Telangana

News April 15, 2024

క్యూ ఆర్ కోడ్ రిలీజ్ చేసిన భద్రాద్రి జిల్లా ఎస్పీ

image

శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో ట్రాఫిక్ రూట్, పార్కింగ్ స్థలాలు, తలంబ్రాలు, లడ్డూ ప్రసాదం స్టాల్స్, కల్యాణ మండపం యొక్క సెక్టార్ ప్లాన్ కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ క్యూఆర్ కోడ్ లో పూర్తి సమాచారం లభిస్తుందని తెలిపారు.

News April 15, 2024

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డ్రగ్ ఇన్‌స్పెక్టర్

image

నల్గొండలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ సోమశేఖర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. మిర్యాలగూడ మండలం కొత్తగూడెంలోని నూకల వెంకట్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆసుపత్రి ఫార్మసీ అనుమతి కోసం 20,000 డిమాండ్ చేశాడు. భాదితుడు సోమశేఖర్‌కు రూ. 18 వేలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ తెలిపారు.

News April 15, 2024

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వడ్డీ వ్యాపారుల ఇళ్లల్లో తనిఖీలు

image

నిజామాబాద్ నగరం, జిల్లా వ్యాప్తంగా వడ్డీ వ్యాపారుల ఇళ్లలో పోలీసుల సోదాలు నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం నుంచి వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో ఏక కాలంలో తనిఖీలు చేస్తున్నారు. వ్యాపారుల వద్ద నుంచి అప్పు తీసుకున్న వారికి సంబంధించిన ఆస్తి పత్రాలు, చెక్కులు, ప్రామిసరీ నోట్లను సీజ్ చేశారు. పలువురు వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 15, 2024

మరి కాసేపట్లో సభా ప్రాంగణానికి సీఎం రేవంత్ రెడ్డి

image

పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి పాలమూరుకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో నారాయణపేటలో జరిగే జన జాతర సభలో పాల్గొననున్నారు. మరి కాసేపట్లో ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సభ ప్రాంగణానికి సీఎం చేరుకోనున్నారు. సభ ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్‌కు వెళ్తారని తెలుస్తోంది. కాగా పాలమూరు సొంత జిల్లా కావడంతో ఇక్కడ గెలుపును ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

News April 15, 2024

NRPT: రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న నేతలు

image

నారాయణపేటకు చెందిన బీజేపీ రాష్ట్ర నాయకులు రథంగ్ పాండు రెడ్డి ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన విషయం విదితమే. కాగ ఆయన తాజాగా తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు చెప్పారు. ఈయనతో పాటు రాజీనామా చేసిన జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురామయ్య గౌడ్, మైనారిటీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మహిమూద్ అలీ వారి నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. సోమవారం డీకే అరుణతోపాటు కార్యక్రమాల్లో వీరు పాల్గొన్నారు.

News April 15, 2024

కత్తిమీద సాములా మెదక్ ఎంపీ ఎన్నికలు

image

లోక్‌సభ ఎన్నికలు ప్రధాన పార్టీల నేతలకు అగ్ని పరీక్షలా మారాయి. ఆయా BRS, కాంగ్రెస్, BJP అభ్యర్థుల గెలుపు బాధ్యతలు అప్పగించడంతో ప్రచారంలో తలమునకలై ఉన్నారు. మెదక్‌ లోక్‌సభ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో BRS-6 చోట్ల, కాంగ్రెస్‌ ఒక చోట గెలుపొందాయి. మెదక్ ఎంపీ స్థానాన్ని ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో రాజకీయాలు రంజుగా మారాయి. దీంతో ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు కత్తి మీద సాములా మారాయి.

News April 15, 2024

ఆదిలాబాద్: కాంగ్రెస్‌లోకి మాజీ MLA..?

image

బోథ్ మాజీ MLA రాథోడ్ బాపూరావ్ కాంగ్రెస్‌లో చేరుతారనే టాక్ నడుస్తోంది. సోమవారం ఆయన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్కను కలవడం దీనికి బలాన్ని చేకూరుస్తుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో BRS సిట్టింగ్‌ MLAగా ఉన్న ఆయనకు ఆ పార్టీ టికెట్ ఇవ్వలేదు. దీంతో అసంతృప్తితో బీజేపీలో చేరారు. కొద్దికాలంపాటు ఆ పార్టీలో కొనసాగిన ఆయన BJPకి రాజీనామా చేయడంతో కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరుగుతోంది.
– మీ కామెంట్..?

News April 15, 2024

మధుయాష్కి గౌడ్‌కు మాతృవియోగం

image

టీపీసీసీ ప్రచారకమిటీ ఛైర్మన్, నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ తల్లి అనసూయ (86) కన్నుమూశారు. వయసుసంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె ఈ ఉదయం బంజారాహిల్స్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె పార్థివదేహాన్ని మధ్యాహ్నం ఓల్డ్ హయత్ నగర్లోని మధుయాష్కి స్వగృహానికి తీసుకురానున్నారు. ఇవాళ సాయంత్రం ఆమె అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది.

News April 15, 2024

ఎంపీ సీట్ల కేటాయింపులో మాదిగలకు అన్యాయం: మందకృష్ణ

image

రాష్ట్రంలో పార్లమెంటు సీట్ల కేటాయింపులో మాదిగలకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. ఆదివారం ఆయన సిరిసిల్లలో జరిగిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి తన కుర్చీని కాపాడుకునేందుకు మాలల మాట వింటూ, మాదిగలకు అన్యాయం చేస్తున్నాడని మండిపడ్డారు.

News April 15, 2024

HYD: 21 రోజుల్లో నిర్మాణాలకు ఆమోదం

image

గ్రేటర్ HYD పరిధిలో నిర్మాణ అనుమతుల దరఖాస్తులు 21 రోజుల్లో ఆమోదం పొందాలని, లేనిపక్షంలో చర్యలుంటాయని GHMC కమిషనర్ రోనాల్డ్ రాస్ అధికారులను హెచ్చరించారు. ఉద్దేశపూర్వకంగా దరఖాస్తులను తొక్కిపెట్టే వారిని సహించేది లేదన్నారు. ప్రణాళిక విభాగం కార్యకలాపాల పై ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచుతారని తెలిపారు.