిద్దిపేట జిల్లా బండారుపల్లిగా గుర్తించారు. అర్వింద్ ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.