Telangana

News April 16, 2024

సిద్దిపేట: అరచేతిలో ఓటరు సమాచారం !

image

లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం వివిధ రూపాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మరోవైపు సోమవారం వరకు కొత్త ఓటర్ నమోదుకు అవకాశం కల్పించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో వందలాది మంది యువత ఓటు హక్కు పొందేందుకు దరఖాస్తు చేసుకున్నారు. త్వరలోనే ఓటర్ జాబితాను విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ఓటర్లకు ఎలాంటి సందేహం ఉన్నా నివృత్తి చేసుకునేలా ఓటర్ హెల్ప్ లైన్ యాప్‌ అందుబాటులోకి తీసుకొచ్చారు.

News April 16, 2024

NLG: గెలుపే లక్ష్యంగా కమలనాథుల ప్రణాళికలు

image

ఉమ్మడి జిల్లాలో ఎంపీ ఎన్నికలపై BJP ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని 2 ఎంపీ సీట్లు గెలుపే లక్ష్యంగా కమలనాథులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ క్యాడర్ ను సంసిద్ధులుగా చేస్తున్నారు. ఇటీవల ప్రధాని మోదీ సంకల్ప్ పత్ర పేరుతో విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరిస్తున్నారు.

News April 16, 2024

ఉమ్మడి పాలమూరు వాసులకు గమనిక..!

image

ఎర్లీబర్డ్ స్కీమ్ అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నును చెల్లిస్తే 5 శాతం రిబేట్ పొందవచ్చని ఆయా మున్సిపల్ కమిషనర్లు తెలిపారు. ఏప్రిల్ 30 వరకు అవకాశం ఉందని, ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
SHARE IT

News April 16, 2024

NZB: కూరగాయలు అమ్మిన ఎంపీ అభ్యర్థి

image

బీర్కూర్ మండలం మిర్జాపూర్ గ్రామంలో సోమవారం బీజేపీ ఎంపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని కూరగాయలు అమ్ముతున్న వ్యక్తి వద్దకు వెళ్లిన బీబీ పాటిల్ బీజేపీకి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన కూరగాయల షాపులో కొద్దిసేపు కూర్చున్నారు. కూరగాయలు కొనడానికి వచ్చిన వారిని బీజేపీకి ఓటు వేయమని కోరారు.

News April 16, 2024

ఎంపీ ఎన్నికలు జరిగిన వెంటనే స్థానిక ఎన్నికలు: సీఎం

image

కాంగ్రెస్‌ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నారాయణపేట సభలో ఆయన మాట్లాడుతూ.. ‘అందరూ ఏకమయ్యారు. ఎమ్మెల్యే ఎన్నికల కంటే కష్టపడాలి. లోక్‌సభ ఎన్నికలు జరిగిన మరుక్షణం స్థానిక ఎన్నికలు పెట్టి.. మిమ్మల్ని గెలిపించుకుంటాం. పార్టీ కోసం పని చేసే వారిని గుర్తు పెట్టుకుంటాం. మీ త్యాగాలు గుర్తుపెట్టుకుని అవకాశాలు కల్పించడమే కాదు.. గెలిపించుకుని తీరుతాం’ అని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.

News April 16, 2024

ఆదిలాబాద్: 41కిలోలు.. రూ. 12లక్షలు.. 16 కేసులు

image

ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి విక్రయాలకు అడ్డుకట్ట పడటం లేదు. ఎన్నికల నియమావళి అమలైనప్పటి నుంచి పోలీసులు, ఎక్సైజ్ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. దాదాపు నెల రోజుల్లోనే రూ.12 లక్షల విలువైన 41 కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు. ఈ రెండు శాఖల అధికారుల తనిఖీల వల్ల ప్రస్తుతం కొంత వరకు గంజాయి విక్రయాలకు అడ్డుకట్ట పడినట్లయింది. 29 మంది నిందితులపై 16 కేసులు నమోదు చేశారు.

News April 16, 2024

భద్రాచలంలో బందోబస్తుకు 2వేల మంది పోలీస్‌ సిబ్బంది

image

భద్రాచలంలో 17, 18 తేదీలో జరిగే శ్రీరామనవమి, పట్టాభిషేకం వేడుకలకు రెండు వేల మంది పోలీస్‌ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ రోహిత్‌రాజ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సీతారాముల కల్యాణానికి వీవీఐపీ, వీఐపీలతో పాటు సామాన్య భక్తులు అధిక సంఖ్యలో వస్తారని భద్రత దృష్ట్యా ఇప్పటి నుంచే కూంబింగ్‌ చేస్తున్నామని తెలిపారు.

News April 16, 2024

పొంగులేటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్ఠానం?

image

ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరనేది క్లారిటీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల రేసులో పలువురు ఉండగా తాజాగా కాంగ్రెస్ అధిష్ఠానం పొంగులేటి ప్రసాద్ రెడ్డిని ఫైనల్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రసాద్ రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు తెలిపారు. కాగా అధికార పార్టీ అభ్యర్థి ప్రకటనతో జిల్లాలో ఎన్నికల ప్రచారం ఊపొందుకోనుంది.

News April 16, 2024

నారాయణపేట జన జాతర సభలో అపశ్రుతి

image

నారాయణపేటలో రాత్రి జరిగిన కాంగ్రెస్ జన జాతర సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. జన జాతర సభకు వచ్చిన దామరగిద్ద మండలం మొగల్ మడక గ్రామానికి చెందిన ఎడ్ల బుగ్గప్ప గుండెపోటుతో మృతిచెందాడు. సభలో పాల్గొనేందుకు కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి మధ్యాహ్నం సభకి వచ్చిన బుగ్గప్ప సభా ప్రాంగణంలోనే కుప్పకూలాడు. వెంట వచ్చిన కార్యకర్తలు గమనించి జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

News April 16, 2024

పేదలను ఆదుకునే బాధ్యత మీ చేతుల్లోనే: రేవంత్ రెడ్డి

image

నారాయణపేటలో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచార శంఖారావం పూరించారు. ఈ మేరకు క్రీడా మైదానంలో నిర్వహించిన జనజాతర సభలో ప్రజలనుదేశించి మాట్లాడారు. “గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసి పేదలను ఆదుకునే బాధ్యతను మీ చేతుల్లోనే పెడతానని.. MBNR,NGKL పార్లమెంట్ స్థానాలు గెలవాలని పిలుపునిచ్చారు. నా పాలమూరులో తప్పు జరిగితే జాతీయ స్థాయిలో చెప్పుకునే పరిస్థితే ఉండదని” అన్నారు.