Telangana

News April 15, 2024

ఎల్లారెడ్డి మాజీ MLA కారులో డబ్బులు పట్టివేత

image

ఎన్నికల కోడ్‌ వేళ ఎల్లారెడ్డి మాజీ MLA కారులో డబ్బులు పట్టుబడ్డాయి. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండల శివారులో సోమవారం పోలీసులు వాహనాల తనిఖీలు చేశారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ వాహనంలో రూ.1,80,000 పట్టుబడినట్లు SI ఆనంద్ గౌడ్ తెలిపారు. ఎలాంటి ఆధారాలు చూపనందున సీజ్ చేసి కలెక్టర్ కార్యాలయంలో డిపాజిట్ చేసినట్లు పేర్కొన్నారు. కారులో ఉన్న నితిన్ రెడ్డి, మనోజ్‌లను అదుపులోకి తీసుకున్నారు.

News April 15, 2024

NLG: గ్రామాల్లో నిరుపయోగంగా నీటి తొట్లు!

image

ఉమ్మడి జిల్లాలో ఎండాకాలంలో పశువుల దాహం తీర్చడానికి ఉపాధిహామీ నిధులతో నిర్మించిన నీటి తొట్లు నిరుపయోగంగా మారాయి. కొన్ని గ్రామాల్లో నీళ్లతో ఉండాల్సిన తొట్లలో చెత్తాచెదారం పేరుకుపోయాయి. NLG, SRPT, యాదాద్రి BNG జిల్లాలోని అనేక గ్రామాల్లో మూడేళ్లక్రితం గ్రామానికి రెండు చొప్పున పశువుల నీటి తొట్లు నిర్మించారు. కానీ ఎక్కడా తొట్లలో నీళ్లు నింపి పశువులకు దప్పిక తీరుస్తున్న దాఖలాలు లేవని రైతులు తెలిపారు.

News April 15, 2024

త్వరలో లక్ష 30వేల ఎకరాలకు నీళ్లు: సీఎం రేవంత్

image

పాలమూరు పక్కనే కృష్ణా నది ఉన్నా.. గత బీఆర్ఎస్ పాలనలో మనకు చుక్క నీరు ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నారాయణపేట సభలో ఆయన మాట్లాడుతూ.. త్వరలో లక్ష 30వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వబోతున్నామని అన్నారు. వికారాబాద్-కృష్ణ రైల్వే లైన్‌ను ఆనాడు కాంగ్రెస్ కేటాయించిందని.. కానీ BRS, బీజేపీ పార్టీలు కుట్ర చేసి ఆపాయన్నారు. బీఆర్ఎస్ చిత్రహింసలు పెట్టినా.. తమ కార్యకర్తలు కాంగ్రెస్ జెండాను వీడలేదని అన్నారు.

News April 15, 2024

పార్టీకి మోసం చేసిన వ్యవహారంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత: కేటీఆర్

image

వరంగల్‌లో చివరి క్షణంలో కడియం కుటుంబం పార్టీకి మోసం చేసిన వ్యవహారం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వరంగల్ జిల్లా నేతల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. కొందరు నాయకులు వలస వెళ్లినంత మాత్రాన ఎలాంటి నష్టం లేదని, ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారని, ప్రతి కార్యకర్త తానే అభ్యర్థిగా భావించి బీఆర్ఎస్ గెలుపు కోసం కదం తొక్కాలని అన్నారు.

News April 15, 2024

NLG: జిల్లాలో రూ.9 కోట్లపైనే పట్టుబడిన నగదు, వస్తువులు

image

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నల్లగొండ జిల్లాలో ఇప్పటి వరకు జరిపిన తనిఖీలలో తగిన పత్రాలు లేని 9.17 కోట్ల రూపాయల విలువైన నగదు, మద్యం, బంగారం ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ చందనాదీప్తి తెలిపారు. అంతరాష్ట్ర సరిహద్దు వెంట నిఘా ఉంచామని వాడపల్లి, అడవిదేవులపల్లి టెయిల్పాండ్, నాగార్జునసాగర్ వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేసి అక్రమ రవాణా అడ్డుకుంటున్నట్లు వివరించారు.

