Telangana

News September 9, 2024

HYD: సైబర్ నేరాల నియంత్రణపై FOCUS

image

HYDలో సైబర్ నేరాల నియంత్రణకు, 7 జోన్లలో ప్రత్యేక సైబర్ సెల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిరోజూ 20-30 సైబర్ క్రైమ్ ఫిర్యాదులు వస్తుండగా, రూ.లక్ష వరకు నష్టపోయిన కేసులను స్థానిక పోలీస్ స్టేషన్లలో దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ క్రైమ్ నేరాల పై త్వరగా చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయడమే ఈ సెల్స్ ప్రధాన లక్ష్యం అని తెలిపారు.

HYD శివారులో ట్రామా కేంద్రాల ఏర్పాటు..!

image

HYD శివారులో ఉన్న జాతీయ, రాష్ట్ర రహదారుల్లో ట్రామా కేంద్రాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా రూ.1,116 కోట్లు అవసరం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు గోల్డెన్ హవర్ మిస్ కాకుండా ఉంటే ప్రాణాలు కాపాడొచ్చని, క్షతగాత్రులకు వైద్యం అందించటం ట్రామా కేంద్రాల ద్వారా సాధ్యమని ప్రభుత్వం నమ్ముతోంది.

అసౌకర్యాలకు నిలయంగా కుంటాల జలపాతం

image

నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతం వద్ద కనీస సౌకర్యాలు లేక పర్యాటకులు వేదన అనుభవిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి విశ్రాంతి గదులు లేవు. మెట్ల మార్గంలో కనీసం సేద తీరే పరిస్థితి లేదు. మార్గమధ్యలో వర్షం కురిస్తే పూర్తిగా తడిసి పోవాల్సిందే. చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతరులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. జలపాతం వద్ద మూత్రశాలలు, మరుగుదొడ్లు లేవు. దీంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

News September 9, 2024

అవినీతి నిర్మూలనే ధ్యేయం: సీఎండీ వరుణ్ రెడ్డి

image

TGNPDCL సంస్థలోని ఉద్యోగులు భారీ వర్షాలను వరదలను సైతం లెక్కచేయకుండా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి నిబద్ధతతో పనిచేస్తున్నారని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి తెలిపారు. అలాగే విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది, ఎవరైనా లంచం అడిగితే 92810 33233 నంబరుకు, విజిలెన్స్ విభాగానికి సమాచారం ఇవ్వాలన్నారు. అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1064లో ఫిర్యాదు చేయాలన్నారు.

News September 9, 2024

బంజారాహిల్స్: హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగ‌తిస్తున్నాం: హరీశ్ రావు

image

ఎమ్మెల్యేల అన‌ర్హ‌త పిటీష‌న్‌ల‌ పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగ‌తిస్తున్నామని మాజీ మంత్రి హరీశ్ రావు ఎక్స్ వేదికగా తెలిపారు. ‘హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ అప్ర‌జాస్వామ్య విధానాల‌కు చెంప పెట్టు. తెలంగాణ హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అన‌ర్హ‌త‌కు గురికావ‌డం త‌థ్యం. అన‌ర్హ‌త కార‌ణంగా ఉప ఎన్నిక‌లు జ‌రిగే నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ఎస్ గెలుపు త‌థ్యం’ అని అన్నారు.

MBNR: అక్రమాలపై ప్రత్యేక హైడ్రా ఫోకస్.!

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో హైడ్రా ప్రకంపనలు మొదలయ్యాయి. CM రేవంత్ రెడ్డి ఆదేశాలతో సర్వే, భూ దస్త్రాల శాఖ అప్రమత్తమైంది. పురపాలక సంఘాల్లో, గ్రామాల్లో చెరువులు, కుంటలు, వాగుల్లో అక్రమ నిర్మాణాలను గుర్తించి ఏ రోజుకు ఆ రోజు నివేదిక రూపంలో సాయంత్రం 4 గంటల వరకు కమిషనర్‌కు మెయిల్ పంపించాలని ఆదేశించారు. నివేదిక ఎలా ఇవ్వాలో నమూనాను కూడా పంపించారు. ఈ ప్రక్రియ ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగనుంది.

News September 9, 2024

వరంగల్ మార్కెట్‌లో మిర్చి ధరల వివరాలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజా మిర్చి క్వింటాకు నేడు రూ.18,200 పలికింది. అలాగే 341 రకం మిర్చికి రూ.14,500 ధర రాగా వండర్ హాట్(WH) మిర్చికి రూ.15,500 ధర వచ్చిందని వ్యాపారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు తగు జాగ్రత్తలు పాటిస్తూ నాణ్యమైన సరుకులు మార్కెట్‌కు తీసుకొని రావాలని అధికారులు సూచిస్తున్నారు.