Telangana

News April 16, 2024

WGL: కానిస్టేబుల్ జాబ్ రాలేదని యువకుడు ఆత్మహత్య

image

కానిస్టేబుల్ ఉద్యోగం దక్కడం లేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హసన్ పర్తి మండలం అర్వపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ అశోక్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన దేవేందర్ గౌడ్, భారతీ దంపతుల కుమారుడు రంజిత్ డిగ్రీ పూర్తి చేసి 2022 నుంచి కానిస్టేబుల్ పరీక్షలు రాస్తున్నాడు. ఫిజికల్ టెస్టులు అర్హత సాధించినప్పటికీ రాత పరీక్షలు వెనుక పడిపోవడంతో మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

News April 16, 2024

BREAKING.. KNR: స్కూల్ బస్ కింద పడి చిన్నారి మృతి

image

స్కూల్ బస్సు కిందపడి ఏడాదిన్నర చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం మద్దుట్లలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. అన్నను బస్సు ఎక్కించేందుకు వెళ్లిన చిన్నారి అలీఫా ప్రమాదవశాత్తు బస్సు కిందపడి ప్రాణాలు కోల్పోయింది. దీంతో చిన్నారి కుటుంబంలో విషాదం అలుముకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 16, 2024

HYD: నాగోల్‌లో బాలికను బెదిరించి అత్యాచారం

image

బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన నాగోల్‌లో వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. నాగోల్ PS పరిధికి చెందిన రాకేశ్ (29) ప్రైవేటు ఉద్యోగి. కొంతకాలంగా ఓ బాలిక(13)తో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఇటీవల ఆమెను బెదిరించి అత్యాచారం చేశాడు. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. సోమవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

News April 16, 2024

నిర్మల్: పులి ఆవాసం కోసం గ్రామం తరలింపు

image

ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో విస్తరించి ఉన్న కవ్వాల్ పెద్ద పులుల సంరక్షణ కేంద్రంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న 18 గ్రామాలను అటవీ శాఖ గుర్తించింది. వారిని అక్కడి నుంచి తరలించే యోచన చేసింది. దీనిలో మొదటి ప్రాజెక్టుగా నిర్మల్ జిల్లా కడెం మండలంలోని మైసంపేట, రాంపూర్ గ్రామాల తరలింపుకు సర్వం సిద్ధం చేసింది. గత ఐదారేళ్లుగా కొత్త మద్దిపడగలో కాలనీ నిర్మించింది. సోమవారం నుంచి ఆ గ్రామాన్ని తరలిస్తున్నారు.

News April 16, 2024

వర్ని: జీవితంపై విరక్తితో వ్యక్తి ఆత్మహత్య

image

వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని చందూర్ మండల కేంద్రానికి చెందిన మమ్మాయి గిరి (46) అనే వ్యక్తి జీవితంపై విరక్తితో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్సై కృష్ణకుమార్ తెలిపారు. మద్యానికి బానిసైన గిరి అప్పులు చేశారు. అప్పులను తీర్చలేక చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డట్టు పేర్కొన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు..

News April 16, 2024

HYD: నాగోల్‌లో బాలికను బెదిరించి అత్యాచారం

image

బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన నాగోల్‌లో వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. నాగోల్ PS పరిధికి చెందిన రాకేశ్ (29) ప్రైవేటు ఉద్యోగి. కొంతకాలంగా ఓ బాలిక(13)తో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఇటీవల ఆమెను బెదిరించి అత్యాచారం చేశాడు. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. సోమవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

News April 16, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✒GDWL,MBNR: నేడు పలు మండలాలలో కరెంటు కట్
✒పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్న స్థానిక MLAలు,MP అభ్యర్థులు
✒ఉమ్మడి జిల్లాలో శ్రీరామ నవమికి ఆలయాల ముస్తాబు
✒ధన్వాడ:నేటి నుంచి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
✒పలు మండలాలలో ‘రైతుల నేస్తం’ కార్యక్రమం
✒గండీడ్,ధన్వాడ:Way2News కు స్పందన..కొత్త బోర్లకు మోటర్లు బిగింపు
✒సిమ్మింగ్ పూల్ వద్ద నిబంధనలు తప్పనిసరి: పోలీసులు
✒కొనసాగుతున్న’DSC’ శిక్షణ

News April 16, 2024

నాగారం ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు!

image

నిత్యం బడికి డుమ్మాకొడుతూ, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మధ్యాహ్న భోజన బిల్లులు స్వాహా చేసిన ఓ ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్‌ వేటు పడింది. గుండాల మండలంలోని నాగారం ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు శంకర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టకుండానే ఏడాది కాలంగా బిల్లులు స్వాహా చేస్తున్నాడు. సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వరాచారి ఉత్తర్వులు జారీ చేశారు.

News April 16, 2024

హైదరాబాద్‌: మధ్యాహ్నం RTC బస్సులకు REST

image

ఎండలు దంచికొడుతున్న వేళ TSRTC కీలక నిర్ణయం తీసుకొంది. మధ్యాహ్నం HYDలో బస్సు సర్వీసుల సంఖ్యను తగ్గిస్తున్నట్లు RTC గ్రేటర్ జోన్ ED వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఎండల ప్రభావానికి ప్రయాణికులు రోడ్డెక్కడం లేదని గుర్తించామన్నారు. ఈ సమయంలో ట్రిప్పులను తగ్గించనున్నట్లు స్పష్టం చేశారు. ఉదయం 5 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు సర్వీసులు ఉంటాయని.. 12PM నుంచి 4PM మధ్యలో పరిమితంగా బస్సులను నడపనున్నారు.
SHARE IT

News April 16, 2024

హైదరాబాద్‌: మధ్యాహ్నం RTC బస్సులకు REST

image

ఎండలు దంచికొడుతున్న వేళ TSRTC కీలక నిర్ణయం తీసుకొంది. మధ్యాహ్నం HYDలో బస్సు సర్వీసుల సంఖ్యను తగ్గిస్తున్నట్లు RTC గ్రేటర్ జోన్ ED వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఎండల ప్రభావానికి ప్రయాణికులు రోడ్డెక్కడం లేదని గుర్తించామన్నారు. ఈ సమయంలో ట్రిప్పులను తగ్గించనున్నట్లు స్పష్టం చేశారు. ఉదయం 5 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు సర్వీసులు ఉంటాయని.. 12PM నుంచి 4PM మధ్యలో పరిమితంగా బస్సులను నడపనున్నారు.SHARE IT