Telangana

News April 15, 2024

కాంగ్రెస్‌లో చేరిన ఏపూరి సోమన్న

image

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. తొలుత షర్మిల పార్టీలో చేరిన ఆయన.. అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్‌లో చేరారు. ఇప్పుడు ఆ పార్టీని వీడి హస్తం గూటికి చేరారు. ఈరోజు హైదరాబాద్‌లో పార్టీ కండువా కప్పి ఆయనను సాదరంగా రాజగోపాల్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.

News April 15, 2024

HYD: నకిలీ టికెట్‌తో విమానం ఎక్కిన వ్యక్తి అరెస్ట్

image

నకిలీ టికెట్‌తో విమానం ఎక్కిన ఓ వ్యక్తి శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ అయ్యాడు. APలోని NTR జిల్లాకు చెందిన వ్యక్తి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసులో గోవా వెళ్లడానికి టికెట్‌ను తీసుకొని గోవా విమానంలో కూర్చున్నాడు. ఆయన బంధువు కోటేశ్వర్ రావు అదే నంబర్‌తో టికెట్, వెబ్ బోర్డింగ్ పాస్ సృష్టించి గోవా విమానంలో కూర్చోగా.. చెక్ చేసి నకిలీ టికెట్‌గా గుర్తించారు. దీంతో భద్రతాధికారులు అరెస్ట్ చేశారు.

బిక్కనూర్: వడదెబ్బ తగిలి రైతు మృతి

image

కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. అంతంపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు వడదెబ్బ తగిలి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన జక్కుల నరసింహులు ఆదివారం తన వ్యవసాయ బావి వద్ద పనులు చేస్తుండగా వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురయ్యాడు. అతన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు తెలిపారు.

News April 15, 2024

కాగజ్ నగర్: బిల్లులు ఇవ్వడం లేదని స్కూలుకు తాళం

image

కాగజ్నగర్ పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు నూతన బిల్డింగ్ నిర్మించి ఎనిమిది నెలలైనా బిల్లు ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆగ్రహంతో భవనం నిర్మించిన కాంట్రాక్టర్ తాళం వేశారు. ఈ పాఠశాలలో సుమారు 252 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈరోజు నుంచి ఫైనల్ పరీక్షలు ప్రారంభం కావడంతో విద్యార్థులు స్కూల్ ముందే కూర్చున్నారు. దీంతో ఉన్నతాధికారులు మూడు రోజుల గడువు కాంట్రాక్టర్‌కు ఇవ్వడంతో తాళం తీశారు.

News April 15, 2024

వరంగల్ గడ్డ పై గులాబీ పార్టీ జెండా ఎగురవేయాలి: కేటీఆర్

image

కేసీఆర్ స్వగృహంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలు ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్‌తో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ ఎన్నికలలో వరంగల్ గడ్డ పై గులాబీ పార్టీ జెండా ఎగురవేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.

News April 15, 2024

ప్రారంభమైన మార్కెట్.. పత్తి ధర ఎంతంటే?

image

నాలుగు రోజుల సుదీర్ఘ విరామం అనంతరం వరంగల్ మార్కెట్ ఈరోజు పునఃప్రారంభం కావడంతో పత్తి తరలివచ్చింది. అయితే ధర మాత్రం గత వారంతో పోలిస్తే ఈరోజు భారీగా తగ్గింది. ఈరోజు క్వింటా పత్తి ధర రూ.7,100 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. ధర రోజు రోజుకీ పడిపోతుండటంతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. కాగా, మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతోంది.

News April 15, 2024

HYD: కూతురు కళ్లేదుటే తండ్రి దుర్మరణం

image

రోడ్డు ప్రమాదంలో కూతురు కళ్లేదుటే తండ్రి మృతిచెందాడు. మేడ్చల్ పోలీసుల సమాచారం.. మెదక్‌ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్‌కు చెందిన రామ్ మురాట్(29) తన కుమార్తె(6)తో కలిసి ఆదివారం రాత్రి బైక్‌పై మేడ్చల్ నుంచి వస్తుండగా హైవేపై ఐసీఐసీఐ బ్యాంక్ సమీపంలో లారీ తగిలింది. దీంతో కిందపడ్డ రామ్ పైనుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే చనిపోయాడు. చిన్నారి స్వల్పగాయాలతో బయటపడింది. ఘటనపై కేసు నమోదు చేశారు.

భువనగిరి: ఆకట్టుకుంటున్న ఓటర్ల ఫ్లెక్సీ

image

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని నెమిల గ్రామంలో ఓటర్ల పేరుతో వెలిసిన ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి వచ్చే రాజకీయ పార్టీలు, నాయకులను ఆలోచింపజేస్తుంది. ఉచిత పథకాలు, గ్యారంటీలు ప్రకటించిన పార్టీలకు ఇది చెంపపెట్టు అని ప్రచారం జరుగుతుంది.