News April 15, 2024

యాదాద్రి ఆలయ వార్షిక ఆదాయ వ్యయాలు

image

యాదగిరి శ్రీవారి దేవస్థాన 2023- 24 ఆర్థిక సంవత్సర ఆదాయం వ్యయాలు ఆలయ ఈవో వెల్లడించారు. అందులో వసతి గృహాలు, హుండీలు, వ్రతాలు,VIP& బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు, తలనీలాలు, ప్రసాదాలు, తదితర విభాగాల నుండి మొత్తం కలిపి రూ. 224,25,87,229 ఆదాయం వచ్చింది. సిబ్బంది వేతనాలు, పెన్షన్లు, ప్రసాదాల సరుకులు, ప్రభుత్వ పన్నులు, సేవలు, ఎలక్ట్రానిక్ & వాటర్, భక్తుల వసతులు తదితర విభాగాల కలిపి రూ. 214,55,85,249 వ్యయం.

News April 15, 2024

NLG: ఉమ్మడి జిల్లాపై ప్రధాన పార్టీల ఫోకస్

image

ఉమ్మడి జిల్లాపై ప్రధాన పార్టీలు ఫోకస్ పెంచాయి. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలతో క్షేత్రస్థాయిలో జోరు పెంచాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఉమ్మడి జిల్లాలోని NLG, BNG పార్లమెంటు స్థానాల్లో త్రిముఖ పోటీ నెలకొంది. గెలుపు కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తుండటంతో పోటీ ఆసక్తి రేకెత్తిస్తుంది. ఉమ్మడి జిల్లాలో ఈసారి బిజెపి రెండు స్థానాల్లో గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నది.

News April 15, 2024

ఖమ్మం: శ్రీరామనవమికి 238 ప్రత్యేక బస్సులు

image

భద్రాచలంలో ఈ నెల 17న జరగబోయే శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవానికి మొత్తం 238 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఖమ్మం రీజినల్ మేనేజర్ వెంకన్న తెలిపారు. అన్ని ప్రధాన బస్టాండ్‌ల నుంచి ఏప్రిల్ 16 నుండి ఏప్రిల్ 18 వరకు ఈ బస్సులు నడపనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులలో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందన్నారు. హైదరాబాద్ నుండి భద్రాచలానికి రిజర్వేషన్ సౌకర్యం కలదని పేర్కొన్నారు.

News April 15, 2024

‘పాలమూరు అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం’

image

ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధి చెందాలంటేకాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఎంపీ అభ్యర్థి చల్ల వంశీచంద్ రెడ్డి అన్నారు. నారాయణపేటలో నిర్వహించిన జన జాతర సభలో మాట్లాడారు. నారాయణపేట బిడ్డ అంటున్న డీకే అరుణ నారాయణపేటకు అదనంగా నిధులు తీసుకొచ్చినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. గద్వాలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు కృషి చేసిన వ్యక్తి డీకే అరుణ అని ఆరోపించారు.

News April 15, 2024

MDK: మాజీ MLA కారులో డబ్బులు పట్టివేత

image

ఎన్నికల కోడ్‌ వేళ మాజీ MLA కారులో డబ్బులు పట్టుబడ్డాయి. హవేలీ ఘనపూర్ మండల శివారులో సోమవారం పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ వాహనంలో రూ. 1,80,000 పట్టుబడినట్లు SI ఆనంద్ గౌడ్ తెలిపారు. ఎటువంటి ఆధారాలు చూపనందున సీజ్ చేసి కలెక్టర్ కార్యాలయంలో డిపాజిట్ చేసినట్లు పేర్కొన్నారు. కారులో ఉన్న నితిన్ రెడ్డి, మనోజ్‌లను అదుపులోకి తీసుకున్నామన్నారు.