Telangana

News April 16, 2024

BRS పోరాటానికి భయపడే సీఎం ప్రకటన: హరీశ్‌రావు

image

ఆగస్టు 15 నాటికి రైతులకు రుణమాఫీ చేస్తామంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనపై మాజీ మంత్రి హరీశ్‌రావు ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకే ఈ ప్రకటన చేశారని విమర్శించారు. డిసెంబర్‌ 9న రుణమాఫీ చేయనందుకు సీఎం క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. రుణమాఫీపై BRS చేస్తున్న పోరాటానికి భయపడే రేవంత్‌ ప్రకటన చేశారన్నారు.

News April 16, 2024

KMR: రూ. కోట్లలో మోసం.. చిట్ ఫండ్ నిర్వాహకుల అరెస్ట్

image

కామారెడ్డిలోని SLVS చిట్ ఫండ్ కంపెనీ నిర్వాహకులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు CI చంద్ర శేఖర్ రెడ్డి వెల్లడించారు. SLVS చిట్ ఫండ్ కంపెనీ పేరిట మోసాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదు అందిందని CI పేర్కొన్నారు. దీంతో విచారణ చేపట్టి కామారెడ్డితో పాటు పలు ప్రాంతాల్లో రూ. కోట్లకు పైగా మోసం చేసినట్లు తేలిందని తెలిపారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే KMR పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

News April 16, 2024

నార్నూర్: ఖాళీ బిందెలతో 3 కిలోమీటర్లు నడిచి నిరసన

image

నార్నూర్ మండలం భీంపూర్ పంచాయతీ కొలాం బొజ్జుగూడగిరిజనులు మంచినీరు రావడం లేదని నిరసన తెలిపారు. కొలంగూడ నుంచి ఎంపీడీవో కార్యాలయానికి ఖాళీ బిందెలతో 3 కి.మీ కాలినడకన వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. 45 రోజులుగా మంచి నీటి సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారు పేర్కొన్నారు. MLA కోవ లక్ష్మి మిషన్ భగీరథ పైపులైన్ కోసం రూ. 5 లక్షలు మంజూరు చేసినా అధికారులు స్పందించకపోవడంతో నీటి వెతలు తప్పడం లేదన్నారు.

News April 16, 2024

సిద్దిపేట: వరి పంటపై జాగ్రత్తలు తప్పనిసరి !

image

ఆరుగాలం శ్రమించి పండించిన వరి పంట చేతికొచ్చే సమయంలో రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సకాలంలో పంటను కోసి సరైన నాణ్యత ప్రమాణాలు పాటిస్తే విపణిలో మంచి ధర పలుకుతుందని సిద్దిపేట తోర్నాల వ్యవసాయ పరిశోధన కేంద్రం కోఆర్డినేటర్, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జక్కుల విజయ్ సూచిస్తున్నారు. ప్రస్తుతం కూలీల కొరత వేధిస్తున్న నేపథ్యంలో యంత్రాలు వినియోగిస్తే తక్కువ సమయంలో కోత చేసుకోవచ్చని అన్నారు.

News April 16, 2024

NGKL: ముగిసిన జవాబు పత్రాల మూల్యాంకనం

image

నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో జరిగిన 2023-24 ఏడాది టెన్త్ జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసింది. ఇందులో WNPT, NGKL జిల్లాకు చెందిన 637 మంది ఉపాద్యాయులు పాల్గొన్నారు. ప్రతి టీచర్ ఒక రోజు 40 పేపర్లు వాల్యుయేషన్‌ చేశారు. ఏప్రిల్ 3 నుంచి 13 వరకు జరిగిన వాల్యుయేషన్‌లో  జిల్లాకు వచ్చిన 1,53,336 పేపర్లను దిద్ది విద్యార్థులు సాధించిన మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.  

News April 16, 2024

బాలికపై లైంగికదాడి.. దోషికి యావజీవ కారాగార శిక్ష

image

ప్రేమ పేరిట మాయమాటలు చెప్పి బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడ్డ BNG మండల పరిధిలోని చందుపట్లకు చెందిన నిందితుడికి న్యాయస్థానం జీవిత ఖైదు, రూ.25 వేలు జరిమానా విధిస్తూ.. RR జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి ఎంకే పద్మావతి సోమవారం తీర్పునిచ్చారు. బాధిత బాలికకు రూ.పది లక్షల పరిహారం ఇవ్వాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు సిఫార్సు చేసింది. 2017లో బాలికను అపహరించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

News April 16, 2024

శ్రీరామ నవమి రోజు భక్తులందరికీ ఉచిత దర్శనం

image

భద్రాద్రి శ్రీరామచంద్రుడి కల్యాణ ఘడియలు దగ్గర పడుతున్న కొద్దీ, భద్రాద్రి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఈనెల 17 న సీతారాముల కళ్యాణం రోజు భక్తులు ఉచిత దర్శనం చేసుకోవచ్చని ఈఓ రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులకు శీఘ్ర దర్శనం కొరకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నామని ఆలయ ఈఓ రమాదేవి తెలిపారు. ఆ రోజు ప్రత్యేక అర్చనలు, వంద రూపాయలు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు అమె తెలిపారు.

News April 16, 2024

KNR: కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా వెలిచాల!

image

KNR కాంగ్రెస్‌ MP అభ్యర్థిగా వెలిచాల రాజేందర్‌ రావు పేరు దాదాపు ఖరారైనట్లు తెలిసింది. MP టికెట్‌పై ఢిల్లీ అధిష్ఠానం ఇంకా నిర్ణయం తీసుకోనప్పటికీ.. మొదటి నుంచి ఆశావహుల జాబితాలో మాజీ MLA అలిగిరెడ్డి ప్రవీణ్‌ రెడ్డి, వెలిచాల ఉన్నారు. వీరిద్దరూ నువ్వానేనా అన్నట్లు టికెట్‌ కోసం పోటీపడుతున్నారు. అన్ని అంశాలను పరిశీలించిన అధిష్ఠానం వెలిచాల వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. దీనిపై క్లారిటీ రావల్సి ఉంది.

News April 16, 2024

హైదరాబాద్‌ వాసులకు OFFER

image

హైదరాబాద్‌ వాసులకు ముఖ్య గమనిక. బల్దియా అధికారులు ఎర్లీబర్డ్‌ స్కీమ్ అందుబాటులోకి తీసుకొచ్చారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నును చెల్లిస్తే 5 శాతం రిబేట్‌ పొందవచ్చని కమిషనర్ రోనాల్డ్ రాస్ స్పష్టం చేశారు. ఏప్రిల్ 30వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. GHMC పరిధి ప్రజలు సద్వినియోగం చేసుకోండి.
SHARE IT

News April 16, 2024

నిర్మల్: మహిళ మెడలోంచి బంగారు గొలుసు అపహరణ

image

నిర్మల్ పట్టణానికి చెందిన యమున అనే మహిళ నుంచి 2 తులాల బంగారు గొలుసు గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం అపహరించారు. బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా శివాజీ చౌక్ వద్ద బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు గొలుసు లాక్కెళ్లారు. పోలీసులకు సమాచారం అందించారు. సీసీ ఫుటేజీల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. కేసు నమోదు చేసినట్లు సీఐ అనిల్ తెలిపారు.